CM Jagan: ఐదు రోజులు బ్రేక్ తీసుకుంటున్న సీఎం జగన్.. హాలిడే టూర్ ప్లాన్ కు కారణం అదేనా..?

ఐదు రోజుల టూర్ కు సిద్ధమైన సీఎం జగన్

CM Jagan Tour: చాలా రోజుల తరువాత సీఎం జగన్ విరామం తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు.. సమావేశాలు, రివ్యూల పేరుతో నిత్యం పాలనలో బిజీగా ఉండే ఆయన.. ఇటీవల పార్టీకి కూడా టైం కేటాయించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా అన్నింటినీ పక్కన పెట్టి ఐదు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఈ ఐదు రోజులు ఏం చేయబోతున్నారో తెలుసా..?

 • Share this:
  AP CM Jagan family trip: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోషన్ రెడ్డి (Jagan Mohan Reddy).. బాధ్యతలు చేపట్టిన నుంచి పాలనపై తనదైన మార్కు చూపిస్తున్నారు. నిత్యం పరిపాలన వ్యవహారాలు, రాజకీయ కార్యకలాపాలతో బిజీగా గడుపుతూ ఉన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే లక్ష్యం.. ఏ రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు, విబేధాలు, పొరుగు రాష్ట్రంతో జల వివాదాలు.. అధికారులతో సమావేశాలు, సమీక్షలు.. పార్టీలో వర్గ పోరు పంచాయితీలు.. వీటన్నింటికీ కోర్టు కేసులు.. విచారణ ఏ రోజు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ.. ఇలా విరామం లేకుండా నిత్యం బిజీగా ఉంటున్నారు సీఎం జగన్.. వీటన్నింటి నుంచి సీఎం జగన్ కాస్త రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం అయన తరువాత ఆయన తన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండి.. కుటుంబానికి సమయం కేటాయించాలని నిర్ణయించారు. వారితో సంతోషంగా గడపాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం టూర్ ప్లాన్ చేశారు. సీఎం జగన్ కుటుంబసమేతంగా సిమ్లా (simla) పర్యటనకి వెళ్లనున్నారు. గురువారం అంటే ( 26th August 2021) మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి (tadepalli)లోని నివాసం నుంచి గన్నవరం (Gannavaram) విమానాశ్రయానికి వెళ్తారు. ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరతారు. 4 గంటలకు సిమ్లా లోని ఒబెరాయ్ హోటల్ కు చేరుకుంటారు.

  ఈ ఫ్యామిలీ టూర్ కు ప్రధాన కారణం.. సీఎం జగన్-భారతీల పెళ్లి దినోత్సవమే.. ఈ నెల 28న జగన్ వెడ్డింగ్ యానివర్శిరీ.. సరిగ్గా ఆ రోజుకు వారి పెళ్లి అయ్యి 25 ఏళ్లు పూర్తవుతుంది. 25 ఏళ్ల ప్రేమ బంధాన్ని గ్రాండ్ గా జరుపుకోవాలని భావిస్తున్నారు.. దీన్ని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబంతో కలిసి సిమ్లా టూర్ ప్లాన్ చేశారు. పెళ్లి రోజుతో సహా.. మరో నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులతో సీఎం జగన్ గడపనున్నారు. సీఎం సిమ్లా టూర్ కి అధికారులు ఏర్పాట్లు చేశారు.

  సీఎం జగన్ సిమ్లా టూర్ పైనా సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ సీఎం జగన్ బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు వస్తుందని అంతా భావించారు.. మీడియా (Media), సోషల్ మీడియా (Social Media)లో సైతం దీనిపై భారీగా ప్రచారం జరిగింది. బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన రెబల్ ఎంపీ రఘురామ రాజు (Raghu rama krishna raju)జగన్ బెయిల్ రద్దవ్వడం ఖాయమంటూ పదే పదే చెబుతూ వచ్చారు. దీంతో ఈ రోజు ఏం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ రోజు తీర్పు వస్తుందని అందరూ భావించినప్పటికీ ఈ కేసులో తీర్పును సెప్టెంబర్ 15వ (Verdict on Sept 15th) తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరో వైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy) సంబంధించిన బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా అదే రోజు తీర్పు వెలువరించనున్నట్టు సీబీఐ కోర్టు తెలిపింది. అంటే ఒకే రోజు రెండు కీలక తీర్పులు వెలువడనున్నాయి.

  ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం.. కొనసాగుతోన్న లెటర్ వార్.. వివాదం ఎందుకంటే?

  కచ్చితంగా ఇవాళ తీర్పు వస్తుందని అంతా భావిస్తే.. తీర్పును వచ్చే నెల 15కు సీబీఐ కోర్టు (CBI Court) వాయిదా వేసింది. దీంతో అంతా రిలాక్స్ అయ్యారు.. అయితే సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు నుంచి రిలాక్స్ రావడంతోనే.. ఇప్పుడు టూరుకు వెళ్తున్నారని.. బెయిల్ రద్దవుతుందని భావంచారని.. కానీ ఎవరూ ఊహించని విధంగా వాయిదా పడింది. అందుకే సీఎం జగన్ ఒత్తిడి నుంచి బయట పడ్డారని.. ఇన్ని రోజులూ ఒత్తిడి భరించిన ఆయన.. దాన్ని నుంచి రిలాక్స్ అవ్వడానికే ఇలా సడెన్ గా టూర్ ప్లాన్ చేశారంటూ విపక్షాలు అంటున్నాయి. జగన్ సైతం బెయిల్ రద్దు అవుతుందని భావించారని.. లేదంటే ముందుగానే టూర్ గురించి ఎందుకు వార్తలు రాలేదంటూ విపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: