• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • 100 YEAR OLD MUSLIM MAN AMONG COVID HEROES HONOURED BY THE QUEEN MK GH

Global fundraising walk: నడక ద్వారా నిధులు సేకరించే కార్యక్రమం చేపట్టిన 101ఏళ్ల వ్యక్తి.. ప్రపంచ వ్యాప్తంగా 150 నగరాల్లో వాకింగ్....

Global fundraising walk: నడక ద్వారా నిధులు సేకరించే కార్యక్రమం చేపట్టిన 101ఏళ్ల వ్యక్తి.. ప్రపంచ వ్యాప్తంగా 150 నగరాల్లో వాకింగ్....

101 ఏళ్ల దబిరుల్ ఇస్లాం చౌదరి

లండన్‌కు చెందిన 101 ఏళ్ల దబిరుల్ ఇస్లాం చౌదరి కూడా ఆయన బాటను ఎంచుకున్నారు. రంజాన్ నెల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వాకింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని ద్వారా సేకరించిన నిధులను కోవిడ్ బాధితుల కోసం అందివ్వనున్నారు.

  • Share this:
గత ఏడాది కోవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారి కోసం నిధులు సేకరించేందుకు వందేళ్ల వృద్ధులు సైతం రోడ్లపైకి వచ్చారు. వీరిలో మాజీ బ్రిటిష్ సైనికుడు, కెప్టెన్ టామ్ మూర్ ఒకరు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్‌- బర్మా క్యాంపెయిన్‌లో పనిచేశారు. ఆ తరువాత బ్రిటిష్ సైన్యంలో వివిధ విభాగాల్లో సేవలందించారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో.. తన 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయన వాకింగ్ క్యాంపెయిన్ చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా భారీగా నిధులు సేకరించారు. ప్రస్తుతం లండన్‌కు చెందిన 101 ఏళ్ల దబిరుల్ ఇస్లాం చౌదరి కూడా ఆయన బాటను ఎంచుకున్నారు. రంజాన్ నెల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వాకింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని ద్వారా సేకరించిన నిధులను కోవిడ్ బాధితుల కోసం అందివ్వనున్నారు.

గత సంవత్సరం కోవిడ్ బాధితుల కోసం డబ్బు సేకరించిన కెప్టెన్ టామ్‌ మూర్‌ ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. తన 100వ పుట్టిన రోజు నాడు వాకింగ్ క్యాంపెయిన్ ఫండ్ రైజర్ కార్యక్రమం ద్వారా మూడు కోట్ల యూరోలు సేకరించారు. ఆ డబ్బును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఆయన ప్రయత్నాన్ని బ్రిటిష్ రాణి సైతం అభినందించారు. కానీ దురదృష్టవశాత్తూ కెప్టెన్‌ను ఈ ఫిబ్రవరిలో కరోనా బలితీసుకుంది. అతడిని స్ఫూర్తిగా తీసుకున్న దబిరుల్ ఇస్లాం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాకింగ్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.

* గత ఏడాది కూడా..
కెప్టెన్ టామ్ తనను ఎంతగానో ప్రభావితం చేశారని చెబుతున్నారు దబిరుల్. గత ఏడాది లాక్‌డౌన్ కాలంలో రంజాన్ సందర్భంగా ఆయన 4,20,000 యూరోలు సేకరించి విరాళంగా ఇచ్చారు. గత అక్టోబర్‌లో ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డును కూడా పొందారు. తూర్పు లండన్‌కు చెందిన ఈ వృద్ధుడు.. ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ అడుగుల వాకింగ్ ఛాలెంజ్ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నారు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉంటూనే ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 8,000 యూరోలు విరాళంగా సేకరించారు.

* వాకింగ్ ఛాలెంజ్‌ లక్ష్యం ఏంటి?
వాకింగ్ ఛాలెంజ్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఏప్రిల్ 24న జరగనుంది. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనేవారు స్థానిక పార్కులు, తోటల్లో తిరుగుతూ 15 లక్షల అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సేకరించిన నిధులు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభావితమైన ప్రజలకు, శరణార్థుల శిబిరాల్లోని ప్రజలకు అందివ్వనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 17న జరగాల్సి ఉంది. కానీ బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ మరణం కారణంగా వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా నగరాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవడం విశేషం.
First published:

అగ్ర కథనాలు