Home /News /telangana /

YS SHARMILA WAS OUTRAGED THAT TPCC CHIEF REVANTH REDDY HAD MADE CONTROVERSIAL REMARKS ON OTHER CASTES BUT THE CONGRESS SUPREMACY HAD NOT EVEN TAKEN ACTION PRV

YS Sharmila | Revanth reddy: రేవంత్​ రెడ్డి “కుల” వ్యాఖ్యలపై అధిష్టానం మందలించలేదేం?.. షర్మిలా ఫైర్​

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

ఇతర కులాలు నాయకత్వానికి పనికి రావని రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆక్షేపనీయం అని షర్మిలా అన్నారు. రేవంత్ ఇలా బరితెగించి మాట్లాడుతూ అధిష్టానం కనీసం చర్యలు కూడా తీసుకోలేదని ఆమె మండిపడ్డారు.

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC chief Revanth Reddy) ఒక దొంగ అని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila )మండిపడ్డారు. అంతేకాకుండా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలను విమర్శించారు. రెడ్డి సమాజానికి అధికారం ఇవ్వాలని, ఇతర కులాలు నాయకత్వానికి పనికి రావని మాట్లాడటం ఆక్షేపనీయం అని షర్మిలా అన్నారు. రేవంత్ రెడ్డి ఇలా బరితెగించి మాట్లాడుతూ అధిష్టానం కనీసం చర్యలు కూడా తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. సస్పెండ్ చేయలేదని, కనీసం మందలించలేదని అన్నారు.

    ఏనాడు కులాల పేరిట రాజకీయాలు చేయలేదు..

    బీజేపీ మత రాజకీయాలు (BJP religious politics) చేస్తున్నదని, కాంగ్రెస్ కుల రాజకీయాలు (Congress caste politics) చేస్తున్నదని షర్మిల ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇరువురూ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మండిపడ్డారు. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యల మాత్రం సరైనదని, వైఎస్సార్‌తోనే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారాన్ని చేపట్టగలిగిందని అన్నారు. వైఎస్సార్ ఏనాడు కులాల పేరిట రాజకీయాలు చేయలేదని, అన్ని కులాలు, మతాలను గౌరవించాడని వివరించారు. అంతేకానీ, రేవంత్ రెడ్డి వంటి బ్లాక్ మెయిలర్‌ను తెలంగాణ ప్రజలు గౌరవించదని స్పష్టం చేశారు.

    అయితే ఇప్పటికే రేవంత్ వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలు కాకుండా ఇటు సొంత కాంగ్రెస్​లోనూ విమర్శలు చేశారు. మధుయాష్కి సైతం రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.  ఇదిలా ఉండగా, బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నారని, మసీద్‌లను కూలగొడతామని బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు. శవాలు ఉంటే ముస్లింలవి అంటా.. శివుడు ఉంటే హిందువులవి అంటా.. ఉర్దూ బాష కూడా లేకుండా చేస్తారని దారుణంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఇలా మాట్లాడుతుంటే కనీస చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? అని అడిగారు.

    వడ్లను కొన్నారా?..

    మతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నదని, బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ.. పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగానే ఉన్నదని వివరించారు. అగ్గిపెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని, వారికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొన్నారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? ఎందుకు బీజేపీకి చాన్స్ ఇవ్వాలని నిలదీశారు. బీజేపీ ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారని, అది మోడీ, అమిత్ షాలతో కూడా కాదని, తాము అన్ని వర్గాలకు అండగా నిలబడతామని షర్మిలా అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు