హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: షర్మిలను జడ్జి ముందు హాజరుపరిచేందుకు రంగం సిద్ధం.. పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు

YS Sharmila: షర్మిలను జడ్జి ముందు హాజరుపరిచేందుకు రంగం సిద్ధం.. పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: మధ్యాహ్నం నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వ వైద్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. ఆమెకు పీఎస్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేసి అరెస్టయిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను(YS Sharmila) న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి(Osmania Hospital) తరలిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వ వైద్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. ఆమెకు పీఎస్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. కోర్టు సమయం పూర్తి కావడంతో.. న్యాయమూర్తి నివాసంలోనే షర్మిలను హాజరుపరచనున్నారు. షర్మిలతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ పోలీసులు మరికాసేపట్లో జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు.

షర్మిల అరెస్టుపై ఆమె తల్లి విజయమ్మ(Vijayamma) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బిడ్డను చూడడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా? పాదయాత్ర చేయకూడదా? అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారా అని మీడియా అడగగా ప్రారంభిస్తుందని నేను అనుకుంటానని అన్నారు. ఈ ఘటనపై ఎవరు కూడా ప్రశ్నించకపోవడం బాధ కలిగించిందని అన్నారు.

అంతకుముందు లోటస్ పాండ్ నుండి ప్రగతి భవన్ కు బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె డోర్ తీయకుండా అలాగే ఉండిపోయారు. దీనితొ షర్మిల కారులో ఉండగానే క్రేన్ సాయంతో సోమాజిగూడ నుండి SR నగర్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా ఆమె డోర్ తీయకపోవడంతో పోలీసులు లాఠీ సాయంతో కారు డోర్ తీశారు. అనంతరం ఆమెను పీఎస్ లోపలి తీసుకెళ్లారు.

ఫ్లాష్..ఫ్లాష్: వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్..పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి..కానీ..

Bandi Sanjay: భైంసాను దత్తాత తీసుకుంటాం..బహిరంగ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్ , రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. షర్మిల తన పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తూ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. Ysrtp పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పాదయాత్రకు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది.

First published:

Tags: Telangana, YS Sharmila

ఉత్తమ కథలు