హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Road Trips: రోడ్ ట్రిప్స్ ఎక్స్‌పీరియన్సే వేరబ్బా.. మీరూ ట్రావెల్ లవరైతే.. జీవితంలో ఒక్కసారైనా వీటిని చూడాల్సిందే..!

Road Trips: రోడ్ ట్రిప్స్ ఎక్స్‌పీరియన్సే వేరబ్బా.. మీరూ ట్రావెల్ లవరైతే.. జీవితంలో ఒక్కసారైనా వీటిని చూడాల్సిందే..!

ట్రావెల్ లవర్స్ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్

ట్రావెల్ లవర్స్ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్

రోడ్‌ ట్రిప్‌లు (Road Trips) చేపట్టే ఆసక్తి ఉన్న వారు కచ్చితంగా ప్రయాణించాల్సిన (Travel) మార్గాలు మన దేశంలో కొన్ని ఉన్నాయి. అందరికీ ఆనందాలు పంచే ఆ రోడ్‌ట్రిప్‌ వివరాలు ఇవే..

కొన్ని ప్రయాణాలు గమ్యానికే కాదు జీవితాంతం దాచుకొనే అద్భుత అనుభూతులను కూడా చెంతకు చేరుస్తాయి. సాహసాలతో జీవిత పరిమళాన్ని ఆస్వాదించేలా చేస్తాయి. మేఘాలను చేతులతో అందుకుంటూ దూసుకెళ్లే ఎన్నో సుందర మార్గాలు ఇండియాలో ఉన్నాయి. రోడ్‌ ట్రిప్‌లు చేపట్టే ఆసక్తి ఉన్న వారు కచ్చితంగా ప్రయాణించాల్సిన మార్గాలు మన దేశంలో కొన్ని ఉన్నాయి. అందరికీ ఆనందాలు పంచే ఆ రోడ్‌ట్రిప్‌ వివరాలు ఇవే..

చెన్నై నుంచి మున్నార్ వయా పాండిచ్చేరి

రూట్ మ్యాప్: చెన్నై-పాండిచ్చేరి-త్రిచ్చి-దిండిగల్-ఉడుమలై-మున్నార్ (620 కి.మీ)

ఈ ప్రయాణంలో ప్రధాన పిట్‌స్టాప్‌గా ఉన్న పాండిచ్చేరికి తూర్పు తీర రహదారి వెంట దక్షిణం వైపు వెళ్ళండి. ప్రత్యేకమైన ఫ్రెంచ్-ప్రభావిత సంస్కృతి, అందమైన బీచ్‌లు, మరపురాని ఆతిథ్యాన్ని అనుభవించండి. తిరుచియాపల్లిలో ఆధునికత, సాంప్రదాయం చక్కటి సమ్మేళనాన్ని అనుభవించవచ్చు. దిండిగల్ ప్రాంతం దక్షిణ భారతదేశంలోని 3 ప్రధాన రాజ్యాలకు సరిహద్దుగా పనిచేసింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ పర్యటన చేపట్టడానికి అనుకూల సమయం.

గోవా నుంచి కొడగు (కూర్గ్)

రూట్ మ్యాప్: గోవా-గోకర్ణ-మురుడేశ్వర్-భత్కల్-ఉడిపి-మంగళూరు-మడికేరి-కొడగు (501 కి.మీ)

భారతదేశంలోని పశ్చిమ కనుమల గుండా సాగే ఈ ప్రయాణం అరేబియా సముద్రం అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది. రోడ్‌సైడ్ స్టాల్స్‌లో కొబ్బరి నీళ్ల కోసం ఆగవచ్చు. గోకర్ణ వద్ద సుందర దృశ్యాలు, మురుడేశ్వర్‌లో అందాలు, మడికేరిలోని అద్భుతమైన అబ్బే జలపాతం, కొడగు జిల్లాలోని ఆహ్లాదకరమైన కాఫీ తోటలు ఆధ్యంతం అలరిస్తాయి. ప్రకృతి ప్రేమికులు ఈ యాత్రకు వెళ్లేందుకు వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) ఉత్తమ సమయం.

ఇదీ చదవండి: యుద్ధంలో పైచేయి ఎవరిది..? రష్యా ఓడిందా..? అందుకే పాత కాలం నాటి మిస్సైల్స్‌ను ఉపయోగిస్తుందా..?


శ్రీనగర్ మీదుగా ఢిల్లీ నుంచి లేహ్

రూట్ మ్యాప్: ఢిల్లీ- పఠాన్‌కోట్- పట్నిటాప్ - శ్రీనగర్ - సోన్‌మార్గ్ - కార్గిల్ - ముల్బెక్- లమయూరు - లేహ్ (1,250 కి.మీ)

ఈ పర్యటనలో గమ్యస్థానం కంటే ప్రయాణం మరింత ఉత్తేజం ఇస్తుంది. పైన్, దేవదారు అడవుల పచ్చదనం ప్రయాణానికి మరిన్ని అనుభూతులను జోడిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగవచ్చు. శ్రీనగర్ వరకు మీరు దాల్ సరస్సులో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. సోన్‌మార్గ్ నుంచి లేహ్ వరకు పర్వత మార్గాలలో ప్రతి మలుపు రంగు, ఆకృతిని మారుస్తూ అలరిస్తాయి. ఈ ప్రదేశాలను సందర్శించడానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సరైన సమయం. ఈ ప్రయాణం పూర్తి కావడానికి 3-4 రోజులు పడుతుంది.

ఇదీ చదవండి: మరో అద్భుతానికి అమెరికా శ్రీకారం.. లార్జెస్ట్ సబ్‌మెరైన్ నిర్మాణంలో యూఎస్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?సాంగ్లా వ్యాలీ, కిన్నౌర్

రూట్ మ్యాప్: ఢిల్లీ-సిమ్లా-సరహన్-సంగ్లా-చిత్కుల్-కల్ప (578 కి.మీ)

కిన్నౌర్‌లోని సాంగ్లా లోయ హిమాచల్ ప్రదేశ్‌లోని ఈశాన్యంలో ఉంది. పచ్చనిచెట్లతో కప్పుకున్న లోయలో బస్పా నది ప్రవహిస్తుంది. ప్రయాణం NH1 నుంచి ప్రారంభమవుతుంది. తరువాత అందమైన శివాలిక్ పర్వతాల గుండా సిమ్లా చేరుకుంటుంది. అప్పుడు కర్చామ్ చేరుకోవడానికి భయంకరమైన సట్లెజ్ నది వెంట డ్రైవ్ చేయండి, అక్కడ రోడ్డులో చీలిక వద్ద ఒక మార్గం మిమ్మల్ని స్పితికి, మరొక మార్గం సాంగ్లా లోయకు తీసుకువెళుతుంది. స్పతికి వెళ్లే దారి 18 కి.మీ ఉంటుంది. నదికి ఎగువన ఉన్న గోర్జెస్, కొండ చరియలు దిగువన ప్రవహించే ఇరుకైన వంకర రహదారి. సాంగ్లా లోయలో యాపిల్, ఆప్రికాట్, వాల్-నట్, సెడార్ చెట్ల తోటలు, ట్రౌట్ ఫిష్‌తో కూడిన హిమనదీయ ప్రవాహాలు పుష్కలంగా ఉన్నాయి. మరో 22కిలోమీటర్ల ప్రయాణం మిమ్మల్ని టిబెట్ సరిహద్దు భారతదేశంలోని చివరి గ్రామమైన చిట్కుల్‌కు తీసుకెళుతుంది. సమీపంలో కమ్రు గ్రామం హిమాచల్‌లోని పురాతన కోటలలో ఒకటి. ఈ పర్యటన పూర్తి కావడానికి 4 రోజులు పడుతుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ పర్యటన చేపట్టడానికి అనుకూల సమయం.

జోర్హాట్ నుంచి మెచుకా వరకు

రూట్ మ్యాప్: జోర్హాట్ - దిబ్రూఘర్ - పాసిఘాట్ - ఆలో - మెచుకా (540 కిమీలు)

ఈ యాత్ర మిమ్మల్ని బ్రహ్మపుత్ర నది వెంట దక్షిణం నుంచి ఉత్తరానికి తీసుకువెళుతుంది. ఇది ఈశాన్య భారతదేశంలోని పొడవైన రహదారి ప్రయాణాలలో ఒకటి. ఈ యాత్ర జోర్హాట్ నుండి మొదలవుతుంది. ఇది ఎగువ అస్సాంకు వెళ్లే మార్గం. ఈ మార్గం అనేక అటవీ కొండలు, విశాలమైన పచ్చికభూములు, చిన్న కుగ్రామాల గుండా వెళుతుంది. ఈ రోడ్ ట్రిప్ అందమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిని అనుభవించే అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. మీరు భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపమైన మజులి వద్ద ఆగవచ్చు. ఇక్కడ, మీరు గారో తెగలను కలుసుకోవచ్చు. మెచుకా వద్ద స్థానిక గిరిజనులను కలుసుకోవచ్చు. మీరు సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఈ రోడ్ ట్రిప్‌కి వెళ్లవచ్చు.

ఇదీ చదవండి: గూగుల్ అదిరే కొత్త ఫీచర్.. టోల్ రేట్లను ముందుగానే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?


గౌహతి నుంచి మోరే వరకు

రూట్ మ్యాప్: గౌహతి-షిల్లాంగ్-ఇంఫాల్-మోరే (593 కిమీ)

ఈశాన్య భారతదేశంలో ఇది సుదీర్ఘ పర్యటన. ఈశాన్య నాలుగు ప్రధాన రాష్ట్రాలు: అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ గుండా యాత్ర సాగుతుంది. గౌహతిలో సూర్యాస్తమయం చూడటం అద్భుతమైన అనుభవం, ఇంఫాల్ పచ్చని ప్రకృతి దృశ్యాలు, షిల్లాంగ్‌లోని మేఘాల మధ్య ప్రయాణించడం ఈ యాత్ర ప్రియులకు ఆల్ టైమ్ ఫేవరెట్.

First published:

Tags: Delhi, Kashmir, Lifestyle, Travel

ఉత్తమ కథలు