Tourism: పర్యాటకులకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం.. టూరిస్ట్ ప్లేస్‌లలో వందశాతం వ్యాక్సినేషన్.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Tourism: కోవిడ్-19 మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ జనాలు విహార యాత్రలకు వెళ్లట్లేదు. దీంతో టూరిస్ట్ ప్లేస్‌లు వెలవెలబోతున్నాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మహమ్మారి సంక్రమిస్తుందనే భయంతో పర్యాటకులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే వారందరికీ కేరళ రాష్ట్రం తీపి కబురు చెప్పింది.

  • Share this:
కోవిడ్-19 మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ జనాలు విహార యాత్రలకు వెళ్లట్లేదు. దీంతో టూరిస్ట్ ప్లేస్‌లు వెలవెలబోతున్నాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మహమ్మారి సంక్రమిస్తుందనే భయంతో పర్యాటకులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే వారందరికీ కేరళ రాష్ట్రం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని వైతిరి టూరిస్ట్ ప్లేస్‌లోని ప్రజలందరికీ టీకాలు వేశామని, టూరిస్టులు ఇక్కడికి నిర్భయంగా రావచ్చని ప్రకటించింది. దేశీయ టూరిజంలో ప్రస్తుతం వైతిరి సురక్షితమైన ప్రదేశమని కేరళ ప్రభుత్వం తెలిపింది. పర్యాటకుల కోసం అన్ని టూరిస్ట్ ప్లేస్‌లను పూర్తి సురక్షితంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ముందు కేరళలోని వైతిరి పర్యాటక ప్రదేశాన్ని సురక్షితంగా మార్చింది. జులై 13-17 వరకు జరిగిన టీకాల డ్రైవ్‌లో వైతిరిలోని టూరిజం సర్వీస్ అందించే ప్రజలతోపాటు మొత్తం జనాభాకు టీకాలు వేశారు. మహమ్మారి తరువాత సందర్శకులు సరదాగా సమయం గడపడానికి సురక్షితమైన, ఆతిథ్య స్థలాల కోసం వెతుకుతున్నారని పర్యాటక శాఖ మంత్రి పీఎ. మొహమ్మద్ రియాజ్ చెప్పుకొచ్చారు.

పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని కేరళ వ్యాప్తంగా అన్ని టూరిస్ట్ ప్లేస్‌లలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. వీరికి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడం అత్యవసరమని ప్రభుత్వం భావించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేరళలోని హిల్ స్టేషన్లు, బ్యాక్‌వాటర్ హబ్‌లు, సీసైడ్ హాలిడే స్పాట్స్, హెరిటేజ్&కల్చరల్ టూరిస్ట్ సెంటర్స్ సహా అన్ని గమ్యస్థానాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. దీన్నిబట్టి కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే పర్యాటకులను స్వాగతించడానికి కేరళ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. వయనాడ్‌లో బెస్ట్ ఎకో-టూరిజం హాట్‌స్పాట్‌గా పేరొందిన వైతిరి.. సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది కోజికోడ్ నుంచి 60 కిమీ దూరంలో ఉంటుంది. కర్ణాటక, తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటున్న వయనాడ్.. సౌత్ ఇండియా మొత్తంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా పేరు తెచ్చుకుంది.

వైతిరి టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లాలనుకుంటే ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాలి. వైతిరికి సమీపంలో కోజికోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది వైతిరికి సుమారు 63 కి.మీ దూరంలో ఉంటుంది. అలాగే ఈ టూరిస్ట్ ప్లేస్‌కు సమీపంలో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది. కొంచెం దూరంలో కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుంచి వైతిరి చేరుకోవడానికి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక కేరళలో బుధవారం 22,414 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే రోజున 108 మరణించారు.
Published by:Veera Babu
First published: