హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇదేందిరా నాయన.. కింగ్ కోబ్రాతో టూర్.. కారులో కుబుసం చూసి..

ఇదేందిరా నాయన.. కింగ్ కోబ్రాతో టూర్.. కారులో కుబుసం చూసి..

కింగ్ కోబ్రా

కింగ్ కోబ్రా

kerala: కుటుంబమంతా కలిసి సరదగా గడపడానికి వెళ్లారు. ఒక చెక్ పోస్టు దగ్గర కారు దగ్గర పామును గమనించారు. ఆ తర్వాత.. ఆగకుండా ముందుకు వెళ్లిపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

మనలో చాలా మందికి పామంటే చచ్చేంత భయం. అసలు పాము పేరెత్తడానికి కూడా ధైర్యం చేయరు. పొరపాటున పాము కనిపిస్తే... దానిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. అయితే.. కొన్నిసార్లు.. పాములు ఆహారం కోసం, ఆవాసం కోసం దారితప్పి మానవ ఆవాసాలకు వస్తుంటాయి. ఈ క్రమంలో మనుషులను కాటువేయడం చేస్తుంటాయి. కొందరు.. పాములను చంపేస్తే... ఇంకొందరు.. పాములు కనపడగానే స్నేక్ సోసైటి వారికి సమాచారం ఇస్తుంటారు. కొన్నిసార్లు.. పాములు మన ఇంటి ఆవరణలో, వాహనాల్లో, బైక్ లు, స్కూటీలు దూరడం మనకు తెలిసిందే.ఇలాంటి సంఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) కొట్టాయంలో వింత ఘటన సంభవించింది. మలప్పురానికి చెందిన ఆర్పూకర ప్రాంతానికి చెందిన సుజిత్ ఆగస్టు 2నతన ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్లాడు. అప్పుడు కారు.. వజికడవు చెక్ పోస్టు వద్ద ఆపినప్పుడు ఒక పామును (Snake) ఎక్కినట్లు చూశారు. కాసేపటికి అది కన్పించకుండా పోయింది. ఆ తర్వాత.. వారు తమ జర్నీని పూర్తి చేసుకున్నారు. దాదాపు.. 200 కిలో మీటర్లు ప్రయాణించారు.


ఆ తర్వాత.. ఇంటికి వచ్చేశారు. అప్పుడు.. కారులో పాము కుబుసం ఉండటాన్ని గమనించారు. వెంటనే కారంతా వెతికారు. అప్పుడు కారు ఇంజిన్ లో 10 మీటర్ల పొడవైన కింగ్ కోబ్రా ఉండటాన్ని గమనించారు. వెంటనే స్నేక్ సోసైటి వారికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు, కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. దాన్ని దగ్గరలోని అడవి ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తి ప్రాణాలు పోయాయి.
కేరళలోని (Kerala)  కోజీకోడ్ లో దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఫిరోక్ చెందిన కోయమోన్ అనే వ్యక్తికి స్యూటర్ ఢీకొట్టడంతో అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్థానికులు భావించారు. దీని కోసం అంబూలెన్స్ కు కాల్ చేశారు. అప్పుడు.. అంబూలెన్స్ ప్రభుత్వ వైద్యకళాశాలకు వెళ్లేందుకు వేగంగా డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. తొందరగానే అక్కడికి చేరుకున్నాడు. అయితే.. ఆస్పత్రికి చేరుకున్నాక షాకింగ్ ఘటన ఎదురైంది.
ఎంత సేపటికి అంబూలేన్స్ డోర్ తెరుచుకోలేదు. దాదాపు.. అరగంట సేపు ట్రై చేసిన.. డోర్ మాత్రం ఓపేన్ కాలేదు. దీంతో వాహనంలోనే, బాధితుడి ఆరోగ్యం మరింత దిగజారీంది. చివరకు ఎలాగో డోర్ తెరిచి, బాధితుడిని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి నుంచి ఇప్పటివరకు తమకు సమాచారం అందలేదని మెడికల్ కాలేజీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.

First published:

Tags: Kerala, Snake, VIRAL NEWS

ఉత్తమ కథలు