హోమ్ /వార్తలు /travel /

Andhra Pradesh: ఈ సరస్సు అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...! ఏపీలో ఎక్కడుందో తెలుసా..?

Andhra Pradesh: ఈ సరస్సు అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...! ఏపీలో ఎక్కడుందో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు అనేసరికి అందరూ ఠక్కున కొల్లేరు పేరు చెప్తారు. కానీ మరో అందమైన మంచినీటి సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు అనేసరికి అందరూ ఠక్కున కొల్లేరు పేరు చెప్తారు. కానీ మరో అందమైన మంచినీటి సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు అనేసరికి అందరూ ఠక్కున కొల్లేరు పేరు చెప్తారు. కానీ మరో అందమైన మంచినీటి సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు అనేసరికి అందరూ ఠక్కున కొల్లేరు పేరు చెప్తారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఈ సరస్సు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అరుదైన చేపలు దేశవ్యాప్తంగా ఫేమస్. అయితే అంతే అందంగా.. మంచి నీటితో ఉన్న మరో సరస్సు ఆంధ్రాలో ఉంది. అదీ విశాఖ జిల్లాలోనే ఉంది. దాని పేరు కొండకర్ల ఆవ. పర్యాటక శాఖ ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తోంది. ఒక్కసారి ఇక్కడకు వెళ్తే.. కొండకర్ల ఆవ సొగసు చూడతరమా అనడం ఖాయం. ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలు ఒక్కసారి చూసి ఆనందించాల్సిందే. కొండకర్ల ఆవ విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఉంది. ఇది రాష్ట్రంలో కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచినీటి సరస్సు. ఒక వైపు కొండలు, మరొకవైపు కొబ్బరిచెట్లు ఆవకు ప్రత్యేక అందాన్నిచ్చాయి.

  సరస్సులోని వివిధ రకాల నీటి మొక్కలు, రకరకాల పక్షులు, ప్రకృతి ప్రేమికులకు కనువిందుచేస్తాయి. ఇక ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబరు నెలల్లో విదేశాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. విదేశీ పక్షులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఆవలో దోనె షికారు ఎంతో ఉషారుగా ఉంటుంది. పర్యాటక శాఖ రవాణాతో పాటు కాటేజీల నిర్మాణంపై దృష్టి పెడుతోంది. సరస్సు అందాలకు ముగ్ధులై ఫ్రెంచ్ వారు ఆవకు సమీపం లో ఫ్రెంచ్ భవనాన్ని నిర్మించారు. అంతేకాదు స్వతంత్రం రాక ముందు విజయనగరం మహారాజులు వారాంతపు విడిదిగా ఇక్కడికి వచ్చే వాళ్ళు. అప్పటి నుంచి ఈ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మంచి హాలీడే స్పాట్ గా మారింది.

  ఇది చదవండి: అలా జరగడానికి మీరే కారణం...! టీడీపీకి బుగ్గన కౌంటర్...

  ప్రకృతి అందాలు

  ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుదగ్గది రంగు రంగుల పక్షులు. గుంపులు గుంపులుగా విహరిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ ఆవ అందాలను కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఫోటో షూట్స్ కూడా ఎక్కువ చేస్తారు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తో పాటు, సినిమాలు వంటివి కూడా ఇక్కడ చిత్రించడానికి దూర ప్రాంతాల నుండి కూడా వస్తారు. దోనెలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా ఫోటో షూట్స్ చేస్తారు. ఆవ దగ్గర్లో ఉన్న చూచుకొండ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఉంది.

  ఇది చదవండి: పెళ్లై ఏడాది కూడా కాలేదు... ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. అంతలోనే ఊహించని ట్విస్ట్...

  మండల కేంద్రమైన అచ్యుతాపురం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. అనకాపల్లి నుండి లేదా విశాఖపట్నం నుండి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. సో మీరు కూడా ఓ వీకెండ్ ప్లాన్ చేసుకొని ఆవ అందాలను ఆస్వాదించవచ్చు.

  ఇది చదవండి: హిమగిరులుగా తిరుమలగిరులు... చూడటానికి రెండు కళ్లూ సరిపోవు..

  First published:

  ఉత్తమ కథలు