హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Travel: ప్ర‌యాణాల‌కు ప్లానింగ్ క‌ష్టంగా ఉందా.. అయితే ఇలా ట్రై చేయండి

Travel: ప్ర‌యాణాల‌కు ప్లానింగ్ క‌ష్టంగా ఉందా.. అయితే ఇలా ట్రై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Travel | ఎక్క‌డిక‌న్నా ప్ర‌యాణం చేయాల‌నుకొంటున్నారా.. ప్రయాణానికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెల‌య‌డంల లేదా.. ఎలా ప్లాన్ చేసుకోవాలి. షెడ్యూల్ ఎలా.. అనుమ‌తుల వివ‌రాలు అన్ని ఒకే చోటే అందిస్తుంది గూగుల్ ట్రావెల్‌.. ఈ ఫీచ‌ర్‌తో మీ సెల‌వుల‌ను ఆహ్లాదంగా గ‌డుపుకోండి.

ఇంకా చదవండి ...

కోవిడ్-19 (Covid 19 ) ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాల (journey) విషయంలో ఉన్న దృక్కోణం పూర్తిగా మారిపోయింది. మహమ్మారి పర్యాటక రంగం (Tourism)పై తీవ్రంగా ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే మహమ్మారి ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ట్రావెలింగ్ (Travelling)కు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే మీకు మీరుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలంటే (holiday plans) కొంచెం కష్టం. ఇందుకు గూగుల్ (google) మీకు సహాయపడుతుంది. సురక్షితమైన ప్రయాణాన్ని చేసేందుకు ఈ సంస్థ ‘గూగుల్ ట్రావెల్’ (google travel) సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Life Style: స‌మ్మ‌ర్ వ‌చ్చేస్తోంది.. ఏ రంగు డ్రెస్‌లు వేసుకోవాలో తెలుసా!


గూగుల్‌తో సుల‌భం..

ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని అందించే గూగుల్ ట్రిప్స్ యాప్ (google trip app), గూగుల్ హోటల్స్ సెర్చ్, గూగుల్ ఫ్లైట్స్, తదితర ప్రొడక్టులను ఒకే హోంపేజీలో వచ్చేలా ‘గూగుల్ ట్రావెల్’ (google travel) ఫీచర్‌ను సంస్థ రూపొందించింది. దీని ద్వారా మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి అప్డేటేడ్ సమాచారాన్ని మీకు అందిస్తుంది. లొకేషన్ వివరాలు, రోడ్డు ట్రిప్ ప్లాన్ చేస్తే అందుకు సంబంధించిన సలహాలు లాంటి వాటిని కొన్ని క్లిక్స్ లోనే తెలుసుకునే వెసులుబాటును కల్పించింది.

Valentines day Special: మీ ప్రియ‌మైన వారికి దూరంగా ఉన్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి


ఏం చేయాలి..

- ఇందుకోసం మీరు google.com/travelను సందర్శించాలి.

- మీరు గూగుల్ సేవలను ఉపయోగించి ట్రిప్స్ షెడ్యూల్ చేసుకున్నారా లేదా అనేది మొదటగా గమనించాలి.

- ఈ సైట్ మీ ప్రయాణానికి సంబంధించిన అన్ని బుకింగ్ ఇన్వాయిస్ లు, ధ్రువీకరణ కోడ్ లను, ప్రయాణ వివరాలు లాంటి వివరాలను సేకరిస్తుంది.

- మీ ప్రయాణ తేదీల వాతావరణ ఇండెక్స్ ను చూపుతుంది.

- లొకేషన్, ఫ్లైట్ లు, హోటళ్లు లేదా వెకేషన్ ప్యాకేజీ (vacation package)లను సెర్చ్ చేయడం ద్వారా యూజర్లు తమ తదుపరి ట్రిప్ ను ప్లాన్ చేసుకోవచ్చు.

- ఇందుకోసం ఎక్స్ ప్లోర్ ట్యాబ్ ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ మునుపటి ప్రయాణాలన్నింటిని ఒకే ప్రదేశంలో వీక్షించవచ్చు.

Travel: టీకా తీసుకోలేదా.. అయినా కూడా ఈ దేశాల‌కు వెళ్లొచ్చు!

ప్లానింగ్‌కు ఉప‌యోగం..

గూగుల్ తాజాగా ఎక్స్ ప్లోర్(Explore) ఫీచర్ ను రీడిజైన్ చేసింది. కేవలం విమానాలను చూపడానికి బదులుగా ఈ పేజీ ఇప్పుడు విమానం, వాహనం రెండింటి ద్వారా చేరుకోగల స్థానాలను జాబితా చేసింది. ఇది రెండో ఆప్షన్ (second option) గా జోడించింది. మహమ్మారి కాలంలో ఇది సురక్షితమైన రవాణా విధానం. ఒకవేళ మీరు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు ట్యాబ్ ను "విమానాలకు మాత్రమే"(Flights only) ఆప్షన్ కు సులభంగా మార్చవచ్చు. మీరు మీ తర్వాత గమ్యస్థానాన్ని ఎంచుకున్న తర్వాత సులభంగా ట్రిప్ (holiday plans) ను సృష్టించుకోవచ్చు. మీరు మీ గమ్యాన్ని ఎంచుకున్న తర్వాత విమానాలు, హోటళ్ల వివరాలను సూచిస్తుంది.

First published:

Tags: Google, Latest Technology, Travel

ఉత్తమ కథలు