YS Sharmila: పంజాగుట్టలో వైఎస్ షర్మిల అనుచరుల ఆందోళన.. ఆ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్..

Image-Twitter

హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్ షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు.

  • Share this:
    హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్ షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో వైఎస్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని షర్మిల అనుచరులు డిమాండ్ చేశారు. జోహర్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో షర్మిలకు మద్దతు తెలుపుతున్న కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్‌లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రాజశేఖరరెడ్డిని అభిమానించే లక్షలాది మంది ప్రజలు ఉన్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తాము ప్రతిఘటించాల్సి వస్తుందని అన్నారు. ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు.

    ఇక, ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని శివాయిగూడెం స్టేజి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జేసీబీతో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. దీంతో పలువురు వైఎస్ అభిమానులు శనివారం అక్కడ ఆందోళన నిర్వహించారు.

    YSR Statue: జేసీబీతో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. తీవ్రంగా ఖండించిన YS Sharmila

    ఈ ఘటనపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. రాజన్న సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలని ప్రజల్లో పెరుగుతున్న బలమైన నమ్మకాన్ని, విశ్వాసారి తట్టుకోలేక కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. దీనిని పిరికిపంద చర్యగా అభిప్రాయపడ్డారు. అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. "విగ్రహాలు ధ్వంసం చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్‌ను తొలగించలేరు" అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: