హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ((rape of a minor girl who went to a pub in the Jubilee Hills area of Hyderabad)) ఘటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల (YS Sharmila) స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై (CM KCR) తీవ్ర విమర్శలు చేశారు. "ఆరేండ్ల పాపకు, పదహారేండ్ల అమ్మాయికి, అరవై ఏండ్ల బామ్మకు రక్షణ లేదు కేసీఆర్ రాజ్యంలో. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి వారం రోజులైనా నిందితులను పట్టుకునే దిక్కులేదు. ఉన్నోనికి చట్టం చుట్టమైతే లేనోనికి న్యాయం బజార్లో దొరుకుతుందా? గ్యాంగ్ రేపులో TRS పార్టీకి చెందిన నాయకుల బంధువులు, మిత్రపక్షం MLAల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం? ఇది బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవం. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ.. డ్రగ్స్కు అడ్డాగా హైదరాబాదు మారుస్తూ.. ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా చేసిన KCR, ఇప్పుడు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు." అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
మిత్రపక్షం MLAల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం? ఇది బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవం,
రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ,
డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ ను మారుస్తూ
ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా చేసిన KCR, ఇప్పుడు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.2/2
— YS Sharmila (@realyssharmila) June 4, 2022
ఏం జరిగింది?
వారం కిందట అమ్నేషియా పబ్ సమీపంలో మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు పలువురు నిందితులు. బాలికను పబ్‌కు తీసుకెళ్లిన ఆడి కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల పాటు మైనర్ బాలికపై కారులోనే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మరో కారులో పబ్ దగ్గర బాలికను వదిలివెళ్లారు.తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాలిక ఆమె తండ్రికి వివరించింది. దీంతో బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె తండ్రి.. తన కూతురుపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పబ్, బేకరీతో పాటు పలు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇందులో ఒకరు వీఐపీ కుమారుడిగా తెలిసింది. టీఆర్ఎస్ నేతకు నిందితుడికి రిలేషన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ అత్యాచార(Rape Incident) ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. మరోవైపు ఈ ఘటనలో తన ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలపై హోంమంత్రి మహమూద్ అలీ మనవడు పుర్జాన్ స్పందించారు. తాను ఎవరికీ పబ్‌లో పార్టీ ఇవ్వలేదని అన్నారు. ఘటన జరిగిన రోజు తాను ముంబైలో ఉన్నానని తెలిపారు. అసలు ఘటనకు పాల్పడిన నిందితులు ఎవరో తనకు తెలియదని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఘటనలో ఎవరున్నారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Minor girl raped, YS Sharmila