Bear: అయ్యో.. ‘హనీట్రాప్’లో చిక్కుకున్న ఎలుగుబంటి.. చివరికి ఏమైందంటే..?

కొమ్మల్లో చిక్కుకున్న ఎలుగుబంటి ఇదే..

తేనె కొసం చెట్టెక్కిన ఓ ఎలుగుబంటి దిగడానికి ఓ రోజు పట్టింది. ఆ ఎలుగుబంటి కాళ్లు కొమ్మల్లో చిక్కుకుపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కష్టాలు కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయి అని.. పశుపక్షాదులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మనం అనుకుంటూ ఉంటాం. బతికినన్ని రోజులు స్చేచ్ఛగా తిరిగి ఎలాంటి బాధలు లేకుండా అవి జీవనం సాగిస్తాయని మనుషుల భావన. కానీ వాటికి కూడా కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బతకడానికి ఆహారం సంపాదించుకోవడం.. ఇతర జంతువులకు తాము ఆహారం కాకుండా కాపాడుకోవడం వాటికి కూడా సవాలే. తాజాగా తేనె కోసం వెళ్లిన ఓ ఎలుగుబంటి చెట్టు కొమ్మల్లో చిక్కుకుని ఓ రోజంతా నరకయాతన పడింది. అయితే ఫారస్ట్ అధికారుల పుణ్యామా అని ఆ ఎలుగుబంటి రక్షించబడింది. ప్రాణాలతో బయటపడి మళ్లి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన కేరళ-తమిళనాడు(Kerala - Tamilnadu) సరిహద్దులోని మలక్కప్పర(Malakkappara)లో చోటు చేసుకుంది. సమీపంలోని ఓ టీ ఎస్టేట్ లోకి వచ్చిన ఓ ఎలుగుబంటి అక్కడ ఉన్న ఓ 30 ఫీట్ల ఎత్తు ఉన్న సిల్వర్ రాక్ చెట్టు పై ఉన్న తేనె తుట్టెను చూసింది. దీంతో తేనె తాగుదామని ఆశపడిన ఆ ఎలుగుబంటి ఆ చెట్టు ఎక్కేసింది. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ఆ ఎలుగుబంటి తేనె తాగుదామని ఆశపడింది. ఇందు కోసం ఓ చెట్టు ఎక్కింది.

    కానీ అనుకోకుండా దాని కాలు చెట్టుకొమ్మల్లో చిక్కుకుపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. అయితే అక్కడ పని చేస్తున్న వర్కర్లు ఆ ఎలుగుబంటి అరుపులు వినడంతో అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ ఎలుగుబంటి అరుపులు భయంకరంగా ఉండడంతో వారు కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఆ ఎలుగుబంటి స్వయంగా కిందకు దిగేలా చేసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం కట్టెలకు నిప్పు అంటించి దానిని భయపెట్టేలా చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆ చెట్టుకు నరకాలని వారు నిర్ణయించారు.
    Viral Video : బురదలో ఈ ఏనుగులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.. వైరలవుతున్న గజరాజుల ఫన్నీ వీడియో..
    బావిలో పడిన ఎద్దు.. కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే ఏమైందో తెలుసా?



    ఎలుగుబంటి కిందకు పడగానే వెటర్నరీ డాక్టర్ సుకుమారన్ దానికి మత్తు ఇంజక్షన్ ను ఇచ్చారు. ట్రీట్మెంట్ అనంతరం దానికి సమీపంలోని ఫారెస్ట్ లో వదిలివేశారు. ఈ రిస్క్యూ ఆపరేషన్ వలపరయి(Valparai) రేంజ్ ఆఫీసర్ నేతృత్వంలో జరిగింది. అనంతరం ఆ ఎలుగుబంటిని సమీప అటవీ ప్రాంతంలో వదిలివేశారు. అయితే గతేడాది కూడా వలపరాయి(Valparai) ఫారెస్ట్ ఏరియాలో ఎలుగుబంటి అటవీ సిబ్బందిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా.. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.
    Published by:Nikhil Kumar S
    First published: