హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: హిజ్రాల దెబ్బకు క్షమాపణ చెప్పిన వైఎస్ షర్మిల..వీడియో

Telangana: హిజ్రాల దెబ్బకు క్షమాపణ చెప్పిన వైఎస్ షర్మిల..వీడియో

Telangana: హిజ్రాల దెబ్బకు క్షమాపణ చెప్పిన వైఎస్ షర్మిల..వీడియో

హిజ్రాలకు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై ట్రాన్స్ జెండర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హిజ్రాలకు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై ట్రాన్స్ జెండర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. హిజ్రాలను అవమానించాలని..కించపరచాలని తనకు లేదని శంకర్ నాయక్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో అలా అన్నానన్నారు. హిజ్రాలను అవమానించాలని YSR బిడ్డకు లేనే లేదు. తన మాటల వల్ల  హిజ్రా అక్కాచెల్లెళ్ల మనోభావాలు దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానన్నారు.

Hyderabad: గుడిలోచోరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయిన దొంగ.. ఏం జరిగిందంటే?

ఈ సమాజంలో హిజ్రాలకు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని షర్మిల (YS Sharmila) అన్నారు. ఇక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకొని..మర్యాద, గౌరవం లేని నాయకుడని తాను విమర్శించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. తాను హిజ్రా బాగోగుల గురించి ఆలోచించే మనిషినని షర్మిల చెప్పుకొచ్చారు. YSRTP అధికారంలోకి వస్తే హిజ్రాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. అలాగే పావలా వడ్డీకి లేదా సున్నా వడ్డీకి రుణాలు కూడా అందిస్తామన్నారు. హిజ్రాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని షర్మిల హామీనిచ్చారు. కేసీఆర్ సర్కార్ పాలనలో హిజ్రాలను పట్టించుకున్న పాపాన పోలేదని షర్మిల మండిపడ్డారు. హిజ్రాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఫించన్లు ఇచ్చారా అని షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.

Gajwel: కేసీఆర్ ఇలాఖాలో ముదురుతున్న 'మున్సిపల్' పంచాయతీ.. రాజీనామా యోచనలో కౌన్సిలర్లు

కాగా ఇటీవల మహబూబాబాద్ లో పాదయాత్ర చేసిన షర్మిల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఉద్దేశిస్తూ..తమ ప్రస్తావన తేవడంపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మహబూబాబాద్ సభలో షర్మిల ట్రాన్స్ జెండర్లను కించపరిచేలా మాట్లాడారు. మేం చేతగాని వాళ్లమని మాట తప్పేవారమని..దేనికి పనికి రామని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని' హిజ్రాలు చెప్పుకొచ్చారు. తమకు షర్మిల క్షమాపణ చెప్పాలని..లేదంటే పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. హిజ్రాలను కించపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ట్రాన్స్ జెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. తమ కమ్యూనిటీని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని, తెలుగు రాష్ట్రాల్లోని హిజ్రాలకు షర్మిల బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో స్పందించిన షర్మిల ట్రాన్స్ జెండర్లకు క్షమాపణలు చెప్పారు. దీనితో వివాదం సద్దుమణిగినట్లైంది.

First published:

Tags: Telangana, YS Sharmila

ఉత్తమ కథలు