YS SHARMILA : కేటిఆర్ అనుచరులు ఎంత గింజుకున్నా...మా పోరు ఆగదు..! షర్మిల కౌంటర్..ట్వీట్స్..

వైఎస్ షర్మిల ఫైల్ ఫోటో

YS SHARIMLA : మంత్రి కేటీఆర్ పుట్టినరోజునాడు వైఎస్ఆర్‌టీపి అధ్యక్షురాలు చేసిన శుభాకాంక్షల ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు...దీంతో అనుచరుల ట్వీట్స్‌కు మరోసారి ఘాటైన సమాధానం ఇచ్చారు షర్మిల. ఎవరెన్ని మాట్లాడిన తమ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు.

 • Share this:
  శనివారం ఐటి మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులతోపాటు మంత్రులు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున నిర్వహించారు. బర్త్ డే సంధర్బంగా మూడు కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్వాప్తంగా లక్షల మంది మొక్కలు నాటారు.

  ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్‌టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాస్త వెరైటిగా శుభాకాంక్షలు చెప్పింది..ఓ వైపు గ్రీటింగ్స్ చెబుతునే మరోవైపు సున్నితంగా రాజకీయ విమర్శ చేస్తూ ట్వీట్ చేసింది. బర్త్‌ డే నాడు కూడా వైఎస్ షర్మిల మాత్రం తన స్టైల్లో స్పందించారు. రాజకీయ ప్రత్యర్థిగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూనే... ఆయన్ను నేరుగా మంత్రి కేటిఆర్‌గా కాకుండా మరోసారి సీఎం కేసిఆర్ గారి కొడుకు కేటిఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

  మరోవైపు ఆయనకు భగవంతుడు ఆయురాగ్యోలతోపాటు రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే శక్తిని ఇచ్చే విధంగా లక్షా 91 వేల ఉద్యోగ ఖాలీలను భర్తి చేసే పట్టుదలను ఇవ్వాలని కోరుకుంది. దీంతోపాటు 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నానని ట్వీట్ చేశారు.

  అయితే షర్మిల చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ మద్దతుదారులంతా షర్మిలపై సెటైర్లు వేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు ఘాటైన రిప్లైలు ఇచ్చారు. ఇదివరకే కేటీఆర్ ఎవరో తెలియదని చెప్పావ్ మరి విషెస్ దేనికని ప్రశ్నించారు. ఇక షర్మిల ఎన్ని జిమ్మిక్కులు చేసినా..తెలంగాణలో ఆమె పార్టీకి ఉనికి ఉండదని మరికొంతమంది అన్నారు. దీంతో మరోసారి నిన్న చేసిన ట్వీట్ పై షర్మిల స్పందించారు. ఉద్యోగాలు ఇవ్వాల‌ని కోరినందుకు కేటీఆర్ మ‌ద్ద‌తుదారులు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆమె చెప్పారు.

  మా పోరాటం గళమెత్తిన శ్రీకాంత్ లాంటి యువకుల ఆత్మహత్యలు ఆపడమే.చిన్న దొరగారు ఆడవాళ్లు వ్రతాలె చేసుకొవాలె అన్నప్పుడు నిద్రనటిస్తూ నిన్నటి పుట్టినరోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లేచి నిరుద్యోగుల సమస్యలపైన మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు KTR గారి సైన్యానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.  మీ వ్యక్తిగత దూషణతో మా పోరాట స్పూర్తిని మరింత పెంచారు. మా కన్న మెము ఎంచుకున్న పోరాటం గొప్పది. మీరు మమ్మల్ని అనిచివేయాలని ఎంత గింజుకున్నా యువతకు ఉద్యోగాలిచ్చె వరకు మా పోరు సాగుతనే ఉంటది. అంతవరకు మీకు ప్రతిరోజు మీ చేతగానితనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాం అంటూ చురలకంటించింది.ఈ సంధర్భంగా ఆత్మహత్య చేసుకున్న యువతి వీడియోను పోస్ట్ చేసిన షర్మిల నేడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువకుడు శ్రీకాంత్ గ‌తంలో పాడిన ఓ పాట‌కు సంబంధించిన వీడియో కూడా షర్మిల పోస్ట్ చేశారు.
  Published by:yveerash yveerash
  First published: