IRCTC Thailand Package : ట్రావెలింగ్(Travelling) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ట్రావెలింగ్ అంటూ ఇష్టపడనోళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇక,ట్రావెలర్లు చాలా మంది అందమైన ప్రదేశాలలో తిరగడానికి ఇష్టపడతారు. కొంతమంది పర్వతాలు ఉండే ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు, మరికొందరు సముద్రం ఉంటే ప్లేస్ లలో గడపాలని కోరుకుంటారు. మన దేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ చాలా మంది ప్రజలు విదేశాలకు వెళ్లాలని కలలు కంటుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందన్న కారణంతో దేశంలోనే పర్యటిస్తుంటారు. అయితే మీరు విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లయితే... ఐఆర్ సీటీసీ(IRCTC)మీ కోసం ఒక సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. దాదాపు 50 వేల రూపాయలతో థాయిలాండ్ టూర్(Thailand Tour) కి వెళ్లొచ్చు. IRCTC థాయిలాండ్ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు తెలుసుకుందాం.
IRCTC థాయిలాండ్ టూర్ ప్యాకేజీ?
IRCTC వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం...ఈ పర్యటన మూడు రాత్రులు, 4 పగళ్లు ఉంటుంది. ప్యాకేజీని ఎంచుకునే వ్యక్తులు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను సందర్శించే అవకాశాన్ని పొందుతారు, ఆపై అందమైన నగరమైన పట్టాయాను విమానంలో వెళ్లి సందర్శించవచ్చు. వివరాల ప్రకారం ఈ యాత్రకు గరిష్టంగా 35 మంది నమోదు చేసుకోవచ్చని, ఆగస్టు 12న హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరుతుందని తెలిపారు. టూర్ సమయంలో హోటల్, ఆహారం,అన్ని ఇతర ప్రయాణ ఏర్పాట్లను IRCTC చేస్తుంది. ట్రిప్ సమయంలో ప్రతి ఒక్కరికి బీమా వర్తిస్తుంది. టూర్ కి వచ్చినోళ్ల స్థానిక ప్రదేశాల వివరాలను చెప్పే ఓ లోకల్ గైడ్ కూడా ఉంటారు.
ఎంత ఖర్చు అవుతుంది?
ఈ యాత్రకు వెళ్లే వ్యక్తి... చైల్డ్ బెడ్ లేకుండా రూ.41855 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల బెడ్‌తో కలిపి అయితే ఒక్కొక్కరికి 47040 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా, డబుల్ మరియు ట్రిపుల్ షేరింగ్ రూమ్ ఉన్న వ్యక్తి రూ. 48820 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ షేరింగ్ ఉన్న వ్యక్తి ఈ ట్రిప్ కోసం రూ.55640 వెచ్చించాల్సి ఉంటుంది. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ టూర్ కి వెళ్లగలరు. IRCTC వెబ్‌సైట్‌లో దీని గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. అక్కడ ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.
బ్యాంకాక్, పట్టాయా ఎందుకు ప్రసిద్ధి ?
బ్యాంకాక్.. థాయిలాండ్ రాజధాని. స్ట్రీట్ లైఫ్, సాంస్కృతిక ప్రదేశాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. నైట్ లైఫ్ ఆస్వాదించాలనుకునే పర్యాటకుల మొదటి ఆప్షన్ బ్యాంకాక్. థాయ్‌లాండ్‌లోని మరొక నగరం పట్టాయా. పటాయా... ప్రసిద్ధ నైట్‌క్లబ్‌లు, గో-గో బార్‌లు, క్యాబరే వేదికలు, సహజమైన బీచ్‌లు, అభివృద్ధి చెందుతున్న పర్యాటక పరిశ్రమకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangkok, IRCTC, IRCTC Tourism, Thailand