అతని పొట్టలో 8 స్పూన్లు, కత్తి, స్క్రూడ్రైవర్లు, బ్రష్‌లు... ఎలా చేరాయి..? ఎందుకు..?

Manali : ఎవరైనా ఓ కాయినో, వస్తువునో మింగితే... అది పొట్టలో ఉండిపోతే... ప్రమాదమే. మరి అతని పొట్టలోకి అవి ఎలా వచ్చాయి?

Krishna Kumar N | news18-telugu
Updated: May 25, 2019, 2:44 PM IST
అతని పొట్టలో 8 స్పూన్లు, కత్తి, స్క్రూడ్రైవర్లు, బ్రష్‌లు... ఎలా చేరాయి..? ఎందుకు..?
డాక్టర్లు పొట్ట లోంచీ బయటకు తీసిన వస్తువులు (Image : Twitter)
  • Share this:
మనాలీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్ మెజికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్లకు షాకుల మీద షాకులు తగిలాయి. ఎందుకంటే... వాళ్లు ఆ పేషెంట్ పొట్టలోంచీ బయటకు తీసిన వస్తువులు అన్నీ ఇన్నీ కావు. 35 ఏళ్ల ఆ పేషెంట్... మానసిక సమస్య (psychiatric disorder)తో బాధపడుతున్నాడు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పొట్టపై చెయ్యి పెట్టి నొక్కితే... ఏవేవో గట్టిగా తగులుతున్నాయి. ఓ చోట కత్తి చివరి కొన పొట్టను చీల్చుకుంటూ బయటకు వచ్చి కనిపించింది. ఎక్స్‌రే తీస్తే షాకింగ్ వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి... ఓ కత్తి, 8 స్పూన్లు, 2 స్క్రూడ్రైవర్లు, 2 టూత్ బ్రష్‌లు, ఓ చిన్న ఇనుప కడ్డీని పొట్టలోంచీ బయటకు తీశారు.

కొన్నేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్న అతను... ఇంట్లోనే ఉంటూ చిన్నా చితకా పనులు చేసిపెడుతున్నాడు. ఉన్నట్టుండి కడుపు నొప్పిగా ఉందని చెప్పాడు. ఇంట్లో వాళ్లు దగ్గర్లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కి అతన్ని తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ అతని పొట్టను చూశాడు. అది అందరి పొట్టలా కాకుండా... అక్కడక్కడా ఉబ్బినట్లుగా.... లోపల ఏవో వస్తువులు పెట్టినట్లుగా కనిపించింది. అలా కనిపించిన చోట చర్మం కందినట్లు ఎర్రగా కనిపించింది. డాక్టర్ చెక్ చేస్తుండగా... ఓ చోట పొట్టను చీల్చి... కత్తి మొన బయటకు వచ్చింది. అంతే అదిరిపడిన ఆ డాక్టర్... ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి... పేషెంట్‌ను అక్కడికి తీసుకెళ్లమని రిఫర్ చేశాడు. వెంటనే వాళ్లు అక్కడికి తీసుకెళ్లారు.

4 గంటలపాటూ సర్జరీ చేసిన డాక్టర్లు... అన్ని వస్తువులనూ కడుపులోంచీ బయటకు తియ్యగలిగారు. ఆపరేషన్ తర్వాత... అతను ఆ వస్తువుల్ని ఎప్పుడు మింగాడని డాక్టర్లు అడిగితే... కుటుంబ సభ్యులు చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. మూడు రోజుల కిందట కత్తిని మింగాడనీ, దాన్ని ఎలా బయటకు తెప్పించాలో తమకు అర్థం కాలేదని వాళ్లు అన్నారు. మీకు తెలుసా... పైన చెప్పిన వస్తువులతోపాటూ... మరికొన్నికూడా పొట్టలోంచీ బయటకు తీశారట డాక్టర్లు. మానసిక సమస్యతో బాధపడుతున్న అతను... తాను ఏం తింటున్నాడో కూడా తెలియక... ఏది బడితే అది మింగేస్తూ ఉండటంతో... ఈ సమస్య తలెత్తింది. ప్రస్తుతం అతను రికవరీ అవుతున్నాడని డాక్టర్లు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి :

వైసీపీ అద్భుత విజయం వెనక మహిళా శక్తి... ఎవరో తెలుసా...

మలబార్ అందాల స్వీట్ బ్యూటీ హనీ రోజ్ ఫొటోస్...

Photos : అమాయక చూపులతో కట్టిపడేస్తున్న ముంబై బ్యూటీ...

First published: May 25, 2019, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading