Visakhapatnam: విశాఖ నుంచి పాలనకు డేట్ ఫిక్స్.. సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడే.. రాజమార్గం ఇలా

సీఎం క్యాంప్ ఆఫీసుకు రాజమార్గం

సీఎం జగన్ పూర్తిగా విశాఖకు వచ్చేస్తున్నారా..? క్యాంప్ కార్యాలయం ఎక్కడ అన్నది ఫిక్స్ అయ్యిందా..? విశాఖ వచ్చాక ఏ రోజు నుంచి పాలన ప్రారంభించాలి అన్న ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? సీఎం క్యాంప్ ఆఫీసు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు..

 • Share this:
  ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18.

  మొన్న ఢీల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ కలిసి వచ్చిన తరువాత పరిణమాలు చకచకగా మారిపోతున్నాయి. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. విశాఖ నుంచి పరిపాలనకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో ముఖ్యమంత్రి పరిపాలనకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సీఎం రాకపోకలుకు సంబంధించి రోడ్డు మార్గాన్ని అధికారులు ప్రతిపాదించి.. ఆ మేరకు ప్రణాళికలు కూడా వేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచీ ఇటు మధురవాడ వరకూ రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనుల్ని పరిశీలిస్తున్నారు. ప్రధానంగా సింహాచలం నుంచీ అడవివరం, ఆరిలోవ జంక్షన్ మీద నుంచీ మధురవాడ వరకూ ఉన్న మార్గంలో రోడ్డు పనులకు ఆలోచనలు చేస్తున్నారు. మహా విశాఖ నగర పాలక సంస్థ దీనికి సంబంధించి పలు రోడ్డు విస్తరణ పనులకు పూనుకుందని. ప్రభుత్వానికి దీనిపై నివేదిక ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలు నడుస్తాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ జులైలో విశాఖ నుంచి పాలన ప్రారంభం కావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పరిపాలన రాజధానిగా నగరానికి మెరుగులు దిద్దేలా మహా విశాఖ నగర పాలక సంస్థ కసరత్తు చేస్తోంది. విమానాశ్రయం మీదుగా నగరంలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక రహదారిని కేటాయించాలని భావిస్తోంది.

  క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే..

  ఇక విశాఖ వచ్చాక సీఎం నివాసం ఎక్కడుంటుంది అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా బీచ్‌రోడ్డులోని పలు ప్రాంతాల్ని అధికారులు పరిశీలించారు. రాజధాని ప్రాంతం ఎక్కడ ఉండాలన్న విషయంలో ఇప్పటికే చాలాసార్లు ప్రజా ప్రతినిధులు మాట్లాడుకున్నారు. భీమిలీ నియోజకవర్గంలోనే రాజధాని వస్తుందని మంత్రి అవంతి కూడా సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ తీరంలోని 35 కిలోమీటర్లలో ఉన్న ప్రభుత్వ భవనాల్ని, అలాగే పర్యాటక ప్రదేశాల్ని పరిశీలించారు. నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో బోయపాలెంలో ఓ విద్యా సంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. అలాగే ఐటీ సెజ్ లోని భవంతులను కూడా వినియోగించుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. బోయపాలెంలో గనక ముఖ్యమంత్రి కార్యకలాపాలు ప్రారంభిస్తే.. విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకూ రోడ్డు రెండు రకాలుగా ఉంది. ఒకటి నేషనల్ హైవే మీదుగా రావాలి. రెండో దారి విమానాశ్రయం నుంచీ ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా వెళ్లేలా 35 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేసింది.

  ఇదీ చదవండి: కేంద్రమంత్రిగా పవన్ కళ్యాణ్ కు ఛాన్స్.. రేసులో టీడీపీ మాజీ నేతలు.. త్వరలో విస్తరణ !

  అడ్డంకులు ఎన్నో...
  విశాఖ విమానాశ్రయం నుంచీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కాన్వాయ్ వెళ్లిపోగలగాలి. ఇలా జరగాలంటే ప్రస్తుత హైవే నుంచీ వెళ్లడానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువే. పదిహేను కిలోమీటర్ల హైవేలో దాదాపు ఇరవై ట్రాఫిక్ సిగ్నళ్లు, కూడళ్లు ఉన్నాయి. ఇప్పటికే భారీ వాహనాలు వస్తే.. నగర వాసులు వెళ్లడం కష్టతరమవుతోంది. ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రాకపోకలు ఉండాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్‌ఏడీ కూడలిలో పై వంతెన పూర్తయింది. ఎన్‌ఏడీ నుంచి హనుమంతవాక వరకు బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ (బీఆర్‌టీఎస్‌) ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు సాగలేదు. దీనిపై బుధవారం దీనిపై చర్చించే అవకాశాలున్నాయి. అక్కడి గృహాలకు టీడీఆర్‌ లేదా భూములు ఇవ్వడమా అన్నది యోచిస్తున్నారు. చట్టపరంగా ఓ పరిష్కారానికి రావాలని చూస్తున్నారు.

  ఇదీ చదవండి: రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి..! సీఎం జగన్ వ్యూహం ఫలిస్తుందా..?

  భోగాపురం పూర్తయితే.?

  విశాఖ విమానాశ్రయం పూర్తిగా నావికాదళం అధీనంలో ఉంది. ఇక్కడ నైట్ ల్యాండింగ్ కే దాదాపు కష్టమైన పరిస్థితి ఉంది. విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయమే అయినా.. నావికాదళం అధీనంలో ఉండటం వల్ల.. ప్రత్యేకమైన విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్లుగానో యోచిస్తోంది. గత ప్రభుత్వ హయంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రతిపాదన ఉంది... ఆమేరకు అడుగులు కూడా పడ్డాయి. ఈ ప్రభుత్వం కూడా భోగాపురం ఎయిర్ పోర్ట్ పై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. భోగాపురం పీపిపీ పద్ధతిలో నిర్మించే ఎయిర్ పోర్ట్ కావడం.. అదీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండటం వల్ల.. విమానాల రాకపోకలకు పెద్దగా అంతరాయం ఉండదు. కానీ ప్రస్తుత విమాశ్రయం నుంచీ ఎక్కువగా రాకపోకలు సాగించడం మాత్రం అంత సులువైన పని కాదని అధికారులు అంటున్నారు. భోగాపురం పూర్తయితే పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేని పాలనా సౌలభ్యం ఉంటుందని అంచనావేస్తున్నారు.. ఇదీ చదవండి: NDAలోకి వైసీపీ.. విజయసాయికి మంత్రి పదవి..! ఢిల్లీలో మారుతున్న రాజకీయం
  Published by:Nagesh Paina
  First published: