హోమ్ /వార్తలు /తెలంగాణ /

YouTuber Suicide: పాపం ఓ యూట్యూబర్ పురుగుల మందు తాగాడు .. కారణం అదేనంట

YouTuber Suicide: పాపం ఓ యూట్యూబర్ పురుగుల మందు తాగాడు .. కారణం అదేనంట

youtuber suicide

youtuber suicide

YouTuber Suicide: తన కళకు తగిన గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వస్తుందనే నమ్మకంతో అప్పులు చేసి యూట్యూబ్‌ ఛానల్ నిర్వహించాడు. అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఆర్ధికంగా చితికిపోయి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఏం చేసాడో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Medak, India

    (K.Veeranna,News18,Medak)
    ఇప్పుడున్న యువత తమ టాలెంట్‌ని ఏదో రకంగా నలుగురికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం సోషల్ మీడియా(Social media)నే సరైన వేదిక అని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే క్రేజ్‌తో ఉపాధి, ఉద్యోగం దొరుకుతుందని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే ఓ జానపద కళాకారుడు(Folk artist)ప్రయత్నించి చివరకు ప్రాణం తీసుకున్నాడు. తన కళకు తగిన గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వస్తుందనే నమ్మకంతో అప్పులు చేసి యూట్యూబ్‌ ఛానల్(YouTube channel)నిర్వహించాడు. అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఆర్ధికంగా చితికిపోయి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక...ఆస్తులు అమ్ముకోలేక చివరకు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న ఘటన మెదక్(Medak)జిల్లాలో చోటుచేసుకుంది.


    Telangana : హాస్టల్‌ స్టూడెంట్ శవంతో బంధువులు రోడ్డుపై ఆందోళన .. చావుకు కారణమైన వారిపై చర్యలకు డిమాండ్



    ప్రాణం తీసిన యూట్యూబ్‌ చానల్..

    మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఓ యూట్యూబర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కౌడిపల్లి గ్రామానికి చెందిన ఆలాషి నవీన్ గౌడ్ యూట్యూబ్ చానల్ ద్వారా జానపద పాటలను ప్రసారం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు పాటలు స్వయంగా రచించి, పాడి రిలీజ్ చేశాడు. సాంగ్స్ చేయడానికి తన  స్నేహితులతో పాటు పరిచయస్తుల దగ్గర 5లక్షలకుపైగా అప్పు చేశాడు. యూట్యూబ్ చానల్‌ తన జీవితాన్ని మార్చేస్తుందని జానపద కళాకారుడు నవీన్‌ ఆశ పడ్డాడు. అదే తన పాలిట శాపంగా మారుతుందని భావించలేకపోయాడు.



    అప్పులే కొంప ముంచాయి..

    తాను చేసిన జానపదగీతాలకు తగిన గుర్తింపు రాకపోవడం అప్పులు తీర్చేందుకు గతంలో కొంత పొలం అమ్ముకున్నాడు నవీన్. అప్పటికి అప్పులు తీరలేదు. మిగిలిన వాళ్లకు అప్పులు తీర్చేందుకు మార్గం లేకపోవడంతో ఈనెల 17వ తేదీన పొలం వద్ద పురుగుల మందు  తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే వారు చికిత్స నిమిత్తం మెదక్  ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా  ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు నవీన్. మృతుడి తండ్రి యాదగౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ శివప్రసాదరెడ్డి తెలిపారు.


    Telangana Traffic Police: రాత్రి పూట ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాల్సిన అవసరం లేదా? యాక్సిడెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ పోలీస్



    ప్రాణాలు తీసిన ఐడియా..

    ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మంది యువతి, యువకులు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారానే అనేక రకాలుగా ఆదాయం పొందుతున్నారు. వాళ్లనే ఆదర్శంగా తీసుకున్నాడు నవీన్. అయితే సొంతగా అప్పుచేసి యూట్యూబ్‌ చానల్ పెట్టడం..అది ఊహించిన స్థాయిలో జనంలోకి వెళ్లకపోవడం వల్లే మనస్తాపానికి గురయ్యాడు. డబ్బులు అప్పిచ్చిన వాళ్లు వెంటపడుతూ ఉండటంతో ఇక వేరే గత్యంతరం లేక ప్రాణాలు తీసుకున్నాడని స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Medak, Suicide, Telangana News, Youtube star

    ఉత్తమ కథలు