Home /News /telangana /

YSRTP PRESIDENT YS SHARMILA CRITICIZED CM KCR FOR GIVING TELANGANA MONEY TO FARMERS IN PUNJAB PRV

YS Sharmila: తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా?.. CM KCR​పై షర్మిలా ధ్వజం

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆవేదన వ్యక్తం చేశారు.

    సిద్దిపేట (Siddipet) జగదేవ్ పూర్ మండలానికి చెందిన రైతు దబ్బేట మల్లేశం మృతిపై వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. కేసీఆర్ సర్కార్ (KCR Government) నిర్లక్ష్యానికి సిద్దిపేటకు చెందిన ఈ రైతు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లేశం కుటుంబానికి షర్మిల సంఘీభావం ప్రకటించారు.  ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు, జవాన్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ (CM KCR)​ దేశంలోని పలు రాష్ట్రాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు పంజాబ్​ రైతులకు (Punjab Farmers) రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు కేసీఆర్​. దీనిపై షర్మిలా విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు తెలంగాణలోనే  (Telangana)పరిస్థితి సక్కగ లేదని.. పంజాబ్​ పోయి సాయం చేస్తున్నారని మండిపడింది. అంతేకాకుండా తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, విద్యార్థులకు ఫీజులు (Students Fee) కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు (Employees Salaries) ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా?' అని షర్మిల నిలదీశారు.

    కేసీఆర్​కు కనిపించడం లేదా..

    మరోవైపు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్ షర్మిల (YS Sharmila) ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సొంత జిల్లాలో సిద్దిపేటలో కూడా రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు, సర్పంచ్ లు ఆత్మహత్యాయత్నాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.



    వడ్డీలు కట్టలేక..

    పంట దిగుబడి లేక పెట్టుబడి రాక మీరు ఆదుకొంటారనే ఆశ చచ్చి సిద్ధిపేట రైతు మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడని షర్మిలా ట్విటర్​లో పేర్కొంది. 11లక్షల అప్పుతెచ్చి పంచాయితి పనులు చేస్తే చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఎల్లయ్య చావనికి ప్రయత్నించిండని ఆమె తెలిపింది. బిల్లులు చెల్లించక సర్పంచ్ ల ను ఇబ్బంది పెట్టింది ఇక చాలని షర్మిలా మండిపడింది. మీ దేశాన్నేలాలన్న దురదకు తెలగాణ బిడ్డల ముంచకు దొరా అని షర్మిల ధ్వజమెత్తింది. ఈ ఆత్మహత్యలు నీకు కనిపించడం లేదా అని కేసీఆర్​ను ఆమె ప్రశ్నించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Farmers, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు