ఇండియాలో కొరోనా వైరస్ భయాలు... 11 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు

Corona Virus : ఇలాంటి భయంకరమైన ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే. ఆ చైనాలో ఆ వైరస్ ఎందుకు రావాలి... అది ఇండియాలోకి కూడా వచ్చేసిందనే టెన్షన్ కనిపిస్తోంది.

news18-telugu
Updated: January 25, 2020, 9:45 AM IST
ఇండియాలో కొరోనా వైరస్ భయాలు... 11 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు
ఇండియాలో కొరోనా వైరస్ భయాలు... 11 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు (credit - twitter - Reuters)
  • Share this:
Corona Virus : మన దేశంలో వైరస్‌లు వేగంగా వ్యాపించే రాష్ట్రాల్లో కేరళ ఒకటి, గతేడాది నిఫా వైరస్ దేశాన్ని భయపెట్టింది. సరే అదెలాగో వదిలింది కదా అనుకుంటే... ఇప్పుడు అదే కేరళలో కొరొనా వైరస్ వ్యాపించిందనే ఆందోళనలు కనిపిస్తున్నాయి. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. కానీ... ఇప్పుడు ఏడుగురికి ప్రత్యేక వైద్య పరీక్షలు జరుపుతున్నారు. ఏమీ లేకపోతే... ఆ పరీక్షలు ఎందుకు జరుపుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేరళే కాదు... ముంబైలో ఇద్దరు, బెంగళూరులో ఒకరు, హైదరాబాద్‌లో ఒకరికి కూడా ఇలాంటి ప్రత్యేక వైద్య పరీక్షలే జరుపుతున్నారు. వీళ్లందర్నీ ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షిస్తున్నారు. ఆల్రెడీ ఈ వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటికే 41 మంది చనిపోగా... ఆసియా, అమెరికా, యూరప్ దేశాల్లో 1300 మంది వ్యాధి సోకి ఆస్పత్రుల్లో ఉన్నారు. ఐతే... ఇండియాలో ఈ వైరస్ వ్యాపించిందా, లేదా అన్న దానిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికైతే ఇండియాలో వ్యాపించలేదనే అంటోంది. ఐతే... ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలే దీన్ని అడ్డుకోలేకపోయాయి. అలాంటప్పుడు ఇండియాలో ఇది వ్యాపించలేదని ఎలా చెప్పగలరని ప్రజలు అంటున్నారు. సమస్యేంటంటే... ఇండియాలో గనక కొరొనా వైరస్ వస్తే... దాన్ని ఆపడం చాలా కష్టం. మన దేశంలో జనాభా ఎక్కువ. పైగా వైద్య సదుపాయాలు తక్కువ. అందువల్ల కొరొనా వైరస్ ఇండియాకి ఎంతో డేంజర్.


ఇటీవల చైనా, హాంకాంగ్ నుంచీ ఇండియాకి... 20వేల మంది వచ్చారు. ఎయిర్‌పోర్టుల్లో థెర్మల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేసి వాళ్లందరికీ మెడికల్ చెకప్ చేశారు. ప్రస్తుతం ఇండియాలో 11 మందిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఐతే... కేరళలో మొత్తం 80 మందిని పరీక్షించారు. వారిలో 73 మందిలో ఈ వైరస్ కనిపించలేదు. మిగతా ఏడుగురికీ జ్వరం, దగ్గు ఉంది. ఇవి ఆ వైరస్ లక్షణాలే కావడంతో... వాళ్లకేమైనా సోకిందేమోననే అనుమానంతో ఉన్నారు.

మొత్తంగా ఇప్పుడు ఇండియా మొత్తం కొరొనా వైరస్ టెన్షన్‌తో ఉంది. ఎందుకంటే ఈ వైరస్ వస్తే వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి వ్యాక్సిన్ లేదు. మందు ఎప్పటికి కనిపెడతారో, అసలు కనిపెట్టగలరో లేదో కూడా తెలియదు. అందువల్ల ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందే. అంటే ముఖానికి కర్చీఫో, క్లాతో కట్టుకోవాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ, జ్వరంతో ఉంటే... వారిని ఆస్పత్రిలో చూపించుకోమనాలి. వారికి కాస్త దూరంగా ఉండాలి. రద్దు ప్రదేశాల్లో తిరగకుండా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి వైరస్ వచ్చిందంటే... మందు లేదు కాబట్టి... అది పోయే అవకాశాలు తక్కువ.
Published by: Krishna Kumar N
First published: January 25, 2020, 9:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading