హోమ్ /వార్తలు /ట్రావెల్ /

Anand Mahindra : పక్షి వీడియోతో ఆనంద్ మహీంద్రా సందేశం.. నెటిజన్లు ఖుషీ

Anand Mahindra : పక్షి వీడియోతో ఆనంద్ మహీంద్రా సందేశం.. నెటిజన్లు ఖుషీ

పక్షిలా చూస్తూ (image credit - twitter - @anandmahindra)

పక్షిలా చూస్తూ (image credit - twitter - @anandmahindra)

Anand Mahindra : తన ట్విట్టర్ అకౌంట్‌లో తరచూ సందేశాత్మక, ఫన్నీ వీడియోలను పోస్ట్ చేసే ఆనంద్ మహీంద్రా.. మరోసారి ప్రేరణాత్మక వీడియోని పోస్ట్ చేసి.. నెటిజన్ల మనసు దోచుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Anand Mahindra : పక్షుల లాగా మనం కూడా గాలిలో స్వయంగా ఎగిరితే ఎలా ఉంటుంది? శతాబ్దాలుగా ఈ కోరిక తీరట్లేదు. రకరకాల ప్రత్యామ్నాయాలతో ఎగరగలుగుతున్నా.. రెక్కలు లేని కారణంగా మనం స్వయంగా విహరించలేం. ఐతే.. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తాజాగా ఓ గద్దకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అందులో ఓ గద్ద ఆకాశంలో ఎగురుతూ వెళ్తోంది. ఆ పక్షికి అమర్చిన చిన్న కెమెరా వల్ల.. మనం కూడా ఆ పక్షితోపాటే ఎగురుతున్న ఫీల్ కలిగిస్తోంది ఆ వీడియో.

నవంబర్ 21, 2022న ఈ వీడియోని పోస్ట్ చేసిన మహీంద్రా.. "మనం కూడా ఆ పక్షిలాగా విశాల ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఈ వారాన్ని ప్రారంభించేందుకు ఈ వీడియో నాకు ప్రేరణ కలిగించింది. నేను ఎల్లప్పుడూ విశాల దృక్పథంతో ఆలోచించేందుకు ప్రయత్నిస్తాను" అని తెలిపారు. ఈ సందేశం నెటిజన్లకు నచ్చింది. దీన్ని మండే మోటివేషన్‌ (Monday Motivation)లా తీసుకున్నారు. ఈ వీడియోని ఇప్పటికే 18 లక్షల మందికి పైగా చూడగా.. 14 వేల మందికి పైగా లైక్ చేశారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

67 ఏళ్ల ఆనంద్ మహీంద్రాని ట్విట్టర్ లో కోటి మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఈ వీడియోపై వారు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. "మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మీకు బర్డ్ ఐ వ్యూ విశాల దృక్పథాన్ని కలిగిస్తుంది" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "ఇది అద్భుతంగా ఉంది. అరుదైన దృశ్యం" అని మరో యూజర్ మెచ్చుకున్నారు.

TTD : శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం .. డిసెంబర్ ఒకటి నుంచి అమలు

దీన్ని ఎలన్ మస్క్ చూడాలి అని ఓ యూజర్ కోరగా.. ప్రేరణ కోసం ఇలాంటిది తప్పక కావాలి అని మరో యూజర్ కోరారు. ఈ పోస్ట్ దేనిగురించైనా కావచ్చు.. ఈ వీడియో మాత్రం చాలా బాగుంది అని మరో యూజర్ మెచ్చుకున్నారు. పక్షులు అదృష్టవంతురాళ్లు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఇలా చాలా మంది కామెంట్స్ రాస్తున్నారు.

First published:

Tags: Anand mahindra, Trending, Trending video, Viral, Viral Video

ఉత్తమ కథలు