దేశంలో కరోనా (Corona) వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్ టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. జికా వైరస్ (Zika Virus) తెలంగాణ (Telangana)లో కూడా మెల్లగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో జికా వైరస్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఎంఆర్ (ICMR), పుణేలోని ఎన్ఐవీ (NIV) నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని తెలిపింది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడింది.
1,475 నమూనాలను పరీక్షించగా..
జికా వైరస్ ఇండియాలోని అనేక రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. వైరస్ వ్యాప్తిపై నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ఈ అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలాయి. అందులో తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన నమునా కూడా ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు జికా వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతోందని అధ్యయనం తెలిపింది. ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది.
ఎలా సోకుతుంది..?
హైదరాబాద్ (Hyderabad)లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం. మరోవైపు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad) ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ (Epidemiologist) డాక్టర్ బీఆర్ శమ్మన్నా (BR Shamanna) స్పందించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు జీకా వైరస్‌ను గుర్తించడంపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. ఇంతకుముందు జీకా వైరస్ అంటే ఏంటో పెద్దగా తెలియదని.. ఇప్పుడు అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఇక, జీకా వైరస్ (Zika virus) దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి.
ఎందుకంత అలజడి?
అయితే జికా వైరస్‌పై అంతగా ఆందోళన పడటానికి కారణం ఉంది. డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చరించడమే దీనికి కారణం. వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి దోమల కాటు ద్వారా సంక్రమించే వ్యాధుల పెరుగుదలతో.. జికా కేసులు పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. 2017 నుంచి 20121 వరకు జికా వైరస్ దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కనుగొనబడింది. ఇక, గతంలో గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే జికా వైరస్ వ్యాప్తి చెందింది. ప్రతి సంవత్సరం గతంలో వ్యాప్తి చెందని కొత్త రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.