హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Vizag: వేసవిలో సైతం చల్లని ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం.. విశాఖ మణిహారమైన కైలాసగిరికి మరో పేరు ఉందని తెలుసా..?

Vizag: వేసవిలో సైతం చల్లని ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం.. విశాఖ మణిహారమైన కైలాసగిరికి మరో పేరు ఉందని తెలుసా..?

కైలాస

కైలాస గిరికి మరో పేరు తెలుసా?

Vizag: విశాఖపట్నం అనగానే టక్కున గుర్తొచ్చేది ఆర్కే బీచ్‌, కైలాసగిరి. ఆ కైలాసగిరిలో ఆకాశాన్ని తాకినట్లు ఉండే ఆ శివపార్వతుల విగ్రహాలు చూడటానికి రెండు కళ్లు చాలవు.. అలా వైజాగ్‌ మణిహారంగా భాసిల్లుతున్న కైలాసగిరికి మరో పేరు కూడా ఉందని మీకు తెలుసా…!

ఇంకా చదవండి ...

  Neelima Eaty, News18 Visakhapatnam.

  Vizag: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) నే ప్రధాన పర్యాటక ఆకర్షణ కలిగిన నగరంగా విశాఖపట్నం (Visakhapatanam) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి కారణం ఇక్కడ ఉండే పర్యాటక ప్రదేశాలే (Best Tourist Spots).  విశాఖలో అడుగు పెట్టిన దగ్గర నుంచి.. చూపు తిప్పుకోనీయకుండా చేస్తాయి అక్కడి అందాలు.. సువీశాల సముద్ర తీరం ఉండడం అదనపు ఆకర్షణ.. విదేశీ పర్యాటకులు సైతం భారీగా విశాఖ వస్తున్నారు. ఎటూ చూసిన నీలి వర్ణంలో కనిపించే విశాఖ అందాలు చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.. ఇక నగరంలో కేవలం బీచ్ లు మాత్రమే కాదు.. ఆహ్లాదాన్ని పంచే పార్కులు సైతం ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది కైలాసగిరి.. మండు వేసవిలో సైతం చల్లటి ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంగా   'కైలాసగిరి' (kailasa Giri) కి పేరుంది.  పేరుకు తగినట్లే భువిపై ఉన్న కైలాసంలా ఈ ప్రాంతం అనిపిస్తుంది. విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా, ఏ మూల నుంచి చూసినా కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉంటుంది.

  380 ఎకరాల విస్తీర్ణం

  విశాఖ కైలాసగిరిని వినోదానికి కేరాఫ్ గా చెబుతారు. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో పర్యాటకులు ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతారు. ఎత్తైన తెల్లని శివ పార్వతుల విగ్రహ రూపాలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారు. 2014లో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ లో కైలాసగిరిలో అనేక ప్రదేశాలు దెబ్బతిన్నా ఈ శివ పార్వతుల విగ్రహాలు మాత్రం చెక్కుచెదరకపోవడం విశేషం.

  థామస్‌ ఫొల్లీ:

  కైలాసగిరికి మరో పేరు కూడా ఉంది. అదే 'థామస్ ఫొల్లీ'. ఇది చాలా మందికి తెలియని విషయం. విశాఖపట్నం జిల్లాలో స్కాటిష్ జడ్జి అయిన జాన్ రెయిడ్ థామస్ పేరు మీద ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 1830 కాలంలో ఆయన ఇక్కడ బంగ్లాను నిర్మించి నివాసం ఏర్పరుచుకున్నట్లు విశాఖపట్నం జిల్లా గెజిటీర్ ద్వారా తెలుస్తుంది. ఆయన తరువాత అనేక మంది బ్రిటిష్ అధికారులు దీన్ని వినియోగించుకున్నారు. దీంతో ఈ ప్రాంతం 'థామస్ ఫొల్లీ'గా అప్పట్లో ప్రసిద్ధి చెందింది.

  ఇదీ చదవండి : వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం.. 30 ఏళ్ల పాటు రాబడి..? ఇంకా ప్రయోజనాలు ఎన్నో

  కైలాసగిరి అని పేరు ఎలా వచ్చింది?

  కైలాసనాధుడి ఆలయం వలన ఈ ప్రాంతానికి కైలాసగిరిగా పేరు వచ్చిందని చెబుతారు. ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపో శక్తిని ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాధుని శివలింగాన్ని ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది.

  ఇదీ చదవండి: పిల్లలు ఫోన్‌ వదలడం లేదా..? బుక్ పట్టుకోవాలంటే చిరాకు పడుతున్నారా? అయితే అక్కడకు తీసుకెళ్లండి..

  మన సంస్కృతిని తెలియజేసే తెలుగు మ్యూజియం

  కైలాసగిరిపై పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో తెలుగు మ్యూజియం ఒకటి. తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇక్కడ ప్రదర్శిస్తారు. కొండపై 6 ఎకరాల స్థలంలో ప్రపంచ తెలుగు సమాఖ్య వారు విశాఖ నగర అభివృద్ధి సంస్థ సహకారంతో 2016 నవంబర్ 19న తెలుగు సాంస్కృతిక నికేతనం (తెలుగు మ్యూజియం)ను ఏర్పాటు చేశారు. భావి తరాలకు తెలుగు భాష, సంస్కృతిని పదిలపరిచే వేదికగా దీనిని చెబుతారు.

  ఇదీ చదవండి : బొంగులో చికెన్ అంటే ఇష్టమా.. దానికోసం ఏజెన్సీకి వెళ్లాల్సిన పనిలేదు.. సిటీలోనే.. కేజీ రేటెంతంటే

  ఈ సౌండ్ & లైట్ మ్యూజియంలో సినీ నటుడు సాయి కుమార్ గొంతుతో కూడిన తెలుగు చరిత్ర ఆడియోను, చరిత్రలోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు. తెలుగు, ఆంగ్ల భాషల్లోనూ ఈ ప్రదర్శన ఉంటుంది. అక్కడి గోడలపై తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసిన ప్రముఖుల జనన, మరణ తేదీలతో కూడిన చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు. తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే ఓ అద్భుత ప్రదేశంగా తెలుగు మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

  ఇదీ చదవండి: సాగర తీరంలో సాగర కన్యలు...సెల్పీలతో టూరిస్టుల సందడి.. ప్రత్యేకత ఏంటంటే?

  మరెన్నో ఆకర్షణలు

  కైలాసగిరిలో వివిధ పర్యాటక ఆకర్షణలను వీక్షించేందుకు టాయ్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ అనే రెండు విభాగాలు ఉంటాయి. దాని రేట్లు కూడా వేరువేరుగానే ఉంటాయి. పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.100 రుసుము వసూలు చేస్తారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులతో కలిసి ఇందులో సరదాగా షికారు చేయడం ఎంతో బాగుంటుంది. కైలాసగిరి ప్రాంతం ఎప్పుడూ దేశీ, విదేశీ పర్యాటకులతో సందడిగా ఉంటుంది.

  ఇదీ చదవండి: అలలపై కలల జర్నీ.. తక్కువ ఖర్చుతో ఫైవ్ స్టార్ రేంజ్ లగ్జరీ ప్రయాణం.. ధర ఎంతంటే?

  కైలాసగిరి వ్యూపాయింట్ అదుర్స్‌

  కైలాసగిరిలో వ్యూపాయింట్ గురించి చాలా చెప్పుకోవాలి. ఒక పక్క నీలి సముద్రం, మరోపక్క వైజాగ్ సిటీ, ఆర్కేబీచ్‌ రోడ్‌ …. ఎంత చూసినా చూడాలనిపించే సోయగం. ఇంకో అద్భుతమైన విషయం, శివ పర్వతాల విగ్రహం. కైలాసగిరి అనగానే గుర్తువచ్చేది ఈ విగ్రహాలే అంటుంటారు పర్యాటకులు..

  ఇదీ చదవండి : వెదురు అలంకరణకే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..? తెలిస్తే అస్సలు వదలరు..

  రోప్‌ వే అనుభూతి మాటల్లో చెప్పలేం..

  కేవలం 80/- తో కొండ దిగువన నుండి పై వరకు మనం రోప్‌వే ద్వారా వెళ్ళవచ్చు. వెళ్లి రావడానికి( రెండు ట్రిప్‌లు) రూ. 150 చెల్లించాలి. ఈ రోప్ వే ద్వారా కైలాసగిరి కొండపైకి వెళ్లొచ్చు. మెల్లగా కొండ అంచు నుండి వైజాగ్ అందాలు మరియూ బీచ్ ని తిలకిస్తూ పైకి వెళ్ళడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.


  టైమింగ్స్‌ : ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది.

  అడ్రస్‌ : P8XR+HVC, హిల్‌ టాప్‌ రోడ్‌, కైలాసగిరి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ - 530043

  ఫోన్‌ నెంబర్‌ : 089127 54133

  ఇదీ చదవండి : మూడు మతాల పవిత్ర స్థలాలు ఒకే చోట.. అక్కడకు వెళ్తే అదో అందమైన అనుభూతి.. ప్రత్యేకత ఏంటంటే?

  ఎలా వెళ్లాలి ?

  ఈ కైలాసగిరికి చేరుకోవడానికీ ఎన్నో దారులు వున్నయ్. మీరు బైక్ లేడా కార్ లో హనుమంత వాక జంక్షన్ నుచ్చి లేడ బీచ్ రోడ్ నుండి కొండ ఎక్కవచ్చు లేదా కాళీ నడక కూడా ఈ గిరి ఎతును చేరుకోవచ్చు. సిటీ బస్సులు కూడా మిమ్మల్ని కొండ పైకి చేరుతాయి. బస్టాండ్‌ నుంచి 10K బస్సు ఎక్కితే కైలాసగిరికి తీసుకెళ్తుంది. లేదా ఆటోకానీ, క్యాబ్‌గానీ బుక్‌ చేసుకుంటే ఫ్యామిలీతో సరదాగా వెళ్లిరావచ్చు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Local News, Vizag

  ఉత్తమ కథలు