• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • 109 YEARS COMPLETED FOR MOST TRAGIC INCIDENT UNKNOWN FACTS ABOUT RMS TITANIC 1912 FULL DETAILS HERE HSN GH

Titanic: రాత్రికి రాత్రే 1500 మంది మృతి.. సముద్రంలో టైటానిక్ మునిగిపోయి 109 ఏళ్లు పూర్తి.. ప్రపంచానికి తెలియని నిజాలివే..!

Titanic: రాత్రికి రాత్రే 1500 మంది మృతి.. సముద్రంలో టైటానిక్ మునిగిపోయి 109 ఏళ్లు పూర్తి.. ప్రపంచానికి తెలియని నిజాలివే..!

టైటానిక్

నీటిపై తేలియాడే విలాసవంతమైన నగరంగా పేరొందిన టైటానిక్.. 1912 ఏప్రిల్ 14న రాత్రివేళ మంచుకొండను ఢీకొట్టింది. దీంతో ఏప్రిల్ 15న ఓడ పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

  • Share this:
ప్రపంచ చరిత్రలో అతిపెద్ద విషాదంగా మిగిలిపోయిన టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయి నేటికి 109 ఏళ్లు నిండాయి. గత వందేళ్లుగా టైటానిక్ గురించి ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు. రాయల్ మెయిల్ షిప్ (RMS) టైటానిక్ బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నుంచి బయలుదేరి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. నీటిపై తేలియాడే విలాసవంతమైన నగరంగా పేరొందిన టైటానిక్.. 1912 ఏప్రిల్ 14న రాత్రివేళ మంచుకొండను ఢీకొట్టింది. దీంతో ఏప్రిల్ 15న ఓడ పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది చరిత్రలో అతిపెద్ద సముద్ర విపత్తులలో ఒకటిగా నిలిచిపోయింది. టైటానిక్ మునిగిపోయి 109 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రపంచానికి తెలియని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుందాం.

సముద్ర ప్రయాణాలకు స్వర్ణ యుగంగా పేరొందిన కాలంలో టైటానిక్‌ను నిర్మించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పెరుగుతున్న వలసదారులు, సంపన్న ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఇతర క్రూయిజ్ లైనర్లతో పోటీ పడటానికి దీన్ని రూపొందించారు. యూరప్, న్యూయార్క్ మధ్య వ్యాపారానికి ఈ ఓడను ఉపయోగించాలనుకున్నారు. బ్రిటిష్ షిప్పింగ్ కంపెనీ వైట్ స్టార్ లైన్ మూడు 'ఒలింపిక్ క్లాస్' లైనర్ల భవనం మాదిరిగా ఉండే ఓడను నిర్మించాలనుకుంది. ఆ తరువాత టైటానిక్ నిర్మాణం 1909, మార్చి 31న ప్రారంభమైంది. నార్త్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో ఉన్న హార్లాండ్ అండ్ వోల్ఫ్ షిప్ యార్డులో దీన్ని రూపొందించారు. టైటానిక్ ఆలోచన వచ్చినప్పటి నుంచి దీని నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.

నిర్మాణానికి భారీగా ఖర్చు
టైటానిక్ నిర్మాణానికి మొత్తం 7.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి విలువలో ఇది 192 మిలియన్ డాలర్లకు సమానం. వరదలను నిరోధించడానికి 16 వాటర్ టైట్ కంపార్ట్‌మెంట్లను వాడారు. వీటిని బల్క్ హెడ్స్ అనేవారు. వీటితో పాటు విలాసవంతమైన ప్రయాణానికి ఉద్దేశించింది కావడంతో తయారీ ఖర్చు కూడా భారీగా పెరిగింది. దాదాపు 3,000 మంది వర్కర్లు రె౦డు స౦వత్సరాలు నిరంతరాయంగా పనిచేసిన తర్వాత టైటానిక్ ఒక రూపానికి వచ్చింది. 1911, మే 31న ఓడ బేస్ బాడీ నిర్మాణం పూర్తి చేసుకొని లాంఛ్ అయ్యింది. అప్పట్లో ఈ సంఘటనను 10,000 మందికి పైగా చూశారు.
ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

అద్భుతమైన డిజైనింగ్
ఎన్నో అవరోధాలను ఎదుర్కొని 1912, ఏప్రిల్ 12న టైటానిక్ నిర్మాణం పూర్తి చేసుకుంది. అనంతరం ఏప్రిల్ 10న 2,200 మందికి పైగా ప్రయాణీకులు, సిబ్బందితో కలిసి తొలి ప్రయాణం మొదలు పెట్టింది. బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నుంచి టైటానిక్ తొలి సముద్రయానం ప్రారంభమైంది. థామస్ ఆండ్రూస్ అనే డిజైనర్ టైటానిక్‌ను డిజైన్ చేశారు. అప్పట్లో సముద్ర జలాల్లో అతిపెద్ద ఓడగా టైటానిక్ గుర్తింపు సాధించింది. కేవలం పరిమాణంలో మాత్రమే కాదు, ఓడ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో కూడా ఆండ్రూస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిసారి ఓడలోకి వెళ్లిన ప్రయాణికులు టైటానిక్ లోపల ఐరన్, గాజు డోమ్డ్ సీలింగ్, డిజైనింగ్, ఫినిషింగ్ చూసి ఆశ్చర్యపోయారు. ఎంతోమంది ధనవంతులు టైటానిక్‌లో ప్రయాణానికి నమోదు చేయించుకున్నారు. ఈ విలాసవంతమైన ఓడలో వెళ్లాలనుకున్న వారందరూ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.

109 Years completed for most tragic incident Unknown facts about RMS Titanic 1912 full details here రాత్రికి రాత్రే 1500 మంది మృతి.. సముద్రంలో టైటానిక్ మునిగిపోయి 109 ఏళ్లు పూర్తి.. ప్రపంచానికి తెలియని నిజాలివే..!
టైటానిక్

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

మొదటి ప్రయాణమే ఆఖరుది
తన తొలి సముద్ర ప్రయాణంలోనే టైటానిక్ అనుకోని ప్రమాదానికి గురైంది. ఏప్రిల్ 14న రాత్రి 11.40 గంటలకు అది ఒక పెద్ద మంచు కొండను ఢీకొట్టింది. దీంతో క్రమంగా ఓడ లోపలికి నీరు చేరి మునిగిపోయింది. "ఐస్బర్గ్, రైట్ ఎహెడ్" అనే మూడు పదాలు టైటానిక్‌ను చరిత్రలో భాగం చేశాయి. మంచు కొండను ముందే గుర్తించినప్పటికీ, ఓడ ప్రమాదానికి గురికాకుండా దాన్ని ఒక పక్కకు తీసుకెళ్లడం సాధ్యపడలేదు. ఇంజిన్లను రివర్స్ చేసి, ఓడను పక్కకు తిప్పడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే టైటానిక్ క్రూయిజ్ సైడ్ లైనర్ మంచుకొండను బలంగా ఢీకొట్టింది. ఫలితంగా ఓడ పక్క భాగం దెబ్బతిన్నది. ఆ తరువాత సిబ్బంది సంరక్షణ చర్యలు చేపట్టారు. ముందు మహిళలు, పిల్లలను లైఫ్ బోట్లలో బయటకు పంపారు. కానీ అప్పటికి ఓడలో కేవల౦ 20 లైఫ్ బోట్లు మాత్రమే ఉన్నాయి.

భారీగా ప్రాణనష్టం
ప్రమాదం జరిగిన సుమారు మూడు గంటల తరువాత.. అంటే ఏప్రిల్ 15, తెల్లవారుజామున 2.20 గంటలకు ఓడ సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. లైఫ్ బోట్లలో వెళ్లేందుకు అవకాశం దొరకని ప్రయాణికులు చల్లని, గడ్డకట్టుకుపోయే ఆ నీటిలో ప్రాణాలు వదిలారు. ఉదయం 4.10 గంటలకు అక్కడికి RMS కార్పతియా ఓడ చేరుకుంది. ఆ నౌకలోని సిబ్బంది మొదటి లైఫ్ బోట్ నుంచి బయటపడిన ప్రయాణికులను కాపాడారు. సుమారు 2,200 మందితో ప్రయాణం ప్రారంభించిన టైటానిక్ నుంచి కేవలం 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతిపెద్ద సముద్ర ప్రమాదాల్లో టైటానిక్ ఉదంతం ఒకటిగా నిలుస్తోంది.
Published by:Hasaan Kandula
First published:

అగ్ర కథనాలు