YS SHARMILA FIRES ON CM KCR AND MINISTER KTR ONCE AGAIN IN ONE DAY HUNGER STRIKE VRY
ys sharmila Deeksha : బాత్రూంలకు కూడా బుల్లెట్ ఫ్రూఫ్‌లు....వారికి నిరుద్యోగులంటే విలువ లేదు
ys sharmila Deeksha : బాత్రూంలకు కూడా బుల్లెట్ ఫ్రూఫ్‌లు
ys sharmila Deeksha : ఒక్కరోజు దీక్ష సంధర్బంగా మరోసారి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగింది. కేఆర్‌ను ప్రశ్నిస్తే తట్టుకోలేని ఆయన అనుచరులు వ్యక్తిగత దూషణలకు దిగారని మండిపడింది. సీఎం కేసీఆర్ కు పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టి కేవలం కుటుంబ సిద్దాంతాలనే ఫాలో అవుతున్నారని ఆమె విమర్శించారు.
ప్రతి మంగళవారం ఉద్యోగ చేస్తున్న వైఎస్ షర్మిల నేడు నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో మూడవ మంగళవారం దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆమె మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు తెలంగాణలోని నిరుద్యోగులపై చిత్తశుద్ది లేదని ఆమె విమర్శించారు.వీళ్లంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
ఇక తెలంగాణలో 54లక్షల మంది యువత తమకు ఉద్యోగాలు లేవని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని,. ఏడేండ్లలో నాలుగు రెట్లు నిరుద్యోగం పెరిగింది. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే దున్నపోతు మీద వానపడ్డట్టు కేసీఆర్ లో మాత్రం చలనం లేదని విమర్శించింది. ఎవరు ఎట్ల చస్తే నాకేంటి? నా కుటుంబంలో అయిదుగురికి ఉద్యోగాల ఉన్నాయని కేసీఆర్ మురిసిపోతున్నాడని పేర్కోంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజే ఉద్యోగం రాక పాక శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా కేసీఆర్‌కు కనువిప్పు కలుగలేదని మండిపడింది. కేసీఆర్‌కు పార్టీ ఎజెండా, పార్టీ సిద్ధాంతాలు లేవు...కేవలం ఫ్యామిలీ సిద్ధాంతాలే ఉన్నాయని దుయ్యపట్టింది.
ఇటివల కేసీఆర్ కొడుకు పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెబుతూనే.. ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరాం. అది జీర్ణించుకోలేక అతని అనుచరులు వ్యక్తిగతంగా దాడి చేసే వరకూ వెళ్లారు. అసలు మీకు ఎందుకు కోపం వచ్చింది? ఓ యువతి ఫీజు రీయింబర్స్ మెంట్ అందక ఆత్మహత్య చేసుకునే వీడియో పెడితే కోపమొచ్చిందా?. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ యువతి ప్రాణాలు పోయాయి. ఆత్మహత్యలకు కేసీఆరే కారణం. ఇవి ఆత్మహత్యలు కాదు ప్రభుత్వ హత్యలు అంటు మండిపడింది. పుట్టడం గొప్ప కాదు ప్రజలకు సేవ చేయడం గొప్ప. అది వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలి.
ఇక రాష్ట్రంలో ఏ పార్టీ ప్రశ్నించడం లేదు. ప్రతిపక్షంగా మేం ప్రశ్నిస్తే, తాము తప్పు చేసినట్లుగా టీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ చెబుతుంటే వాటిని భర్తీ చేయాల్సి బాధ్యత కేసీఆర్‌కు లేదా ? లోన్లు ఇప్పించి, నిరుద్యోగులకు మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ దొరలేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకుంటున్నారు. బాత్ రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటున్నారు. వాళ్ల ప్రాణాలకేమో విలువ ఉంది. ప్రజల ప్రాణాలకు విలువ లేదా? వీళ్లేమో పండుగలు, పుట్టినరోజులు చేసుకోవాలి. నిరుద్యోగులేమో ఆత్మహత్యలు చేసుకోవాలా? అంటూ ప్రశ్నించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.