హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Goa Tourism: ధనికులే గోవా పర్యటనకు రావాలంటున్న మంత్రి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Goa Tourism: ధనికులే గోవా పర్యటనకు రావాలంటున్న మంత్రి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బస్సులో వంటకాలు వండుకునే తక్కువ బడ్జెట్‌ పర్యాటకులు గోవా రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదని, గోవాకి అత్యంత ధనిక పర్యాటకులు (Richest tourists) మాత్రమే రావాలంటూ ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి (tourism minister) మనోహర్‌ అజ్గనోగర్‌ (Manohar ajgaonkar) వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి ...

భారతదేశంలోని గోవా (Goa)కు వెళ్లేందుకు చాలామంది పర్యాటకులు (Tourists) ఆసక్తి చూపిస్తుంటారు. ఈ తీర ప్రాంతంలో సముద్ర, ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఫ్యామిలీలు, స్నేహితులు కలిసి వస్తుంటారు. చిన్నా, పెద్దా పేద, ధనిక బేధం లేకుండా అందరూ గోవా అందాలను (beauty) ఆస్వాదిస్తూ మైమరిచి పోతుంటారు. అయితే ఇకపై గోవాకి అత్యంత ధనిక పర్యాటకులు (Richest tourists) మాత్రమే రావాలంటూ ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి (tourism minister) మనోహర్‌ అజ్గనోగర్‌ (Manohar ajgaonkar) వ్యాఖ్యానించారు. బస్సులో వంటకాలు వండుకునే తక్కువ బడ్జెట్‌ పర్యాటకులు గోవా రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదని (No need to come) ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంస్కృతిని పాడు చేసే టూరిస్టులు మాకొద్దు..

"డ్రగ్స్ వినియోగిస్తూ గోవా సంస్కృతిని పాడు చేసే టూరిస్టులు మాకొద్దు. గోవాకు వచ్చి బస్సు లోపల వంట వండుకునే పర్యాటకులు మాకు అక్కర్లేదు. మాకు రిచ్చెస్ట్ టూరిస్టు (richest tourists)లు కావాలి. మేము పర్యాటకులందరిని స్వాగతిస్తాం. వాళ్లు ఎంజాయ్ చేస్తూనే ఇక్కడి కల్చర్‌ (culture)ను గౌరవించాలి. మా ప్రభుత్వం (government) డ్రగ్స్‌కు పూర్తి వ్యతిరేకం’ అని అజ్గనోగర్‌ అన్నారు.

లో-బడ్జెట్ పర్యాటకులు వద్దు..

అయితే ధనికులు తప్ప తమకు లో-బడ్జెట్ పర్యాటకులు వద్దని మనోహర్‌ చెప్పడంతో నెటిజన్లు (netizens) మండిపడుతున్నారు. గోవాకి వెళ్లే హక్కు ప్రతి భారతీయుడి (every Indian)కి ఉంటుందని మరికొందరు నెటిజన్లు మనోహర్‌ (Manohar ajgaonkar) వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు గోవాకి వెళ్లే హక్కు లేదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఫిబ్రవరి 2018లో గోవా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మినిస్టర్ విజయ్ సర్దేశాయ్ మాట్లాడుతూ.. ఉత్తర భారతీయుల కోసం హర్యానాలో గోవా సృష్టించాలని అన్నారు. భారత పర్యటకులను గోవాకి రానివ్వకూడదు అంటూ అతను సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనవరి 31, 2019న సవరణ..

గోవా అసెంబ్లీ జనవరి 31, 2019న రాష్ట్ర పర్యాటక చట్టాన్ని సవరించింది. బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం, మద్యం (alcohol) సేవించడం నిషేధిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. బీచ్‌ (beach)లలో బహిరంగంగా వంట చేయడం, తాగడం, బహిరంగంగా గాజు సీసాలను పగలగొట్టడం వంటి చర్యలకు రూ.2,000 జరిమానాతో పాటు క్రిమినల్ ఛార్జెస్ (criminal charges) విధిస్తామని గోవా (goa) రాష్ట్రం స్పష్టంచేసింది.

అంతర్జాతీయ పర్యాటకులకు..

అంతర్జాతీయ పర్యాటకులకు ఐదు లక్షల ఉచిత వీసాలను ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని అజ్గనోగర్‌ స్వాగతించారు. హోటల్ లైసెన్స్‌లకు సంబంధించి 50 శాతం ఫీజులను మాఫీ చేశామని తెలిపారు. డ్రగ్స్ రవాణా చేసే క్రూయిజ్ షిప్‌లను గోవా రేవులో నిలపడానికి వీల్లేదని గోవా పోర్టుల మంత్రి మైఖేల్ లోబో మంగళవారం హెచ్చరించారు. గోవాలోకి డ్రగ్స్ దొరికిన క్రూయిజ్ షిప్‌లను అనుమతించవద్దని మోర్ముగావ్ పోర్ట్ ట్రస్ట్ (MPT) కి లేఖ రాస్తానని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 2న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసిన దాడిలో గోవా వెళ్లే క్రూయిజ్ షిప్ లో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయి. ఈ ఘటనలో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ముంబైలో అరెస్టు చేశారు.

First published:

Tags: Goa, Netizen, Richest Indians, Social Media