Home /News /telangana /

YS SHARMILA SUPPORTS TO MINISTER KTR TWEET OF TEENMAR MALLANNA POLL VRY HYD

YS sharmila : మంత్రి కేటిఆర్‌కు మద్దతుగా నిలిచిన వైఎస్ షర్మిల... ఎందుకంటే..

ys sharmila

ys sharmila

YS sharmila : వైఎస్ఆర్‌టీపి అధినేత్రి వైఎస్ షర్మిల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన కొడుకుపై క్యూన్యూస్ మల్లన్న పెట్టిన ఒపినియన్‌ను పోల్‌పై ఆమె వ్యతిరేకించారు. ట్విట్టర్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు.

    మంత్రి కేటిఆర్ చేసిన ట్విట్‌కు రాజకీయ మద్దతు కూడా లభిస్తోంది. రాజకీయాల్లోకి కుటుంబాలను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ...పలువురు ఇప్పటికే మంత్రి కేటిఆర్‌కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత్రి షర్మిల కేటిఆర్‌కు మద్దతు పలికారు. దీంతో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా పిల్లలను రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదని... రాజకీయాల్లో మహిళలను , పిల్లలను కించపరిచినా.. రాజకీయాలకు అతీతంగా కలిసి రావాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు.

    కాగా నిన్న ఇటివల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ యూటూబ్ చానల్లో.. రాష్ట్ర అభివృద్దిపై ఒపినియన్ పోల్ నిర్వహించాడు.. ఆ పోల్‌లో భాగంగా రాష్ట్రంలో అభివృద్దిపై ప్రశ్నించాడు.. రాష్ట్రంలో అభివృద్ది ఎక్కడ జరిగింది అంటూ...1 భద్రాచలం గుడిలోనా... లేక 2 కేటిఆర్ కొడుకు హిమాన్షు శరీరంలోనా.. అంటూ పోల్ నిర్వహించాడు..

    అయితే ఈ పోల్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తీన్మార్ మల్లన్ననిర్వహించిన పోల్‌పై ఫైర్ తీవ్రంగా అయ్యారు. ఇందుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాను ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.. బీజేపీ నేతలకు నేర్పే సంస్కృతి ఇదేనా... అంటూ ప్రశ్నించారు. మీ పార్టీ నేతలకు కూడా ఇదే నేర్పుతున్నారా అంటూ ప్రశ్నించారు.. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా కుటుంబంపై ఇలాంటీ విమర్శలు చేస్తే పరిస్థితి ఏమిటని ..మీరు ఏమైనా ఆలోచించారా అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    Double Marriage : ఒకే జంట.. పిల్లలకు ముందు ఓసారి .. ఆ తర్వాత మరోసారి.. !

    మరోవైపు జర్నలిజం పేరిట వ్యక్తి స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకు హిమాన్షుపై పోల్ పెట్టి శరీరంపై ఒపినియన్ అడగడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని, ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందన్నారు. సోషల్ మీడియాను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు అనుకూలంగా మారాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా నిత్యం అర్థంలేని విషయాలను ప్రసారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఇందులోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

    KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్

    ఇక కేటిఆర్ ట్వీట్‌తో ఆయన మద్దతుదారులు మల్లన్నపై దాడికి యత్నించారు. ముసుగులు ధరించి ఆయన ఇంటికి వెళ్లి కొట్టె ప్రయత్నం చేశారు. దీంతో మల్లన్న జరిగిన దానిపై వివరణ ఇచ్చారు.. ఆ పోల్ తాను పెట్టలేదని ఎవరో హ్యక్ చేశారని చెప్పారు. అయినా కేటిఆర్ మద్దతు దారులు ఆయనతో వాగ్వావాదానికి దిగారు.. ఉప్పల్‌లోని శనార్ధి తెలంగాణ కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్‌ను ధ్వంసం చేసి వీడియో టీఆర్ఎస్ మద్దతుదారుల గ్రూపుల్లో పోస్ట్ చేశారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: KTR, Teenmar mallanna, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు