Halala Kanda: నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ డొక్కు బంగ్లాను కొన్నారు.. ఇప్పుడదే విల్లా రోజూ లక్షలు కురిపిస్తోంది..

హలల కంద విల్లా

2010లో వారు రూ.3 కోట్ల 22 లక్షలు చెల్లించి ఆ భవనాన్ని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడదే భవనం కాసుల వర్షం కురిపిస్తోంది.

 • Share this:
  ఒక్క ఐడియా..ఒకే ఒక్క ఐడియా.. వారి జీవితాన్నే మార్చేసింది. కోట్లకు కోట్ల ఆదాయం తెస్తోంది. నలుగురు మిత్రులు కలిసి ఓ పురాతన భవనం కొన్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఆ బంగ్లా శిథిలావస్థకు చేరుకుంది. ఐతే ఇప్పుడదే భవనం వారికి అదృష్టంగా మారింది. ప్రతి రోజు లక్షలు కురిపిస్తోంది. శ్రీలంకకు చెందిన డీన్ శార్ప్ వృతిరీత్యా ఇంటీరియర్ డిజైనర్. ఓ అటవీ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న పురాతన భవనం అతడిని ఎంతగానో ఆకర్షించింది. మరో ముగ్గురు మిత్రులతో కలిసి వెంటనే ఆ బంగ్లాను కొన్నారు. శిథిలావస్థలో ఊరుకు దూరంగా అడవిలో ఉన్న భవనం ఎందుకూ పనికి రాదని.. కోట్ల ఖర్చుతో ఎందుకు కొంటున్నాని చాలా మంది అడిగారు. అంత డబ్బు పెట్టడం అవసరమా? అని సలహా ఇచ్చారు. కానీ వీరు మాత్రం వినలేదు. వెంటనే డబ్బు చెల్లించి దాన్ని కొనేశారు. ఐతే సీన్ కట్ చేస్తే..అదే భవనం ఇప్పుడు వారికి బంగారు బాతులా మారింది. రోజుకు భారీగా ఆదాయాన్ని తెస్తోంది.

  శ్రీలంకలోని వెలిగామలో ఆ పురాతన భవనం ఉంది. 1912లో ఓ సంపన్నుడు తన భార్య కోసం నిర్మించారు. వందేళ్లకు పైగా వయసున్న బంగ్లా శిథిలావస్థకు చేరుకుంది. 2010లో దానిని కొనుగోలు చేసిన డీన్ శార్ప్.. హలల కందగా నామకరణం చేసి గెస్ట్‌హౌస్‌గా మార్చేశాడు. మొదట అది బూతు బంగ్లాగా ఉండేది. భవనం పైకప్పుపై చెట్లు మొలిచాయి. గోడలు బీటలు వారాయి. బంగ్లా లోపల గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. చూసేందుకే చాలా భయంకరంగా ఉండేది. ఐతే 2011లో దానిని డీన్ శార్ప్, అతడి మిత్రులు ఆధునీకరించారు. రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. డీన్ శార్ప్ స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్ కావడంతో ఆ భవనాన్ని చాలా అందంగా తయారు చేశారు. ఆధునాతన సౌకర్యాలు కల్పించి అద్భుతమైన గెస్ట్ హౌస్‌గా తీర్చిదిద్దారు. మొత్తంగా ఇంద్రభవనంగా మారిపోయింది. ఇప్పుడు హలల కంద ఫేమస్ హాలీడే డెస్టినేషన్‌గా పేరు తెచ్చుకుంది.

  హలల కంద గెస్ట్ హౌస్‌లో 5 బెడ్‌రూమ్స్, 4 బాత్‌రూమ్స్, ఓ పెద్ద కిచెన్, హాల్, గార్డెన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఉంది. 12 మంది వరకు ఎంచక్కా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. పచ్చటి అడవి మధ్య చాలా అందంగా ఉన్న ఈ గెస్ట్‌హౌస్‌లో ఉండేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. హాలీడేను ఎంజాయ్ చేసేందుకు చుట్టుపక్కల నుంచే కాకుండా..సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఐతే ఇందులో ఉండాలంటే ఒక్కరోజుకు రూ.లక్ష చెల్లించాలి. ఇలా రోజుకు లక్ష అంతకంటే ఎక్కువ డబ్బుతో డీన్ శార్ప్, అతడి మిత్రులకు భారీగా ఆదాయం తెస్తోంది. 2010లో వారు రూ.3 కోట్ల 22 లక్షలు చెల్లించి ఆ భవనాన్ని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడదే విల్లా కాసుల వర్షం కురిపిస్తోంది. ఆ బూతు బంగ్లాను ఎందుకు కొన్నారు? అని గతంలో అన్నవారే.. ఇప్పుడు డీన్ శార్ప్‌ను మెచ్చుకుంటున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: