కేరళలో (Kerala) అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కన్నూరు జిల్లాలోని సజేష్ కు చెందిన ఒక 11 నెలల దూడ పాలను ఇవ్వడం ప్రారంభించింది. అది రోజుకు కనీసం మూడు లీటర్ల పాలను ఇస్తుంది. ఇక్కడ వింతే ముంది అంటారా.. అది ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు. ఈ విచిత్రం తెలియడటంతో చుట్టుపక్కల వారు దూడను చూడటానికి వస్తున్నారు.
పూర్తి వివరాలు.. కన్నూరు జిల్లాకు చెందిన సజేష్ రైతు. అతను ఆవులు, గొర్రెలు, పౌల్ట్రీని నిర్వహిస్తున్నాడు. కాగా, ఇతని తల్లి పద్మవతి, భార్య, పిల్లల సహాయంతో దీన్ని నిర్వహిస్తున్నాడు. 2021 సంవత్సరంలో ఒక ఆవు, దూడలను (Milk produce) కొనుగోలు చేశాడు. ఆ తర్వాత.. కొన్ని రోజులకు ఆవుకి ఇన్ ఫెకన్ సోకింది. దీంతో దాన్ని అమ్మేశాడు. ఈ క్రమంలో.. దూడ పొదుగు ఉబ్బి ఉండటాన్ని ఒక మహిళ గమనించింది. వెంటనే విషయాన్ని సజేక్ కు చెప్పింది. అతను కూడా దాన్ని పరిశీలించి చూశాడు. పొదుగు దగ్గర గట్టిగా ఉండటాన్ని గమనించాడు.
ఆ తర్వాత.. ఒక రోజు పోదుగును పితికి చూశాడు. పాలు ధారగా వచ్చాయి. పాలు బాగానే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి రోజు రెండు పూటల పాలను పిండసాగాడు. పాలు చిక్కగా, తాగడానికి బాగానే ఉన్నాయి. మాములు, ఆవులు, గేదెలు ఇచ్చేపాల మాదిరిగానే ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల వారు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక్కసారి కూడా గర్భం దాల్చని దూడ పాలివ్వడం పెద్ద వింతగా మారింది.
గత పదిహేను రోజుల నుంచి ఆవు రోజు దాదాపు మూడు లీటర్ల పాలను ఇస్తుంది. దీనిపై వెటర్నరీ డాక్టర్ అర్జున్.. కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వలన ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయని అన్నారు. దీనిపై పరిశోధనలు సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. ఆవు ఇస్తున్న పాలలో దాదాపు.. 8.8 శాతం కొవ్వు ఉన్నట్లు సమాచారం.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.