Black-Naped Pheasant Pigeon : ఈ పక్షి పేరు బ్లాక్ నాప్డ్ పావురం. అరుదైన పక్షి. 140 ఏళ్ల కిందట చివరిసారి కనిపించింది. తాజాగా పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో సైంటిస్టులు దీన్ని కనిపెట్టారు. దట్టమైన అడవిలో ఏర్పాటు చేసిన ఓ కెమెరాలో ఈ పక్షి కనిపించింది. దీన్ని పావురం అని పిలుస్తున్నా.. చూడటానికి అలా ఏమాత్రం ఉండదు. సైజు కూడా కోడి సైజులో ఉంటుంది. వందేళ్లుగా కనిపించకుండా అంతరించిపోయిన 20 పక్షుల్లో ఇది కూడా ఉంది.
అడవిలో తిరిగే స్థానికులు ఇలాంటి వింత పక్షిని తాము చూశామని అటవీ అధికారులకు చెప్పడంతో.. అధికారులు.. పక్షుల శాస్త్రవేత్తలకు కబురు పంపారు. దాంతో ఆ శాస్త్రవేత్తలు, అటవీ అధికారులూ కలిసి.. పక్షి కనిపించిందని స్థానికులు చెప్పిన ప్రదేశంలో కెమెరాలను అమర్చారు. కానీ అది మళ్లీ కనిపించలేదు. అలా నెలపాటూ.. ఎదురు చూడగా.. అప్పుడు కనిపించింది. సెప్టెంబర్ నెలలో ఇది కనిపించిందని అధికారులు తాజాగా తెలిపారు.
ఆ పక్షి వీడియోని ఇక్కడ చూడండి (viral video)
During the final hours of an expedition searching for the Black-naped Pheasant-pigeon, camera traps captured photos and video of the bird, which had been long-lost to science for 140 years. #LostBirds https://t.co/701DV3Dokn pic.twitter.com/Qs715l6Cys
— Re:wild (@rewild) November 17, 2022
మొత్తం 8 మంది శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలో పాల్గొంది. ఇందులో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ సంస్థ, అమెరికన్ బర్డ్ కన్జర్వాన్సీ సంస్థల కృషి కూడా ఉంది. ఈ సంస్థలు దశాబ్ద కాలానికి పైగా కనిపించని 150 పక్షులను తిరిగి కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
2019లో మిస్సింగ్:
నిజానికి ఈ పక్షి ఉందనే విషయం 2019లోనే తెలిసింది. అప్పట్లో.. అదే పాపువా న్యూ గినియాలోని పెర్గూస్సన్ దీవిలో కెమెరాలు పెట్టినా అది కనిపించలేదు. కానీ శాస్త్రవేత్తలు ఆశలు వదులుకోలేదు. ఇప్పుడు వారు సక్సెస్ అయ్యారు. త్వరలోనే ఈ పక్షుల సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలపై అన్వేషణ సాగించనున్నారు.
Chicken Recipe : గ్రీన్ చికెన్ కర్రీ.. ఇలా చేశారంటే.. ఓ పట్టు పడతారంతే..
వీడియో వైరల్ :
ట్విట్టర్లోని @rewild అకౌంట్లో నవంబర్ 18న పోస్ట్ చేసిన పక్షి వీడియోని ఇప్పటివరకూ 3.83 లక్షల మందికి పైగా చూశారు. చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "140 ఏళ్లుగా ఆ పక్షి జాతి ఉందంటే అందుకు కారణం అవి మనుషుల కంట పడకపోవడమే. ఇప్పుడు వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "ఈ పక్షులకు అతి జాగ్రత్త ఎక్కువ. మనుషులు లేరనీ, ఏ ఆపదా ఉండదని తెలిసిన చోట మాత్రమే ఈ పక్షి తిరుగుతుంది. నేను దీన్ని యెమెన్లో చూశాను. కానీ ఇప్పుడా ప్రాంతంలో యుద్ధం ఉంది. అందువల్ల అక్కడికి వెళ్లే ఛాన్స్ లేదు" అని మరో యూజర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, Viral