Home /News /telangana /

YS RAJASHEKAR REDDY CLOSE AIDE AND EX MINISTER MAY JOIN YS SHARMILA NEW POLITICAL PARTY IN TELANGANA AK

షర్మిల పార్టీలోకి వైఎస్ఆర్ సన్నిహితుడు.. ఆ పార్టీకి షాక్.. చక్రం తిప్పుతారా ?

వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల

YS Sharmila: వైఎస్ హయాంలో కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించిన ఆ మాజీమంత్రికి ప్రస్తుతం కాంగ్రెస్‌లో అంతగా ప్రాధాన్యత లేదనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆయన పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని.. వైఎస్ షర్మిల సైతం ఆ సీనియర్ నేత సేవలను తన పార్టీ కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో పాటు వివిధ వర్గాలతో షర్మిల సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో తాను పెట్టబోయే కొత్త పార్టీ ఎలా ఉండాలి ? ప్రజలు తమ పార్టీని ఆదరించాలంటే ఏం చేయాలి ? అనే దానిపై ముఖ్యనేతలతో పాటు సామాన్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. ప్రజల్లోకి వచ్చేనాటికి వీటిపై పూర్తి క్లారిటీతో రావాలన్నది షర్మిల అభిమతమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే షర్మిల పార్టీలోకి తెలంగాణలోని పెద్ద నాయకులు ఎవరు చేరుతారు ? అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. వైఎస్‌తో సన్నిహితంగా ఉండే ఒక మాజీమంత్రి షర్మిల పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    వైఎస్ హయాంలో కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించిన ఆ మాజీమంత్రికి ప్రస్తుతం కాంగ్రెస్‌లో అంతగా ప్రాధాన్యత లేదనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆయన పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని.. వైఎస్ షర్మిల సైతం ఆ సీనియర్ నేత సేవలను తన పార్టీ కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరిగాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేస్తారని సమాచారం. అయితే ఆయన నేరుగా షర్మిల కొత్త పార్టీలో చేరతారా ? లేక ఆయన వారసులను అందులో చేర్పించి.. వెనుక ఉండి రాజకీయ సలహాలు ఇస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.

    ఇక గతంలో వైఎస్‌తో సన్నిహితంగా ఉండి తాము ఉంటున్న పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపై వైఎస్ షర్మిల టీమ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అలాంటి వారిని గుర్తించి వైఎస్ షర్మిల నేరుగా వారితో టచ్‌లోకి వెళుతున్నారని.. పార్టీలో సముచిత స్థానం ఇస్తానని హామీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొందరు నేతలు నేరుగా తాము షర్మిల పార్టీలో చేరకపోయినా.. తమ వారసులను ఆమె పార్టీలోకి పంపించే ఆలోచన చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో తన పార్టీ పటిష్టత కోసం తన తండ్రి సన్నిహితులనే ఎక్కువగా టార్గెట్ చేశారని అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, YS Sharmila, YSR

    తదుపరి వార్తలు