నాగార్జున సాగర్ ప్రవాహంలో పర్యాటకుడు గల్లంతు

యువకుడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నదిలో గల్లైంతన యువకుడిని జహీరాబాద్‌కు చెందిన నర్సింహగా గుర్తించారు.

news18-telugu
Updated: August 12, 2019, 5:22 PM IST
నాగార్జున సాగర్ ప్రవాహంలో పర్యాటకుడు గల్లంతు
సాగర్ ప్రవాహలో పర్యాటకుడు గల్లంతు
  • Share this:
నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు తెరిచిన వేళ విషాదం చోటు చేసుకుంది. వరద ప్రవాహంలో ఓ పర్యాటకుడు కొట్టుకుపోయాడు. శివాలయం ఘాట్ దగ్గర స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నదిలో గల్లైంతన యువకుడిని జహీరాబాద్‌కు చెందిన నర్సింహగా గుర్తించారు. అతడి కోసం గజ ఈతగాళ్లు నదిలో గాలిస్తున్నారు. కృష్ణా నదిలో ఉప్పొంగి ప్రవహిస్తోందని...ఐనా అక్కడ పోలీస సెక్యూరిటీ లేదని స్థానికులు చెప్పారు.

నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివెళ్తున్నారు. నర్సింహ కూడా స్నేహితులతో కలిసి సోమవారం ఉదయం సాగర్‌కు వెళ్లాడు. అతనికి ఈత రావడంతో శివాలయం ఘాట్ దగ్గర నదిలో దిగాడు. ఐతే కొంత దూరం ముందుకు వెళ్లడంతో అక్కడ వరద ప్రవాహం పెరిగిపోయింది. అంతకంతకూ వరద పెరగడంతో నర్సింహ నదిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనతో పోలీస్ సిబ్బంది డ్యామ్ పరిసరాల్లో సెక్యూరిటీ పెంచారు. నదిలో స్నానాలకు ఎవరినీ అనుమతించడం లేదు.

వీడియో కోసం ఇక్కడ చూడండి:
Published by: Shiva Kumar Addula
First published: August 12, 2019, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading