YSR Statue: జేసీబీతో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. తీవ్రంగా ఖండించిన YS Sharmila

ఖమ్మంలో వైఎస్ విగ్రహం ధ్వంసం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

  • Share this:
    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసకుంది. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. వివరాలు.. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని శివాయిగూడెం స్టేజి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైంది. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా వైసీపీ నాయకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ ఆధ్వర్యంలో విగ్రహం ధ్వంసమైన చోట ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు నిరసన తెలియజేశారు.

    వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటనపై ఆయన కుమార్తె వైఎస్ షర్మిల స్పందించారు. దీనిని పిరికిపంద చర్యగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. "విగ్రహాలు ధ్వంసం చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్‌ను తొలగించలేరు" అని ఆమె పేర్కొన్నారు.

    YSR statue damaged, YSR statue vandalised, YSR statue vandalised In Khammam, Ys Sharmila, YSR Statue, వైఎస్ విగ్రహం ధ్వంసం, వైఎస్సార్, వైఎస్ షర్మిల, తెలంగాణ, ఖమ్మం YSR statue damaged, YSR statue vandalised, YSR statue vandalised In Khammam, Ys Sharmila, YSR Statue, వైఎస్ విగ్రహం ధ్వంసం, వైఎస్సార్, వైఎస్ షర్మిల, తెలంగాణ, ఖమ్మం

    ఇక, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల(YS Sharmila) వేగంగా పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 9న ఆమె పార్టీని ప్రకటించనున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆమె తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. వారి వద్ద నుంచి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. అలాగే విద్యార్థులతోనూ షర్మిల సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కొందరు ఆమె పార్టీలో చేరేందుకు క్యూ కట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: