హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Mumbai: ఛార్జీల మోత మోగిస్తున్న క్యాబ్ సర్వీసెస్..నెక్స్ట్ మన వంతేనట

Mumbai: ఛార్జీల మోత మోగిస్తున్న క్యాబ్ సర్వీసెస్..నెక్స్ట్ మన వంతేనట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai:పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సాధారణ ప్రజలపై తీవ్రప్రభావాన్ని చూపుతోంది. ముంబైలో ప్రైవేట్ రవాణా సౌకర్యాలపై ఆధారపడుతున్న లక్షలాదికి ఉబెర్‌ క్యాబ్ సర్వీసెస్‌ ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలకు అదనంగా మరో 15శాతం పెంచింది. ఈ పెరుగుదల హైదరాబాద్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...

పెట్రోల్(Petrol), డీజిల్‌ (Diesel)ధరలు పెరిగాయని సొంత వాహనాలు పక్కనపెట్టి ప్రైవేట్ ట్రావెల్స్‌ని ఉపయోగించుకోవాలనుకునే వాళ్లకు మరో షాకింగ్ న్యూస్ ఇది. రాష్ట్రాల్లో యాప్ ఆధారంగా నడిచే క్యాబ్ సర్వీసెస్‌ కూడా ఛార్జీలు పెంచేందుకు రెడీ అయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో విస్తృతంగా విస్తరించిన ఉబెర్ (Uber)తమ సర్వీస్‌ ఛార్జీలను 15శాతం (15 per cent hike)అదనంగా వసూలు చేయనుంది. ఈ ధరాభారం ముందుగా ముంబై( Mumbai)మహనగరంలో మొదలై నిదానంగా మిగిలిన మెట్రోనగరాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో ఏప్రిల్ ఉగాది పండుగ నుండి క్యాబ్ ఛార్జీలను 15 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబెర్ తెలిపింది. ఇంధన ధరలు పెరగడం వల్ల డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పెంచిన ఛార్జీలే కాదు రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఛార్జీలను అనుసరించే ముంబైలో ప్రయాణ ఛార్జీలను పెంచుతామని ప్రకటించారు ఉబెర్ ఇండియా, సౌత్ ఏషియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీష్ భూషణ్ వెల్లడించారు. గత ఏడాది కాలంలో ఉబెర్ ఛార్జీలను రెండు సార్లు పెంచింది. ఇంతకు ముందు జూలై 2021లో ఉబెర్, ఓలా రెండూ తమ ఛార్జీలను 15 శాతం పెంచాయి. మార్చి 30న ముంబైలో పెట్రో ధర ₹100 మార్కును అధిగమించింది. ప్రస్తుతం, డీజిల్ లీటరుకు ₹100.10కి విక్రయిస్తున్నారు, ముంబైలో పెట్రోల్ ధర ₹115.88గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్జీల పెంపు తప్పని సరి అని ఉబెర్ ప్రకటించింది.

క్యాబ్ సర్వీస్ ఛార్జీలు పెంపు..

ప్రస్తుతం పెంచుతున్న ఛార్జీలను కిలోమీటర్‌ చొప్పున అలాగే జర్నీ టైమ్‌ని పరిగణలోకి తీసుకొని దానికి బేస్‌ ఛార్జీ వసూలు చేస్తామని ప్రకటించింది. కొత్తగా పెంచే ఛార్జీలు గతంలో ఉన్న దానికంటే 15శాతం అదనంగా పెరుగుతుంది. ముంబైలో క్యాబ్ ఛార్జీలు పెంచేందుకు సిద్దమైన ఉబెర్..ఇదే విధానాన్ని క్రమంగా మిగిలిన రాష్ట్రాల్లోని మెట్రోనగరాల్లో కూడా అమలు చేయాలని చూస్తోంది.

ముంబై తర్వాత మిగిలిన రాష్ట్రాలు..

ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లు అమలు చేస్తున్న ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పర్యవేక్షించాలని గ్రాహక్ పంచాయతీ కోరుతోంది. కాలీ పీలీస్, ఉబెర్, ఓలా వంటి వాహనాలన్నీ ప్రజా రవాణా మరియు ఛార్జీల పెంపు సూత్రాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని చేసిన ప్రతిపాదన ఇంకా కోర్టు పెండింగ్‌లో ఉంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Mumbai Passengers, Uber

ఉత్తమ కథలు