హోమ్ /వార్తలు /తెలంగాణ /

YSRTP OFFICIAL LAUNCH : తెలంగాణ గడ్డమీద వైఎస్ఆర్ బిడ్డ... పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల

YSRTP OFFICIAL LAUNCH : తెలంగాణ గడ్డమీద వైఎస్ఆర్ బిడ్డ... పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల

 తెలంగాణ గడ్డమీద వైఎస్ఆర్ బిడ్డ...పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల

తెలంగాణ గడ్డమీద వైఎస్ఆర్ బిడ్డ...పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల

YS sharmila party announce : తెలంగాణలో మరోపార్టీకి అంకురార్పణ జరిగింది. స్వర్గీయ వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల నూతన పార్టీని ప్రకటించింది. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణగా ఆమె స్వయంగా ప్రకటించారు. పార్టీకి చెందిన జెండాను విజయమ్మతో కలిసి డిజిటల్ స్క్రీన్‌పై ప్రారంభించారు.. హైదరాబాద్‌ రాయదుర్గలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసిన సభా వేదికపై వైఎస్ షర్మిల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ...కాగా పార్టీ జెండాను పాలపిట్ట, నీలం రంగుతో కూడిన తెలంగాణ మ్యాప్‌‌తో పాటు మధ్యలో వైఎస్ఆర్ ఫోటోతో రూపోందించారు.

ఇంకా చదవండి ...

  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి సంధర్బంగా వైఎస్ షర్మిల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు షర్మిల ఇడుపులపాయలోని కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ సమాధివద్ద నివాళులు అర్పించారు.

  అనంతరం ఆమె నేరుగా మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ నుండి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. కాగా విమానాశ్రయంలో ఆమెకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. షర్మిల పార్టీ కార్యకర్తల ర్యాలీతో కలిసి పంజాగుట్టలోని వైఎస్ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


  ఆ తర్వాత కార్యకర్తలు రాయదుర్గలోని సభవేదికకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతోపాటు పలువురు నేతలు సభలో పాల్గోన్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుండే సభవేదిక వద్దకు కార్యకర్తలు భారి ఎత్తున చేరుకున్నారు. కాగా సభ ప్రాంగణానికి వైఎస్ షర్మిల సాయంత్రం అయిదు గంటలకు తల్లి విజయమ్మతో కలిసి చేరుకున్నారు. ఆ వెంటనే సభా స్థలంలో ఏర్పాటు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకు గంట ముందు షర్మిల భర్త అనిల్ సభాస్థలానికి చేరుకుని  ఏర్పాట్లను పరిశీలించారు.

  ఇక సభ షర్మిల పార్టీ అవిష్కరణకు ముందే ... వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పార్టీ జెండాను డిస్‌ప్లే చేశారు. జెండాలో తెలంగాణ మ్యాప్‌ నుండి   వైఎస్ఆర్ చేతులు ఊపుకుంటూ అభివాదం చేస్తున్నట్టుగా రూపోందించారు. తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల పేర్లు ఒక్కోక్కటిగా డిస్‌ప్లే అయ్యాయి. ఆ సమయంలోనే తెలంగాణ గడ్డ మీద వైఎస్ఆర్ బిడ్డా అంటూ క్యాప్షన్ పెట్టారు.

  ఇక షర్మిల పార్టీ ప్రస్థానం మొత్తం మూడు నెలల్లోనే పూర్తయింది.. రాజకీయాల్లోకి ప్రవేశించిన షర్మిల  ఖమ్మంలో ఏప్రిల్ 9న  సంకల్ప సభలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా సభకు అనుమతి ఇచ్చింది. దీంతో సుమారు ఆరువేల మందితో సభను కొనసాగించారు. తాను తెలంగాణ బిడ్డనే అంటూ ప్రసంగం సాగించిన షర్మిల..అచ్చు వైఎస్ఆర్‌ వలే చేతులు ఊపుతూ.. ప్రజలను ఆకట్టుకుంది.

  కాగా పార్టీని పెడతామని ప్రకటించిన తర్వాత ముందుగా నిరుద్యోగాలపై ఫోకస్ పెట్టింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ ఇందిరాపార్క్ వద్ద ఏప్రిల్ 15న 72గంటల పాటు నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. అయితే.. ఆ దీక్షకు పోలీసులు ఒక్కరోజే అనుమతి ఉందని అడ్డుకుని అరెస్ట్ చేసి లోటస్ పాండ్‌వద్ద వదిలిపెట్టారు. కాని.. ఆమె మాత్రం తాను ముందుగా ప్రకటించినట్టుగానే 72 గంటలపాటు లోటస్‌పాండ్‌లోని ఇంటివద్దనే దీక్ష చేపట్టారు..

  ఆ తర్వాత పలు జిల్లాలు పర్యటన చేస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైఎఎస్ఆర్ మృతి తర్వాత తెలంగాణలో చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తూనే...మరోవైపు నిరుద్యోగ యువత ,ఆత్మహత్య కుటుంబాలను ఓదార్చారు. ఈనేపథ్యంలోనే షర్మిల నేరుగా సీఎం కేసిఆర్‌ను టార్గెట్ చేస్తూ.. పలు విమర్శలను ఎక్కుపెట్టారు..దీంతో ఆమె కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు తెలంగాణ పోలీసులు చేశారు. ఇక పరిస్థితి చూస్తే... రానున్న రోజుల్లో కూడా నిర్భంధం మరింత పెరగనుంది..అలాంటీ పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతుంతో వేచి చూడాలి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Telangana, YS Sharmila

  ఉత్తమ కథలు