హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Live In Relationship: లివ్ ఇన్ రిలేషన్ షిప్.. మహిళలపై లైంగిక నేరాలు, అఘాయిత్యాలకు దారితీస్తుంది.. మధ్య ప్రదేశ్ హైకోర్టు

Live In Relationship: లివ్ ఇన్ రిలేషన్ షిప్.. మహిళలపై లైంగిక నేరాలు, అఘాయిత్యాలకు దారితీస్తుంది.. మధ్య ప్రదేశ్ హైకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya pradesh: పెళ్లి కానీ యువతీ యువకులు, ఒకరితో మరోకరు ఏమాత్రం సంబంధం లేని వారు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం వలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని మధ్య ప్రదేశ్ కోర్టు వ్యాఖ్యానించింది.

Live In Relationships Are Leading To Rise In erotic Offences: ప్రస్తుత సమాజంలో యువత వింత పోకడలకు పోతున్నారు. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే యువతి, యువకుడు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం పై హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఇండోర్ కు చెందిన యువకుడు తనతో పాటు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మహిళను అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ అతను పెళ్లికి నిరాకరించాడు.

ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇండోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన ధర్మాసనం.. లివ్ ఇన్ రిలేషన్ వలన మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించింది. నేటి యువత తమకు రాజ్యంగం ప్రసాదించిన 21 ఆర్టికల్ ను పూర్తిగా అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి రిలేషన్ తో మహిళలపై..  లైంగిక పరమైన నేరాలు , వ్యభిచారాలకు దారితీస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో యువకుడు ముందస్తు బెయిల్ కోరుతూ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశాడు. కేసును విచారించిన కోర్టు పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. అదే విధంగా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

సాధారణంగా నేటి యువత చదువులు, ఉద్యోగాల కోసం మెట్రోపాలిటన్ నగరాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఉండటానికి సరైన సదుపాయాలు లేక తెలిసిన వారు లేక మధ్య వర్తులను అప్రోచ్ అవుతున్నారు. వారు అధిక అద్దెలను చెల్లించలేక, రూమ్ షేరింగ్, లివ్ ఇన్ రూమ్, వంటి వాటిని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్కొసారి ఈ క్రమంలో యువత ఊహించని ప్రమాదంలో ఇరుక్కుంటున్నారు.

భారతీయ సమాజం, వివాహాబంధం,నైతికత, పలు ఆదర్శలను పాటిస్తుందని తెలిపింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ వలన చట్టపరమైన వివాదాలు తలెత్తుతాయని తెలిపింది. కొందరు తమ స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మధ్యప్రదేశ్ ధర్మాసనం ఆవేదం వ్యక్తం చేసింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: High Court, Madhya pradesh

ఉత్తమ కథలు