Viral Video: చెంబులో మూగజీవి తల.. సాయం చేయడానికి వెళ్లిన షర్మిల పార్టీ నేత.. అసలు విషయం తెలిసి పరుగో పరుగు..

(Image- Twitter)

ఓ మూగజీవి తల చెంబులో ఇరుక్కుపోయింది. దీంతో అది కష్టాలు పడుతోంది. రోడ్డు మీద వెళ్తున్న ఆ మూగజీవి అవస్థను వైఎస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి గమనించారు.

  • Share this:
    ఓ మూగజీవి తల చెంబులో ఇరుక్కుపోయింది. దీంతో అది కష్టాలు పడుతోంది. రోడ్డు మీద వెళ్తున్న ఆ మూగజీవి అవస్థను వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి గమనించారు. అది పిల్లి అని భావించిన కొండా రాఘవరెడ్డి (Konda Raghava Reddy).. మానవతా దృక్పథంతో దానికి సాయం చేయాలని అనుకున్నారు. తన వాహనం ఆపి రోడ్డుపై వెళ్తున్న మూగజీవి వద్దకు చేరుకున్నారు. నెమ్మదిగా రోడ్డుపైన వెళ్తున్న మూగ జీవిని ఫాలో అయ్యారు. వెనకాల నుంచి వెళ్లి దాని పట్టుకున్నారు. చెంబులో నుంచి దాని తలను వేరుచేయాలని చూశారు. కానీ అప్పుడే అది పిల్లి కాదని.. పులి అని తెలుసుకుని షాక్ తిన్నారు. వెంటనే ఒక్కసారిగా దాని చేతుల్లో నుంచి కిందకు వదిలేశారు. ఈ క్రమంలోనే కొండా రాఘవరెడ్డి చిన్నగాయమైనట్టుగా తెలుస్తోంది.

    ఇక, అది చిరుతపులి పిల్ల (Baby Leopard) అని తెలియడంతో కొండా రాఘవరెడ్డి, అతని అనుచరులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొండా రాఘవరెడ్డి చేతిలో నుంచి కిందపడిపోయిన పులి పిల్ల కూడా అక్కడ నుంచి పొదల్లోకి పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా (Viral On Social Media) మారాయి.

    Singhu border killing: రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దుల్లో ఘోరం.. అత్యంత కిరాతకంగా హత్య.. ఈ హత్య చేసింది ఎవరు..?





    ఈ ఘటన అనంతరం చిరుతపులి పిల్లి సంచారం గురించి పోలీసులు, అటవీ శాఖ అధికారులకు కొండా రాఘవరెడ్డి సమాచారం అందించారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని, చిరుతతో పాటు దాని పిల్లలను కూడా పట్టుకోవాలని అధికారులను కోరారు. మరోవైపు చిరుతపులి పిల్ల రక్కడంతో కొండా రాఘవరెడ్డి స్థానిక ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజిక్షన్ తీసుకున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: