చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. కొత్త ప్రదేశాలకు ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఎక్కడికైనా సోలోగా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అయితే 2023లో సోలో ట్రిప్ ప్లాన్ చేస్తుంటే? మీరు కచ్చితంగా పర్యటించాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే..
నెదర్లాండ్స్
ఒంటరిగా ప్రయాణించాల్నుకునే వారికి సులభమైన ప్రదేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి. ఏప్రిల్‌లో నెదర్లాండ్‌లో పర్యటిస్తే అందమైన తులిప్ ఫీల్డ్‌లను అన్వేషించడానికి, ఆమ్‌స్టర్‌డ్యామ్ గుండా బైక్‌ను నడపడానికి అవకాశం ఉంటుంది. ఇదే మొదటి సోలో ట్రిప్ అయితే హోటల్‌లో ఒంటరిగా ఉండడానికి ఇబ్బంది పడితే, ఆతిథ్యం అందించడానికి అనేక హాస్టల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నెదర్లాండ్ స్థానికులు కూడా స్నేహపూర్వకంగా ఉంటారు.
ఆస్ట్రియా
కళలు, సంస్కృతిని ఆస్వాదించడాన్ని ఇష్టపడే వాళ్లకు బెస్ట్ డెస్టినేషన్ ఆస్ట్రియా. సోలో ట్రిప్‌లకు కూడా ఈ దేశం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు పర్యాటకులతో చక్కగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంలో యువత ఎక్కువ. సాహస క్రీడలు ఇష్టపడే వారికి ఈ ప్రదేశం అద్భుతమైనది. ఎత్తైన ప్యాలెస్‌లు, భవనాలు ఆకట్టుకుంటాయి.
ఐస్‌లాండ్
సోలా ట్రావెలర్స్‌కి స్వాగతం చెప్పే సురక్షితమైన ప్రదేశాల్లో ఐస్‌లాండ్ ఒకటి. బయట ప్రదేశాల్లో ఉండటాన్ని ఆస్వాదించే వారికి ఇది అద్భుతమైన డెస్టినేషన్. ఇందులో అగ్నిపర్వతాలు, గ్లేసియర్ వాక్స్, గుహలు, జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ సర్వే ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశంగా ఐస్‌లాండ్ నిలిచింది.
జపాన్
ఒంటరిగా ప్రయాణించే వాళ్లకు అన్ని విధాలుగా సరైన ప్రదేశం జపాన్. ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేయడం చాలా సులభం. ద్వీపం నుంచి ప్రఖ్యాత బుల్లెట్ రైళ్ల వరకు అన్ని ఆస్వాదించవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన గమ్యస్థానాలలో ఒకటిగా జపాన్ గుర్తింపు పొందింది. ఇక్కడ నివసించే ప్రజల ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవన విధానం ఆకట్టుకుంటుంది. స్నేహపూర్వకమైన వాతావరణంతో మహిళా సందర్శకులు కూడా సోలోగా ప్రయాణించవచ్చు. జపాన్ తన ప్రఖ్యాత నాగరికతకు పెట్టింది పేరు.
మెక్సికో
ఎప్పటినుండో సోలో ట్రావెలర్స్‌కు మెక్సికో రొమాంటిక్ డెస్టినేషన్‌గా ఉంది. దీని వెనకాల కారణం కూడా ఉంది. ఇక్కడ ఒక్కరే ప్రయాణిస్తూ మరపురాని అనుభూతిని పొందడం చాలా సులభం. మెక్సికో కావలసిన అనుభూతులను అన్నింటినీ అందిస్తుంది. అత్యంత గొప్ప సంస్కృతిని, ఆహ్లాదకరమైన వంటకాలను, ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను, స్నేహపూర్వక వ్యక్తులను పరిచయం చేస్తుంది. ప్రపంచంలో మెక్సికెన్ ఫుడ్ ఇష్టపడే వారి సంఖ్య కూడా ఎక్కువే.
న్యూజిలాండ్
ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు గొప్ప ఔటింగ్స్ ఆస్వాదించాలనుకుంటే న్యూజిలాండ్ సరైన ప్రదేశం. ఈ ప్రదేశంలో కొండల వైపు దృశ్యాలు ఆశ్చర్యపరుస్తాయి. న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడు ఫ్జోర్డ్‌లు, వర్షారణ్యాలు సందర్శించడం, తిమింగలాలను చూడటమే కాకుండా కొత్త సంగతులు మరిన్నింటిని కనుగొనవచ్చు. ఇది ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్ దొరికే ప్లేస్. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు కూడా ఆకట్టుకుంటాయి. న్యూజిలాండ్ అనేక పోల్స్‌లో మహిళలకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా నిలిచింది.
స్కాట్‌లాండ్
స్కాట్‌లాండ్‌లోని సహజ సౌందర్యం వర్ణించలేనిది. ఇది చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ప్రాంతాన్ని సోలోగా ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది. సోలో వెకేషన్ వేడుకలకు అత్యంత సురక్షితమైన ప్రదేశం.
స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్‌ను ఒంటరిగా సందర్శించినప్పుడు స్విస్ ట్రావెల్ పాస్ తప్పక తీసుకోవాలి. దీని సాయంతో బస్సులు, పడవలు, రైలు ఇతర రవాణా మార్గాలలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, మనోహరమైన నగరాలు, గంభీరమైన ఆల్ప్స్ అన్వేషించడంతో సహా ఇక్కడ చేయవలసినవి, చూడవలసినది చాలా ఉన్నాయి. స్విట్జర్లాండ్ మంచు పర్వతాలు ప్రత్యేకమైన ఆకర్షణ. అత్యంత రొమాంటిక్ ప్లేస్‌ల లిస్ట్ తీస్తే స్విట్జర్లాండ్ ముందు వరుసలో ఉంటుంది. షాపింగ్ ఇష్టపడే వారికి కూడా ఇది బెస్ట్ డెస్టినేషన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Travel