హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Hyundai Venue: హ్యుందాయ్‌ వెన్యూ 2022 ఎడిషన్ లాంచ్.. ఈ కారు ధర ఎంతంటే..?

Hyundai Venue: హ్యుందాయ్‌ వెన్యూ 2022 ఎడిషన్ లాంచ్.. ఈ కారు ధర ఎంతంటే..?

హ్యుందాయ్‌ వెన్యూ 2022 ఎడిషన్ లాంచ్..

హ్యుందాయ్‌ వెన్యూ 2022 ఎడిషన్ లాంచ్..

హ్యుందాయ్ వెన్యూ 2022 ఎడిషన్ తాజాగా ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది. దీని ప్రారంభ ధర రూ.7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్, లాంచింగ్‌ ఆఫర్‌)గా ఉంది. ఈ కారు ఫుల్ స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.

హ్యుందాయ్ వెన్యూ 2022 ఎడిషన్ తాజాగా ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది. దీని ప్రారంభ ధర రూ.7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్, లాంచింగ్‌ ఆఫర్‌)గా ఉంది. హ్యుందాయ్‌ వెన్యూ ముందు 2019లో లాంచ్ అయింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఇండియన్‌ రోడ్‌లపై తిరుగుతున్న హ్యుందాయ్ వెన్యూ కార్‌ల సంఖ్యను మరింత పెంచే ఉద్దేశంతో లేటెస్ట్‌ హ్యుందాయ్‌ వెన్యూను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

హ్యుందాయ్ వెన్యూ 2022 ఎడిషన్ E, S, S+, S(O), SX, SX(O) అనే ఆరు ట్రిమ్‌లలో లభిస్తుంది. మూడు ఇంజిన్‌ ఆప్షన్‌లలో, పోలార్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్‌, డెనిమ్ బ్లూ, ఫైరీ రెడ్, ఫైరీ రెడ్ విత్‌ బ్లాక్ రూఫ్‌ వంటి సెవెన్‌ బాడీ కలర్‌లలో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ వెన్యూ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో.. 1.2-లీటర్ పెట్రోల్ మోటార్, iMT, DCT గేర్‌బాక్స్‌ ఫైవ్‌-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్, టర్బో పెట్రోల్ యూనిట్‌, డీజిల్ మోటార్‌ సిక్స్‌-స్పీడ్ మాన్యువల్ ఉన్నాయి.

ఇదీ చదవండి: షియోమీ ఫోన్లు వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ బ్యాటరీ హెల్త్‌ను ఇలా టెస్ట్ చేసుకోండి


హ్యుందాయ్ వెన్యూ ధరలు ఇలా..

Hyundai వెన్యూ ధరలు రూ.7.53 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. S వేరియంట్ ధర రూ.8.70 లక్షలు, S(O) వేరియంట్‌ ధర రూ.9.50 లక్షలు, టాప్ SX వేరియంట్ ధర రూ.10.69 లక్షలుగా ఉంది. టర్బో మోటార్‌తో వచ్చే హ్యుందాయ్ వెన్యూ S(O) iMT వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. దీని ధర రూ.9.99 లక్షలు, DCTతో S(O) రూ.10.96 లక్షలు, ఆ తర్వాత SX(O) iMTని రూ.11.92 లక్షలు, SX(O) DCTని రూ.12.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. U2 1.5 l CRDi డీజిల్‌తో హ్యుందాయ్ వెన్యూని సెలక్ట్‌ చేసుకుంటే బేస్ S+ మాన్యువల్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు, ఆ తర్వాత SX మాన్యువల్ రూ.11.42 లక్షలు, SX(O) డీజిల్ రూ.12.32 లక్షలకు లభిస్తాయి.

ఇదీ చదవండి: అగ్నివీర్స్ కోసం NIOS స్పెషల్ ప్రోగ్రామ్.. 12వ తరగతి పాస్ సర్టిఫికెట్ ఇవ్వనున్న సంస్థహ్యుందాయ్ వెన్యూ వేరియంట్ ఫీచర్ హైలైట్స్

హ్యుందాయ్ వెన్యూ బేస్ E వేరియంట్ 1.2-లీటర్ petrol మోటారుతో టచ్ స్క్రీన్ ఆడియో, క్లస్టర్‌ సహా హైటెక్ డిజిటల్ స్క్రీన్‌లతో పాటు ESC, VSM, TPMSలను అందిస్తుంది. S(O) వేరియంట్ LED హెడ్‌ల్యాంప్‌లు, DRLలు, కనెక్టింగ్ LED ల్యాంప్‌లను అందిస్తుంది. అయితే టాప్ వేరియంట్

హ్యుందాయ్ బ్లూలింక్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రిక్లైనింగ్ ఫంక్షన్‌తో వెనుక స్ప్లిట్ 60:40 సీట్లు అందిస్తుంది. టర్బో ఇంజిన్‌తో కూడిన హ్యుందాయ్ వెన్యూ S(O) iMTతో ప్రారంభమవుతుంది, ఇది అనేక సెక్యూరిటీ మెజర్స్‌, టచ్ స్క్రీన్ ఆడియో, క్లస్టర్‌తో డిజిటల్ స్క్రీన్‌లు, LED హెడ్‌ల్యాంప్‌లు, DRL, కనెక్ట్ చేసే LED ల్యాంప్‌లతో వస్తుంది.

డీజిల్ వేరియంట్‌లు కూడా పైన పేర్కొన్న విధంగానే ఫీచర్‌లను అందిస్తున్నాయి. అయితే ఏదైనా వేరియంట్‌లలో డ్యూయల్-టోన్ కావాలంటే అదనంగా రూ.15,000 వెచ్చించాల్సి ఉంటుంది.

Published by:Mahesh
First published:

Tags: Auto News, Hyundai, New car, Petrol

ఉత్తమ కథలు