పాపులర్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు గాను ‘స్విగ్గీ వన్’ అనే అప్‌గ్రేడ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ మెంబర్ షిప్‌తో వినియోగదారులకు అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్లు, మరిన్ని ప్రయోజనాలను స్వీగ్గీ అందించనుంది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న స్విగ్గీ సూపర్ ప్లాన్‌తో కేవలం పరిమిత సంఖ్యలోనే ఉచిత డెలివరీలను పొందే అవకాశం ఉంది. అంతేకాదు, సూపర్ ప్లాన్ ఉన్నప్పటికీ, స్విగ్గిలో కిరాణా సామాగ్రి, మాంసం, ఇతర సేవలకు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కస్టమర్లకు ఇది ఇబ్బందికరంగా మారింది. దీన్ని పరిష్కరించేందుకు స్విగ్గీ సంస్థ.. స్విగ్గీ వన్ అనే అప్‌గ్రేడ్ మెంబర్షిప్ ప్లాన్‌ను ప్రారంభించింది.
ఈ కొత్త మెంబర్షిప్ ప్లాన్ ద్వారా అన్ని రకమైన సేవలతో పాటు అన్లిమిటెడ్ ఫ్రీ డెలివరీ, డిస్కౌంట్లను అందిస్తోంది. రూ. 99 కంటే ఎక్కువ ఖర్చయ్యే గ్రాసరీ ఆర్డర్లపై అన్లిమిటెడ్ ఫ్రీ ఇన్‌స్టామార్ట్ డెలివరీతో పాటు ఫుడ్ ఆర్డర్లపై 30 శాతం వరకు అడిషనల్ డిస్కౌంట్ ప్రకటించింది.
‘స్విగ్గీ వన్’ ప్లాన్ అంటే ఏమిటి?
స్విగ్గీ వన్ అనేది ప్రీమియం మెంబర్షిప్ ప్లాన్. ఈ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 70 వేలకు పైగా ఉన్న లిస్టెడ్ రెస్టారెంట్ల నుంచి అపరిమిత ఉచిత డెలివరీలతో పాటు ఫుడ్ ఆర్డర్లపై 30% వరకు అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్విగ్గీ వన్ ఉన్న కస్టమర్లు ఎటువంటి డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
మెంబర్షిప్ ఫీజు ఎంత?
స్విగ్గీ వన్ మెంబర్షిప్ ఫీజుగా మొదటి మూడు నెలలకు రూ. 299, ఏడాది మెంబర్‌షిప్‌కు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు కేవలం రూ. 75 మాత్రమే స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌కు ఖర్చవుతుంది. స్విగ్గీ వన్ సేవలు ప్రస్తుతం లక్నో, పూణె, త్రివేండం, విజయవాడ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాల్లో స్వీగ్గీ వన్ మెంబర్షిప్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే స్విగ్గీ సూపర్ మెంబర్స్‌గా ఉన్నవారు ఆటోమేటిక్‌గా స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌కు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అప్‌గ్రేడ్ అవుతారని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా స్విగ్గీ సూపర్ మెంబర్స్‌కు కాంప్లిమెంటరీగా నెల రోజుల పొడిగింపు కూడా రానుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.