హోమ్ /వార్తలు /తెలంగాణ /

ys vijayamma : వైఎస్ఆర్ బిడ్డలు దొంగలు... గజదొంగలు కాదు... టీఆర్ఎస్‌కు కౌంటర్..!

ys vijayamma : వైఎస్ఆర్ బిడ్డలు దొంగలు... గజదొంగలు కాదు... టీఆర్ఎస్‌కు కౌంటర్..!

వైఎస్ విజయమ్మ (ఫైల్ ఫోటో)

వైఎస్ విజయమ్మ (ఫైల్ ఫోటో)

ys vijayamma :వైఎస్ఆర్ బిడ్డలు దోంగలు...గజదొంగలు అసలే కాదని వైఎస్ విజయమ్మ టీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.వారు ఉన్నది పంచడానికే వారు కష్టపడతారని, మాట ఇస్తే...తప్పరని పేర్కోన్నారు. నీటి సమస్యలు ఉంటే...చట్టపరంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇందుకోసం చాలా వ్యవస్థలు ఉన్నాయని అన్నారు. వాటిని ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలు బలంగా ఎదగాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు.

ఇంకా చదవండి ...

  వైఎస్ఆర్ బిడ్డలు దోంగలు...గజదొంగలు అసలే కాదని వైఎస్ విజయమ్మ టీఆర్ఎస్ పార్టీ

  మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.వారు ఉన్నది పంచడానికే వారు కష్టపడతారని, మాట

  ఇస్తే...తప్పరని పేర్కోన్నారు. నీటి సమస్యలు ఉంటే...చట్టపరంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇందుకోసం చాలా వ్యవస్థలు ఉన్నాయని అన్నారు. వాటిని ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలు బలంగా ఎదగాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు.

  వైఎస్ఆర్‌టీపీ ఆవిర్భావ సభలో వైఎస్ షర్మిలతో కలిసి పార్టీని ఆవిష్కరించారు. అంతకంటే ముందుగా ఆమె కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన్ను తెలంగాణ భవిష్యత్ నాయకుడిగా

  అభివర్ణించి...ఆయన చనిపోయిన తర్వాత కేసులు పెట్టి ... దోంగగా మార్చారని మండిపడ్డారు.


  అన్న..వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయాల కోసమే చలి ఎండా లెక్క చేయకుండా... మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల తన సోంత తండ్రి ఆశయాలను నెరవేర్చడంలో పట్టు సాధిస్తుందని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభ సంధర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణలో వైఎస్ఆర్ చేసిన అభివృధ్ది పనులతోపాటు ఆయన సేవలను స్మరించుకున్నారు. కాగా వైఎస్ మరణాన్ని తట్టుకోలేక  తెలంగాణలో ఎక్కువ మంది చనిపోయారని ఆమె గుర్తు చేశారు. అందుకే ఆయన ఆకాంక్షించిన తెలంగాణను సాధించేందుకు వైఎస్ షర్మిలను మీ చేతిలో పెడుతున్నానని చెప్పారు.

  మరోవైపు వైఎస్ షర్మిలను సైతం ఆమె సింహంతో పోల్చారు..రాజకీయాల్లో ఆడమగ తేడా లేదని..సింహం లాంటీ షర్మిల ఎదైనా సాధిస్తుందని చెప్పారు. అందుకు ఉదహారణ. ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాటు  చేసిన పాదయాత్రే నని చెప్పారు.  ఎండా, వానాకు తట్టుకుని షర్మిల ధైర్యంతో పాదయాత్ర చేశారని అన్నారు. అలాంటీ షర్మిల తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రజల ముందుకు వస్తోందని అన్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: YS Sharmila, YS Vijayamma

  ఉత్తమ కథలు