హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Tourist Spot: కర్ఫ్యూలతో విసిగి పోయారా? ప్రకృతి అందాల్లో సేద తీరాలనుందా? ఇదే సరైన ప్రదేశం

Tourist Spot: కర్ఫ్యూలతో విసిగి పోయారా? ప్రకృతి అందాల్లో సేద తీరాలనుందా? ఇదే సరైన ప్రదేశం

ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ భయం.. మరోవైపు కర్ఫ్యూ .. లాక్ డౌన్ ల పేరుతో ఇంటి గేటు దాటి బయటకు రాలేని పరిస్థితి.. దీంతో మానసికంగా పూర్తిగా ఒత్తిడికి గురయ్యారా..? అయితే ప్రభుత్వం త్వరలోనే పర్యాటక రంగానికి పచ్చజెండా ఊపబోతోంది. ఇంకెందుకు ఆలస్యం రారామ్మని ఓ సుందర నగరం మీకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉంది..

ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ భయం.. మరోవైపు కర్ఫ్యూ .. లాక్ డౌన్ ల పేరుతో ఇంటి గేటు దాటి బయటకు రాలేని పరిస్థితి.. దీంతో మానసికంగా పూర్తిగా ఒత్తిడికి గురయ్యారా..? అయితే ప్రభుత్వం త్వరలోనే పర్యాటక రంగానికి పచ్చజెండా ఊపబోతోంది. ఇంకెందుకు ఆలస్యం రారామ్మని ఓ సుందర నగరం మీకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉంది..

ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ భయం.. మరోవైపు కర్ఫ్యూ .. లాక్ డౌన్ ల పేరుతో ఇంటి గేటు దాటి బయటకు రాలేని పరిస్థితి.. దీంతో మానసికంగా పూర్తిగా ఒత్తిడికి గురయ్యారా..? అయితే ప్రభుత్వం త్వరలోనే పర్యాటక రంగానికి పచ్చజెండా ఊపబోతోంది. ఇంకెందుకు ఆలస్యం రారామ్మని ఓ సుందర నగరం మీకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉంది..

ఇంకా చదవండి ...

  ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18.    యావత్ భారత దేశాన్ని ఓ రేంజ్ లో భయపెట్టిన కరోనా రక్కసి కాస్త శాంతించింది. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి చర్యలు.. వ్యాక్సినేషన్ కారణంగా రోజు రోజుకూ కరోన కేసులు తగ్గుతున్నాయి. దీంతో లాక్ డౌన్, కర్ఫ్యూల నుంచి మినహాయింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. సెకండ్ వేవ్ దాదాపు ముగింపు దశలోనే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. దీంతో కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. అలాగే ఇకపై పర్యాటక రంగానికి కూడా పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైంది. ప్రముఖ పర్యాటక ప్రాంతల్లో పర్యటించేదుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దీనిపై స్పష్టత ఇచ్చారు. జులై మొదటి వారం నుంచీ కోవిడ్ నిబంధనలతో పర్యటానికి అనుమతులు ఇస్తామని చెప్పారు. దీంతో అటు గోదావరి జిల్లా నుంచీ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వరకూ ఉన్న పర్యాటక ప్రదేశాలు రెడీ అవుతున్నాయి.

  కరోనా భయం.. లాక్ డౌన్.. కర్ఫ్యూలతో పూర్తిగా మనసు అలసి పోయిందా.. ప్రకృతిలో పరవశించి పోవాలి అనుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చాక మంచి టూరిస్పాట్ కోసం వెతుకుతున్నారా..? అయితే మీకు సరైన ప్రదేశం ఇదే..

  ఇదీచదవండి: సీఎం అలా మాట మారుస్తారనుకోలేదు.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  ఒక పక్క కొండలు.. మరో పక్క అనంత సాగరం.. మధ్యలో అందమైన నగరం. ఒక్క మాటలో చెప్పాలంటే అదే అందాల సాగర తీరం విశాఖపట్నం. ముద్దుగా వైజాగ్ అని పిలుచుకునే ఈ మహా నగరానికి పర్యాటక శోభను తెచ్చిపెట్టిన ప్రకృతి సోయాగాలెన్నో. తెల్లవారినా.. మధ్యాహ్నమైనా.. సాయంత్రమైనా.. రోజంతా ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తుంది సాగర నగరం. ఎంత చెప్పినా తనివి తీరదు. లోతైనా లోయలు, పచ్చని పసిరికలు, సువిశాల సముద్ర తీరాలు, ఎత్తైన పర్వతాలు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, శుద్ధమైన నదులు, ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు. ఒకటేంటి ఎన్నో విశిష్టతల సమాహారం విశాఖ.

  ఇదీచదవండి:  ఆ కీలక నేతను లోకేష్ పక్కన పెట్టారా? పార్టీ పదవుల్లో త్వరలోనే మార్పులు తప్పవా?

  విశాఖ అనగానే మొదట సముద్రమే గుర్తు వస్తుంది. నిత్యం అలల తుళ్లింతతో గర్వంగా పరుచుకున్న సాగరతీరం కన్నా.. ఇంకేం గుర్తొస్తుంది. అందుకేనేమో.. విశాఖను సాగర నగరంగా పిలుచుకుంటారు. నగరానికి ఆనుకుని ఉన్న సముద్రం ఆహ్లాదంతో పాటు ఎంతో వినోదాన్ని ఇస్తుంది. చిన్నారి పాపలు కేరింతలు, అలలతో దోబూచులాడే కుర్రకారు.. ఉప్పుగాలిని పట్టే నడివయసు వారు, వృద్ధులు.. ఇలా అన్ని వయసుల వారు సముద్ర తీరానికి స్నేహితులే. ఉదయం నుంచీ సాయంత్రం దాకా.. ఈ తీరం వెంబడి నిత్యం జనమే జనం. భయంకరమైన ఎండా కాలంలోనూ బీచ్ ల క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అల్లి బిల్లి అలలు ఇప్పటికీ పర్యాటకులను కేరింతలు కొట్టిస్తున్నాయి. నిత్యం జనంతో కిటకిటలాడుతూ కనిపించే బీచ్ లో స్పీడ్ బోట్స్, డ్రై డాక్స్ వంటి సాహస క్రీడలు అదనపు ఆకర్షణ.

  ఇదీచదవండి:ఏపీ మంత్రుల్లో దడ.. పదవి ఉంటుందా లేదా అనే టెన్షన్.. ఎన్నికల టీంపై సీఎం ఫోకస్

  సాగరతీరమంటే ఒక్క రామకృష్ణ బీచ్ అనుకునే వాళ్లూ లేకపోలేదు. నాలుగు దశాబ్ధాలుగా బీచ్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే తీరమిది. దీని పక్కనే ఉన్న కాళీమాత ఆలయం, వెనుక రామకృష్ణ మిషన్, దాని ముందు ఫిష్ అక్వేరియం, అటు పక్క ఈ మధ్యనే ప్రారంభమైన చిల్డ్రన్స్ పార్కులు.. అబ్బో చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాలానే ఉన్నాయి. భారత్ పాక్ యుద్ధ సంకేతం కురుసుర, దాన్ని ఆనుకునే ఉన్న నావికాదళ చిహ్నాలు, చిరస్మరణీయుల విగ్రహాలు, ఆ పక్కనే చిన్న చిన్న పార్కులు.. ఇలా ఈ తీరమంతా.. ఆధునిక వాసనతో గుబాళిస్తుంది. 2008 తర్వాత ఇక్కడ మొదలైన ఎత్తైన హొటళ్లు, పర్యాటకులను ఆకర్షించే రకరకాల రిసార్ట్స్, ఆకాశాన్ని అంటే అపార్ట్ మెంట్లు తీరానికి ఒక నిండైనా ఆభరణంలా కనిపిస్తాయి. మధ్యలో ఉన్న రోడ్డు మీద కుర్రాళ్ల నుంచీ వృద్ధుల దాకా.. రయ్ రయ్ మని వెళ్తున్న తీరు చూస్తే అర్ధమైపోతుంది.. ఇది విశాఖ బీచ్ రోడ్ అని. నడుచుకెళ్లే ఓపిక ఉండాలే కానీ.. మూడు కిలోమీటర్ల బీచ్ రోడ్డు.. ఓ మరపురాని లోకానికి తీసుకెళ్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మా బీచ్ ను.. ఏ బీచ్ తోనూ పోల్చకండయా.. అంటూ విశాఖ వాసులు భుజాలు ఎగరేస్తారంటే.. ఆ గొప్పతనం ఎవరిది..

  ఇదీచదవండి: ఆ కీలక నేతను సీఎం జగన్ ఎందుకు దూరం పెడుతున్నారు..? వ్యవహారం అక్కడే చెడిందా?

  అలా సరదాగా బీచ్ డౌన్ కు వెళ్తే.. ఎత్తైనా ఆకాశ హర్మ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలోనే అలనాటి సినిమాలు ఎన్నో చిత్రీకరించారు. ఒక బాలచందర్, ఒక జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణారెడ్డి.. ఇక్కడే అపురూపమైన సినిమాలు తీశారు. జంబలకడిపంబగా.. అందరినీ కడుపుబ్బానవ్వించిన ఈవీవీ కళాఖండం ఈ ప్రదేశంలోనే రూపుదిద్దుకుంది. అందుకేనేమో.. ఓ కొండపై ఏకంగా రామానాయుడు ఫిల్మ్ స్టుడియోనే ఏర్పాటైంది. ఇప్పుడది విశాఖకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఈ పక్కనే ఉడాపార్కు, దాని పక్కనే ఎన్టీఆర్ చిల్డ్రన్స్ పార్కు చిన్నారులకు భలే ఆటవిడుపు. ఇంకొంచెం ముందుకెళ్తే.. తినడానికి ఫుడ్ రెడీ. కాస్తంత ఖర్చుఎక్కువైనా.. ఒక్కసారైనా ఆ తీరాల్లోనే అయిదు నక్షత్రాల హొటళ్లలో బస చేయాలని ప్రయత్నించాలి. అప్పుడే తీరంలోని అసలు ధ్రిల్ తెలుస్తుంది. అందుకే టూరిజం శాఖ కూడా ఇక్కడ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికోసం రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడి వినోదానికి అవధులే ఉండవు.

  ఇదీచదవండి: సిగ్నల్ పాయింట్ కోసం ఆదివాసుల అవస్థలు.. ప్రభుత్వ పథకాల కోసం తప్పని అగచాట్లు

  కైలాసగిరి పార్కు మరింత ప్రత్యేకం. శివపార్వతుల ఎత్తైన విగ్రహాలు, పూల వనం, బీచ్ వ్యూ, రోప్ వే, టూరిజం ట్రైన్, ఇంకా ఎన్నో వినోదాలు ఉన్న కొండ ఇది. కైలాసగిరి కింద నుంచీ పై దాకా ఓ అద్భుతమైన అనుభూతి. తర్వాత కిందనే కనిపించే తెన్నేటి విశ్వనాధం పార్కు. అలనాటి మహనీయుడి పేర నిర్మించిన ఈ పార్కు ఓ చిట్టి కొండపై ఉండటం హైలైట్. ఇక్కడి నుంచీ సముద్రం చూస్తే ఓహో ఆ సీనే వేరండి. ముఖ్యంగా వర్షంలో ఈ స్పాట్ భలే అందంగా ఉంటుంది. ఇది ఇలా చూడటం కన్నా.. దగ్గరికెళ్తే ఆ కిక్కే వేరప్పా..! అనాల్సిందే..

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Avanti srinivas, Visakha, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు