కేసీఆర్ సర్కార్ పై YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (ys Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి, పేదలకు 3 ఎకరాల భూమి, దళితబంధు ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని నిప్పులు చెరిగారు. ఇక కాంట్రాక్టర్ గా ఉన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇప్పుడు A1 కాంట్రాక్టర్ గా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే భూములు కబ్జాలు చేసింది వాస్తవం కాదా. ఏకంగా మందకృష్ణ మాదిగ భూమిని ఈయన కబ్జా చేయాలని చూడడం నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు.
ఇక మంత్రి ఎర్రబెల్లి గ్రామమైన పర్వతగిరిలో పర్యటించాను. రాష్ట్రంలో సర్పంచ్ ల బాధ వర్ణాతీతంగా ఉంది. అయినా కానీ మంత్రి ఎర్రబెల్లి వారి సమస్యలపై స్పందించట్లేదన్నారు. నేను వైఎస్సార్ బిడ్డను. మీ దాడులకు భయపడేది లేదు. మీరు ఎంతగా దాడులు చేస్తే అంతకంటే ఎక్కువగా, గట్టిగా మీ అవినీతిపై మాట్లాడుతాం అన్నారు. కాగా షర్మిల (ys Sharmila) చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఇటీవల ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నిన్న వర్ధన్నపేటలో పాదయాత్ర కొనసాగించిన షర్మిల (ys Sharmila) అక్కడి నాయకుల అవినీతిపై ఇవాళ మీడియాతో మాట్లాడారు.
ఎక్కడైనా ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే..
పాదయాత్ర ఎక్కడైనా ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టాం. ఇక మళ్లీ వర్ధన్నపేటలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు మా ప్లెక్సీలను చించేశారు. అలాగే పాదయాత్రను కవర్ చేస్తున్న మీడియాపై కూడా దాడి చేశారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల సమస్యలను ఎత్తి చూపినందుకేనా ఇదంతా చేసేది. రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. కేజీ టు పీజీ విద్య, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని, పింఛన్లు ఇలా మోసం చేస్తూ వస్తున్నారు. వీటన్నింటిపై బీఆర్ఎస్ ను నిలదీసినందుకేనా ఈ దాడులు అని షర్మిల (ys Sharmila) ప్రశ్నించారు.
ఓట్ల రాజకీయం..
మీవి ఓట్ల రాజకీయాలని, ప్రజల పట్ల ప్రభుత్వానికి ప్రేమ లేదని షర్మిల అన్నారు. ఈ అబద్దపు వాగ్ధానాలను నిలదీయడమే తప్పా. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న ఆరోపణలనే మేము ప్రస్తావించాం. అందుకు నిన్న వర్ధన్నపేటలో మరోసారి దాడికి పాల్పడ్డారు. ఎవరెన్ని చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం ఎప్పుడూ అండగా ఉంటుందని షర్మిల (ys Sharmila) చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Errabelli Dayakar Rao, Telangana, YS Sharmila, Ysrtp