Viral Video: ఏనుగులు సాధారణంగా మనుషుల జోలికి రావు. ఏ జంతువులకూ హాని చెయ్యాలి అనుకోవు. వాటి శరీరం ముందు ఎంత పెద్ద జంతువైనా... వాటిని చిన్నగానే కనిపిస్తుంది. అందుకే... ఇంత చిన్న జంతువుతో నాకెందుకు గొడవ అనుకుంటాయి ఏనుగులు. ఒక్కోసారి ఆటపట్టిస్తాయే తప్ప దాడి చెయ్యవు. అలాంటి గజాలు... ఒక్కోసారి అరివీర భయంకరంగా మారతాయి. గట్టిగా ఘీంకరిస్తూ... బీభత్సం సృష్టిస్తాయి. ఒక్కసారి ఏనుగుకు కోపం వస్తే... ఇక అంతే సంగతులు... వాళ్లు, వీళ్లు అని చూడదు... అల్లకల్లోలం చేస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. ఇలా ఏనుగు దాడుల్లో ఏటా చాలా మంది చనిపోతున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఏనుగుకి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుస్తోంది.
అసోంలో... ఏనుగులు ఎక్కువే. అవి తరచూ రోడ్లు, రైల్వే ట్రాకులు దాటుతూ ఉంటాయి. ఇలా ఏనుగులు రోడ్లపైకి వచ్చినప్పుడు... అవి తమ పొలాలవైపు వస్తాయేమో అనే భయంతో... ప్రజలు రకరకాలుగా అరుస్తూ, శబ్దాలు చేస్తూ... వీలైనంత త్వరగా గజాలను రోడ్డు దాటి అడవిలోకి పోయేలా చేస్తారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. కొంత మంది గుంపుగా వచ్చి... రోడ్డు దాటుతున్న ఏనుగులను భయపెట్టాలని చూశారు. కేరింతలు కొట్టారు. ఆ గుంపులో పెద్దవాళ్లే కాదు... పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ల అరుపులకు కాస్త భయపడిన ఏనుగులు... గబగబా రోడ్డు దాటాయి.
ఇక అన్నీ వెళ్లిపోతున్నాయిలే అనుకున్నారు. కానీ గుంపును నడిపించే ఏనుగు చివర్లో వచ్చింది. దానికి వాళ్లు చేస్తున్న అల్లరి అస్సలు నచ్చలేదు. ఒక్కసారిగా గుంపు వైపు వెళ్లింది. దాంతో వాళ్లంతా వామ్మో అనుకుంటూ... వెనక్కి పరుగెత్తారు. ఓ యువకుడు మాత్రం కింద పడి రోడ్డు పక్కకు పారిపోయేందుకు ప్రయత్నించగా... అదే సమయం ఏనుగు వెళ్లి... బంతాట ఆడుకున్నట్లు అతన్ని కాళ్లతో తొక్కిపారేసింది. ఆ తర్వాత మా జోలికొస్తే ఊరుకునేది లేదు అన్నట్లు ఘీంకరించి... అడవిలోకి వెళ్లిపోయింది.
ఆ షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి.
#हाथियों से पंगा???
Yesterday evening in #Golaghat #Assam.
One trampled in #NH37 near #Marangi_TE.
Kyonki HAATHI se panga liya....@ParveenKaswan@susantananda3 @SudhaRamenIFS @GolaghatPolice pic.twitter.com/TQmxqmEjM9
— Rupin Sharma IPS (@rupin1992) July 26, 2021
ఇది కూడా చదవండి: Gympie: శపించే మొక్క!... ఆకుల్ని ముట్టుకుంటే ఆత్మహత్యే!
IPS ఆఫీసర్ రూపిన్ శర్మ ఈ వీడియోను ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ పోస్టులో ఇచ్చిన సమాచారం ప్రకారం... ఈ ఘటన అసోంలోని గోలఘాట్లో జరిగింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral, VIRAL NEWS, Viral Videos