ys sharmila : శభాష్ సీఎం కేసీఆర్ గారు...మీ పాలన మహా అద్భుతం. వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో )

ys sharmila : వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై మండిపడింది..శభాష్ కేసీఆర్ అంటూ ఎద్దెవా చేసింది. చిన్న పిల్లలతో పాటు గిరిజన మహిళలను జైలుకు పంపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని ఫైర్ అయింది.

 • Share this:
  ఇటివల అటవి శాఖ అధికారులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటుండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు.. ఈనేపథ్యంలోనే అటు అటవిశాఖ అధికారులకు ఇటు గిరిజనులకు మధ్య దాడులు కూడా కొనసాగుతున్నాయి..ఒక దశలో పోలీసులు బలవంతంగా పోడు భూముల్లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్న సంధర్భంలో అనేక మంది గిరిజనులు వారిపై దాడులకు ఎగబడ్డారు...

  ఈ నేపథ్యంలోనే ఇటివల ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలంలో అటవిశాఖ అధికారులపై దాడులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మొత్తం 23 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు..అనంతరం వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు..అయితే అరెస్టై జైలుకు వెళ్లిన వారిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు..మరోవైపు ఆ మహిళల్లో ముగ్గురికి చంటి పిల్లలు కూడా ఉండడంతో పోలీసులు కనీసం వారిని కూడా వదిలిపెట్టలేదు. దీంతో వారిపై హత్య కేసు నమోదు చేసి కోర్టు ముదు హాజరు పరచడంతో వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.

  అయితే ఇదే విషయంపై వైఎస్ షర్మిల తీవ్రంగా సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. శభాష్ KCR గారు .. మొన్న దళిత మహిళ లాక్ అప్ డెత్ .. ఈ రోజు గిరిజన చంటిపిల్లలున్న మహిళా రైతులను జైల్లో పెట్టించారు .. మీ పాలన మహా అద్భుతం. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి .. ఈ రోజు పోడు చేసుకొంటున్న మహిళా రైతులను జైల్లో పెట్టించారు KCR సారు, గిరిజనులు లేకపోతే అడవి లేదు .వాళ్ళు లేకపోతే పర్యావరణం లేదు .. అయినా అడవిని నాశనం చేస్తున్నారంటూ .. భూఅక్రమణదారులని .. గిరిజనులపై ఆక్రమణ కేసులు పెడుతూనే ఉంది KCR ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల భుజాల మీద తుపాకులను పెట్టి వారిని .. అడవినుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారు .. KCR దొర. అంటూ ఆమె ట్వీట్ చేశారు.
  Published by:yveerash yveerash
  First published: