1 2 3 WHY CHINA IS SHIFTING GEARS SUBSIDIZING CHILDREN AND OFFERING BABY LOANS TO MARRIED COUPLES GH VB
Child Policy: జనాభా నియంత్రణపై యూటర్న్.. దంపతులకు బేబీ లోన్లు.. ఎక్కువ మందిని కంటే పన్ను రాయితీ..
ప్రతీకాత్మక చిత్రం
1980వ దశకంలో చైనాలో వేగంగా జనాభా వృద్ధి చెందింది. దీంతో ఆందోళన చెందిన అప్పటి నేత డెన్ జియోపింగ్ వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీ పేరుతో ఫెనాల్టీ విధించారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. 80వ దశకం నుంచే జనాభా పెరుగుదల ప్రభావాలపై దృష్టి పెట్టిన డ్రాగన్ దేశం ఒకరు ముద్దు లేదా అస్సలొద్దు(one child policy)అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా గడిచిన మూడు దశాబ్దాల్లో అక్కడ జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా జరిగింది. అయితే ప్రస్తుతం వృద్ధుల సంఖ్య ఎక్కువ కావడం, జనాభా రేటు తగ్గడంతో 2015లో వన్ చైల్డ్ పాలసీపై యూటర్న్ తీసుకుంది.
దేశంలో భార్యాభర్తలు ముగ్గురు పిల్లలను కనొచ్చని చెబుతూ, గతంలో విధించిన ఆంక్షలను సడలించింది. ఆర్థిక వృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కొత్త స్కీమ్‌లను తీసుకొస్తోంది. తాజాగా కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు బేబీ లోన్ స్కీమ్‌ను చైనా ప్రవేశపెట్టింది.
మ్యారేజ్ అండ్ బర్త్ కంజూమర్ లోన్ పేరుతో తీసుకొచ్చిన ఈ రుణ సదుపాయాన్ని తక్కువ వడ్డీరేటుకే అందించడం గమనార్హం. ఈ పాలసీ ప్రకారం చైనా 2 లక్షల యువాన్ల(దాదాపు రూ.23.5 లక్షలు) వరకు ఈ రుణాన్ని మంజూరు చేస్తోంది. అంతేకాకుండా పిల్లల సంఖ్య ప్రకారం వడ్డీరేటు కూడా తగ్గుతుందని, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నవారికి పన్ను మినహాయింపులు కూడా ఉంటాయని స్పష్టం చేసింది.
కఠిన ఆంక్షలు..
1980వ దశకంలో చైనాలో వేగంగా జనాభా వృద్ధి చెందింది. దీంతో ఆందోళన చెందిన అప్పటి నేత డెన్ జియోపింగ్ వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీ పేరుతో ఫెనాల్టీ విధించారు. ఈ జరిమానా చెల్లించని వారి పిల్లలకు 'హుకో' ఇవ్వరు. హుకో అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు, హెల్త్ కేర్, వివాహం చేసుకునేందుకు చైనా ఇచ్చే లీగల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్.
ఫలితంగా చాలా కుటుంబాల నుంచి భారీ మొత్తంలో ఫెనాల్టీలు వసూలు చేసింది చైనా ప్రభుత్వం. హుకో పేరు చెప్పి అదనపు ఛార్జీలు కూడా విధించింది. దీంతో భయానికి లోనైన ప్రజలు ఒక్కరు పిల్లలతోనే సర్దుకుని జనాభా నియంత్రణను కఠినంగా అవలంభించారు. దీంతో ఆ ప్రభావం మళ్లీ చైనాపైనే పడింది.
జనాభా తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుందని భావించి 2015లో వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది. ఇద్దరు పిల్లల వరకు పరిమితిని సడలించింది. ఈ ఏడాది ఆగస్టులో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు సంతాన పరిమితిని పెంచింది. ఈ విధంగా చైనా చైల్డ్ పాలసీపై యూటర్న్ తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1950 తర్వాత 2020లో అత్యల్ప జనాభా వృద్ధి నమోదైంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పడింది.
పిల్లలుంటే ఖర్చు అధికం..
చైనాలో పిల్లలను పెంచడం అంత సులభం కాదు. రాయ్‌టర్స్ రిపోర్ట్ ప్రకారం.. 2005లో అక్కడ ఓ సాధారణ కుటుంబం ఒక చిన్నారిని పెంచేందుకు 490,000 యువాన్లు(దాదాపు రూ.57.6 లక్షలు) ఖర్చు అవుతుంది. 2020 నాటికి ఆ ఖర్చు 1.99 మిలియన్ యువాన్లు(రూ.2.35 కోట్లు)కు చేరింది. ఇదొక్కటే కాదు శిశువుల డెలివరీ సమయంలో నెలకు రూ.1.7 లక్షలకు నర్సుకు వెచ్చించాల్సి ఉంటుంది.
ఆ పిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత ప్రైవేటు పాఠశాలలో ఏడాదికి ఒక్కో చిన్నారికి 250,000 యువాన్లు(రూ.29.5 లక్షల) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవికాకుండా ఇంకా ట్యూషన్లు, ఇతర కార్యకలాపాలకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీంతో చైనీయులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపట్లేదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.