YS SHARMILA RYTHU YATRA REACHED TO NIRMAL DISTRICT VRY ADB
Nirmal : నిర్మల్‌కు చేరుకున్న రైతు ఆవేదన యాత్ర..జిల్లాలో రైతుల పరామర్శ
YS Sharmila Rythu yatra
Nirmal : వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర నిర్మల్ జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఆమె చెపట్టిన యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది.
వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తలపెట్టిన రైతు ఆవేదన నిర్మల్ జిల్లాకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా దిల్వర్పూర్ మండలం, కాల్వ తండాలో ఆత్మహత్య చేసుకున్న రైతు బానోత్ అంబర్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. అనంతరం జిల్లాలోని మంజులాపూర్ మీదుగా సారంగాపూర్, చించొలిఎక్స్ రోడ్ మీదుగా రైతు ఆవేదన యాత్ర కొనసాగుతుంది. సారంగపూర్ మండలంలోని రాణాపూర్ తండాలో రాతోడ్ సేశురావు అనే రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి మామడ మండలంలోని తాండ్ర గ్రామానికి చేరుకుంటారు. తాండ్ర గ్రామంలో నాయుడు భీమన్న అనే రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శిస్తారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.