Home /News /travel /

TS RTC GIFT FREE TRAVEL ON BUSES FOR CHILDREN UNDER 12 YEARS SNR

12ఏళ్లలోపు చిన్నారులకు టీెఎస్ ఆర్టీసీ గిఫ్ట్ ..రాబోయే రోజుల్లో ఉచితంగా ప్రయాణం

TS RTC

TS RTC

TS RTC: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ న్యూఇయర్‌ రోజున కొత్త పథకం ప్రకటించింది. త్వరలో 12ఏళ్లలోపు చిన్నారులు ఉచితంగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామంది. ఈపథకాన్ని శాశ్వతంగా అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు.

ఇంకా చదవండి ...
నూతన సంవత్సరం రోజున తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ. ప్రజల మన్ననలు పొందుతున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) పురోగతితో పాటు ప్రయాణికులకు మరో కొత్త పథకాన్ని అందించబోతోంది. 12ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని అతి త్వరలో కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈవిషయాన్ని టీఎస్‌ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్‌ (Bajireddy govardhan)స్వయంగా తెలిపారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఎన్నో కొత్త ఆలోచనలు, ప్రయాణికులకు ప్రయోజనాలు కలిగిస్తున్న టీఎస్‌ ఆర్టీసీ సంస్థ(TSRTC) నిర్వాహకులు ఈ పథకాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా అమలు చేస్తామన్నారు. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరించడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. పిల్లలకు ఉచితం(FREE)గా బస్సుల్లో అనుమతించడం వల్ల వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారని చెప్పారు. హైదరాబాద్‌(HYDERABAD) బస్‌భవన్‌(BUS BHAVAN)లో జరిగిన నూతన సంవత్సరం వేడుకల్లో ఈప్రకటన చేశారు. కార్మికుల, ఉద్యోగుల మధ్య కేక్ కట్ చేశారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌. ఈకార్యక్రమంలో ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్ సజ్జనార్‌ (Sajjanar)కూడా పాల్గొన్నారు.

పిల్లల కోసం కొత్త పథకం..
నష్టాల్లో ఉన్న టీఎస్‌ఆర్టీసీని లాభాల బాట పట్టించడం కోసం గత కొంతకాలంగా ప్రయాణికులను వివిధ ఆఫర్లు, పథకాలతో ఆకర్షిస్తోంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగకు నడిపే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి దగ్గర అదనపు ఛార్జీలు వసూలు చేయమని  ముందే ప్రకటించింది. పండుగ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులపై భారం మోపమన్నారు సంస్థ నిర్వాహకులు. న్యూఇయర్, సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ట్రావెల్స్‌ దోపిడీకి టీఎస్‌ఆర్టీసీ నిర్ణయంతో చెక్‌ పడినట్లైంది.

న్యూఇయర్ వేడుకల వేళ తీపి కబురు ..
న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొన్న టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌ ప్రయాణికుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. కేక్‌ కట్ చేసి కార్మికులకు అందజేసిన తర్వాత సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన బెనిపిట్స్‌ని అందించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగి కుటుంబాలోని పిల్లల విద్యార్హతను బట్టి సంస్థలో కాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.

కార్మికుల సంక్షేమం మరువం..
టీఎస్‌ ఆర్టీసీలో బస్సు ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనపై కూడా బాజిరెడ్డి చర్చించారు. చాలా రోజులుగా ఛార్జీలు పెంచాలనే ఆలోచన ఉన్నప్పటికి పెంచలేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్య పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సంస్థ పురోగాభివృద్ది కోసం కార్మికులు, ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Buses, Telangana, Tsrtc

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు