news18-telugu
Updated: August 9, 2020, 3:15 PM IST
రోడ్డు దాటుతున్న మొసలి..
మధ్యప్రదేశ్లోని శివపురిలోని రన్నోడ్ గ్రామానికి చెందిన హైవేపై 10 అడుగుల పొడవైన మొసలి రోడ్డు దాటుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పశువులను మేతకు తీసుకెళ్తున్న కొందరు వ్యక్తులు మొసలిని చూసి అక్కడి నుంచి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మొసలి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో కొద్దిసేపు వేచి ఉందని, కాసేపు రోడ్డుపై ట్రాఫిక్ తగ్గిపోయిన తర్వాత రహదారిని దాటింది. ట్రాఫిక్ క్లియర్ కావడంతో, మొసలి రోడ్డును దాటుతుండగా, కొందరు వాహన దారులు ఈ అరుదైన దృశ్యాన్ని వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతోంది.
తరువాత గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి దానిని సమీపంలోని చెరువులో వదిలి వేశారు.
వర్షాకాలం కారణంగా సరస్సు నుండి మొసళ్ళు బయటకు వస్తాయని గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా గ్రామంలో మొసలి ఇలా వచ్చిన అనేక సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలోని ఒక గ్రామస్తుడు తన ఇంటి మరుగుదొడ్డిలో ఐదు అడుగుల పొడవైన మొసలిని గుర్తించాడు. మొసలి బహుశా గ్రామ చెరువు నుండి బయటకు వచ్చి, టాయిలెట్లో దూరిందని గ్రామస్తులు తెలిపారు.
Published by:
Krishna Adithya
First published:
August 9, 2020, 2:52 PM IST