Explainer: Non fungible tokens: రూ.48 లక్షలకు కొని.. ఏకంగా 48 కోట్ల రూపాయలకు అమ్మేశాడు.. ఆ 10 సెకన్ల వీడియోలో ఏముందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఒక పది సెకన్ల వీడియోను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు ఆర్ట్ కలెక్టర్లు. 2020 అక్టోబరులో మయామికి చెందిన ఆర్ట్ కలెక్టర్ పాబ్లో రోడ్రిగ్జ్ ఫ్రేలే ఈ వీడియోను..

  • Share this:
ఒక పది సెకన్ల వీడియోను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు ఆర్ట్ కలెక్టర్లు. 2020 అక్టోబరులో మయామికి చెందిన ఆర్ట్ కలెక్టర్ పాబ్లో రోడ్రిగ్జ్ ఫ్రేలే ఈ వీడియోను 67,000 డాలర్లకు (దాదాపు 48 లక్షల రూపాయలు) కొనుగోలు చేశాడు. దీన్ని ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడవచ్చు. కానీ అతడు అన్ని వేల డాలర్లు పెట్టి వీడియోను సొంతం చేసుకున్నాడు. గత వారం అదే వీడియోను 6.6 మిలియన్ డాలర్లకు (దాదాపు 48 కోట్ల రూపాయలు) అమ్మడం విశేషం. బీపుల్ అనే డిజిటల్ ఆర్టిస్ట్ ఈ వీడియోను రూపొందించారు. దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రామాణీకరించారు. ఈ టెక్నాలజీ.. వీడియో ఎవరి సొంతం, అది ఒరిజినల్ వీడియో అవునా కాదా అనే వివరాలను డిజిటల్ సిగ్నేచర్ ద్వారా నమోదుచేస్తుంది. ఇలాంటి వాటిని నాన్ ఫంజిబుల్ టోకెన్ (NFT)లు అంటారు. వీటిని ఆన్‌లైన్‌లో వర్చువల్ విధానంలో అమ్ముకుంటూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.

నాన్ ఫంజిబుల్ టోకెన్లు బిట్ కాయిన్ల మాదిరిగానే ఒక రకమైన డిజిటల్ అసెట్‌లు. ఇవి ఆన్‌లైన్‌లో మాత్రమే ఉనికిలో ఉంటాయి. కరోనా మహమ్మారి తరువాత వీటిల్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వీటిని ధ్రువీకరిస్తారు. డాలర్లు, స్టాక్స్ లేదా గోల్డ్ బార్స్‌ను ఫంజిబుల్ అసెట్స్ అంటారు. వీటిని ఇతరుల పేరు మీదకు సులభంగా మార్చుకోవచ్చు. కానీ NFTలను బిట్ కాయిన్ల మాదిరిగా మార్చుకోవడం కుదరదు.

బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా గుర్తింపు
ప్రతి ఒక్క NFT యూనీక్‌గా ఉంటుంది. ఇవి క్రిఫ్టోగ్రాఫిక్ టోకెన్లు. వీటిని కొనుగోలు చేసేవారు ఒక ఆర్ట్ లేదా యాంటిక్‌లను దగ్గర పెట్టుకున్నట్టు భావించాలి. దాని యజమాని ఎవరనే వివరాలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా గుర్తించవచ్చు. ఈ ప్రత్యేకత వల్లే వీటి విలువ భారీగా ఉంటోంది. ఒక NFTని సృష్టించినప్పుడు.. అది టైమ్ స్టాంపుతో బ్లాక్‌ చైన్‌పై నమోదవుతుంది. అందువల్ల దీని డిజిటల్ ఓనర్‌షిప్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఎవరైనా ఒక NFTని మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు.. NFTకి ప్రాతినిధ్యం వహించే కోడ్, బ్లాక్ చైన్‌పై ఉన్న మరో వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బ్లాక్‌ చైన్ ద్వారా NFTని కలిగి ఉన్న వ్యక్తి పూర్తి వివరాలను తనిఖీ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

ఆన్‌లైన్లోనే లావాదేవీలు
డిజిటల్ ఆర్ట్ వర్క్స్‌, స్పోర్ట్స్‌ కార్డ్స్ నుంచి కొంత భూమిని కూడా వర్చువల్‌ క్రిప్టో కరెన్సీ వాలెట్ల మాదిరిగా, NFTలుగా నమోదు చేసుకోవచ్చు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా అమ్ముకోవచ్చు. రోడ్రిగ్జ్ ఫ్రేయిల్ కూడా తాజాగా అమ్మిన కంప్యూటర్ జనరేటెడ్ వీడియోను ఇదే విధానంలో అమ్మకానికి పెట్టాడు. పెద్ద సైజులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిమ నేలపై కుప్పకూలిపోయినట్లుగా ఈ వీడియోలో ఉంది. అతడి శరీరంపై నినాదాలు రాసి ఉంది.

పెరుగుతున్న వ్యాపారం
ఓపెన్ సీ అనే సంస్థ ఇలాంటి ప్రత్యేకమైన NFTల లావాదేవీలను నిర్వహిస్తోంది. ఈ జనవరిలో 8 మిలియన్ డాలర్లుగా ఉన్న వ్యాపారం.. ఫిబ్రవరి నెలలో 86.3 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు బ్లాక్ చైన్ డేటా పేర్కొంది. గత సంవత్సరంలో నెలవారీ అమ్మకాలు కేవలం 1.5 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే NFTల లావాదేవీలు రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడన్ గా విడిపోయిన ఇంజన్.. ప్రయాణికుల్లో టెన్షన్.. చివరకు..

జాగ్రత్తలు అవసరం
NFTల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు వెళ్తున్న నేపథ్యంలో మార్కెట్ ధరలు పడిపోయినప్పుడు భారీగా నష్టపోయే అవకాశం ఉందని పెట్టుబడిదారులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి ప్రస్తుతం ఉన్న హైప్ తగ్గిపోతే.. పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి తోడు వర్చువల్ విధానంలో సులభంగా మోసం చేసే నేరగాళ్ల ఉచ్చులో పడే అవకాశం కూడా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాతే NFTలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
First published: